అమెరికా స్టూడెంట్స్ వీసాల్లో కోత,ఇకపై డాలర్ డ్రీమ్స్ కనకపోతో బెటర్ ,స్టూడెంట్ వీసాలపై అమెరికా కొర్రీ…!
అమెరికా వెళ్లి చదువుకోవడం నేటి యువతకు ఓ డ్రీమ్ల... ఎలాగోలా అగ్రరాజ్యంలో ఎంటరై అక్కడే చదివి అక్కడే ఉద్యోగం కొట్టేసి కాలర్ ఎగరేయాలన్నది వారి కోరిక.

అమెరికా వెళ్లి చదువుకోవడం నేటి యువతకు ఓ డ్రీమ్ల… ఎలాగోలా అగ్రరాజ్యంలో ఎంటరై అక్కడే చదివి అక్కడే ఉద్యోగం కొట్టేసి కాలర్ ఎగరేయాలన్నది వారి కోరిక. ఇంజనీరింగ్ పూర్తైన వెంటనే అమెరికా ఫ్లైట్ ఎక్కేయాలని కలలు కంటున్నారు. వారి తల్లిదండ్రులు కూడా అంతే. మా వాడు అమెరికాలో చదువుకుంటున్నాడనో, మా అమ్మాయి అక్కడ ఉద్యోగం చేస్తుందనో చెప్పుకోవడం ఓ గర్వంగా ఫీలవుతున్నారు. కానీ ఇకపై డాలర్ డ్రీమ్స్ డౌటే. ఎందుకంటే విద్యార్థులకు వీసాలు ఇవ్వడంపై కూడా కొర్రీ పెడుతోంది అగ్రరాజ్యం. లేటెస్ట్ రిపోర్ట్స్ అగ్రరాజ్యంలో పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా చెబుతున్నాయి. ఇండియన్ స్టూడెంట్స్ ఫ్యూచర్ ప్లాన్స్‌పై ఎఫెక్ట్ చూపుతున్నాయి.
గత సంవత్సరం అమెరికా స్టూటెండ్ వీసాలను భారీగా రిజక్ట్ చేసింది. దాదాపు 41శాతం మంది వీసాలను తిరస్కరించారు. అంటే వందమంది అప్లయ్ చేస్తే అందులో 41మందికి నిరాశే మిగిలింది. గత పదేళ్లలో రిజక్షన్ రేటు ఈసారే ఎక్కువ. 2014తో పోల్చితే ఈసారి తిరస్కరణ రేటు రెట్టింపైంది. గతేడాది 6లక్షల 79వేలమంది F1 వీసా అంటే స్టూడెంట్ వీసా కోసం అప్లికేషన్ దాఖలు చేశారు. అందులో 2లక్షల 79వేల మందికి నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది అమెరికా. 2022-23తో పోల్చితే ఇది ఏకంగా 5శాతం ఎక్కువ. అయితే 41శాతం రిజక్షన్ రేటు అన్ని దేశాలది. ఏ దేశంలో ఎంతమందికి నో చెప్పారన్న వివరాలను అమెరికా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఓ అంచనా ప్రకారం 2024 తొలి 9నెలల్లో 38శాతం మంది భారతీయ విద్యార్థులకు నిరాశే మిగిలింది.
గత కొన్నేళ్లుగా అమెరికా స్టూటెండ్ వీసా రిజక్షన్ రేటు ఎలా ఉందో ఓసారి చూద్దాం… 2014లో 23శాతం మంది విద్యార్థులకు వీసాలు తిరస్కరించారు. 2016లో అది 34శాతానికి పెరిగింది. అంటే అప్పటికి ట్రంప్ ఫస్ట్ టైమ్ పవర్‌లో ఉన్నారు. 2018లో 35, 2020లో 31శాతం మంది స్టూడెంట్స్‌కు నిరాశ తప్పలేదు. 2021లో 20శాతం, 2022లో 35శాతం, 2023లో 36శాతం, 2024లో ఏకంగా 41శాతం స్టూడెంట్ వీసాలు రిజక్ట్ అయ్యాయి. 2023లో లక్షా 4వేల మంది భారతీయ విద్యార్థులకు యూఎస్ వీసా దక్కితే అది 2024లో 64వేలకు పడిపోయిందని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. నిజానికి విద్యార్ధులకు ఈ స్థాయిలో వీసాలు తిరస్కరించడం బైడెన్ టైమ్‌లోనే జరిగింది. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చారు. ఆయన కంటే ఈయన మరింత ముదురు. కత్తెర పట్టుకుని తిరుగుతున్నాడు. అన్ని వీసాల్లోనూ కోత పెడుతున్నాడు. ఇప్పుడు స్టూడెంట్ వీసాల విషయంలోనూ అదే స్ట్రాంగ్ రూట్‌లో వెళుతున్నారు. ఆయన రాగానే అసలు అమెరికా స్టూడెంట్ వీసా రాదని చాలామంది డిసైడైపోయారు. అందుకే గత కొన్ని నెలలుగా F1 వీసా అప్లికేషన్లు తగ్గిపోయాయి.
ఇంతకీ స్టూడెంట్ వీసాలు ఎందుకు రిజక్ట్ అవుతున్నాయి అంటే స్పష్టమైన కారణాలు చెప్పడం కష్టం. రూల్స్ ఫాలో అవడంలో అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు ముందుంటారు. మాములుగానే స్ట్రిక్ట్. అలాంటిది ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా నో అనేస్తారు. వాళ్ల మూడ్ బాగోలేకపోయినా మన వీసాకు మూడుతుందన్నమాట. మీరు చదువుకోసం వెళ్లి అక్కడే ఉండిపోతారన్న అనుమానం వచ్చినా చాలు సారీ చెప్పేస్తారు. వాళ్లను క్వశ్చన్ చేసే రైట్ కూడా మనకు ఉండదు. ఎందుకు రిజక్ట్ చేశారో కూడా చెప్పాల్సిన అవసరం వారికి లేదు. F1 వీసాల్లో ఎంత కోత పడితే అది మనకు అంత ప్రమాదకరం.
అమెరికా స్టూడెంట్ వీసా దరఖాస్తుల్లో ఎక్కువ భాగం భారతీయులవే. ఇప్పుడు ట్రంప్ ఎంత కోత పెడితే మనకు అంత లాస్. అమెరికా ఒక్కటే కాదు ప్రస్తుతం బ్రిటన్‌లో కూడా ఇదే పరిస్థితి. డిపెండెంట్లను తీసుకొచ్చే విదేశీ విద్యార్థులపై బ్రిటన్ పరిమితి పెట్టింది. దీంతో బ్రిటీష్ యూనివర్శిటీల్లో ఎన్‌రోల్‌మెంట్స్ 40శాతం పడిపోయాయి. పైగా అక్కడ ఖర్చు ఎక్కువ. ఇక కెనడా కూడా స్టూడెంట్ వీసాలపై లిమిట్ పెట్టింది. హౌసింగ్, హెల్త్‌కేర్, పబ్లిక్ సర్వీసులపై ప్రభావం పడుతోందంటూ 35శాతం వీసాల్లో కోత విధించింది. 2024లో ఆ దేశం 54శాతం స్టూడెంట్ వీసాలను రిజక్ట్ చేసేసింది. ఆస్ట్రేలియా వీసా అప్లికేషన్ల సంఖ్య 38పర్సంట్ పడిపోయింది. ఇక 2024 ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండాఫ్‌లో 25శాతం మేర విద్యార్థి వీసాలను తగ్గించేశారు. మొత్తంగా చూస్తే మన విద్యార్థులు ఇకపై విదేశాల్లో చదువుకోవడం కాస్త కష్టమే. ఫ్యూచర్ ఏ మాత్రం బ్రైట్‌గా కనిపించడం లేదు. కాబట్టి సైలెంట్‌గా మన దగ్గరే బెస్ట్ యూనివర్శిటీల్లో చదువుకోవడం బెటర్.