BJP WITH TDP: జనసేన, టీడీపీతో పొత్తుకు బీజేపీ రెడీ.. పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారా..?
పవన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ, జనసేన రెండు పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నట్టు తాము భావిస్తున్నామంటూ అందరికీ షాకిచ్చారు. ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకునే అంశాన్ని బీజేపీ హైకమాండ్‌తో చర్చిస్తామన్నారు.
BJP WITH TDP: ఏపీ పాలిటిక్స్‌లో జనసేన, టీడీపీ పొత్తు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబును ములాఖత్‌లో కలిసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. జైలు నుంచి బయటకు రాగానే టీడీపీ, జనసేన పొత్తును ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయంటూ చెప్పేశారు. అయితే, అప్పటికే బీజేపీతో అలయన్స్‌లో ఉన్న జనసేన.. తన నిర్ణయాన్ని బీజేపీతో చర్చించిందా లేదా అనేది ఎవరికీ తెలియదు. దీనిపై బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందో అని అంతా ఎదురుచూస్తున్న టైంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి సంచలన కామెంట్స్ చేశారు.
పవన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ, జనసేన రెండు పార్టీలు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తు పెట్టుకున్నట్టు తాము భావిస్తున్నామంటూ అందరికీ షాకిచ్చారు. ఆ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకునే అంశాన్ని బీజేపీ హైకమాండ్‌తో చర్చిస్తామన్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితికి అనుగుణంగా జాతీయ నాయకత్వం సూచనమేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. చంద్రబాబుకు పురందేశ్వరి బంధువు అనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు గురించి సానుకూలంగా స్పందించడంతో ఈ మూడు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయనే చర్చ మొదలైంది. మొన్నటి వరకూ టీడీపీ విషయంలో బీజేపీ వైఖరి వ్యతిరేకంగా ఉంది.
జనసేనతో పొత్తుకు ఓకే అన్నా.. టీడీపీతో కలిసి వచ్చేందుకు మాత్రం బీజేపీ సిద్ధంగా లేదు. కానీ ఇప్పుడు మాత్రం పొత్తు గురించి చర్చిస్తామంటూ బీజేపీ అధ్యక్షురాలే స్వయంగా చెప్పడంతో ఏపీలో అలయన్స్ కన్ఫామ్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారికంగా ప్రకటన చేయడం మాత్రమే తరువాయి అంటున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఏపీ రాజకీయాల్లో ఇంకా ఎలాంటి ట్విస్ట్‌లు వస్తాయో చూడాలి.