DANAM NAGENDER: దానంకి మినిస్ట్రీ కావాలట ! సికింద్రాబాద్ టిక్కెట్టు ఎవరికో ?
దానం నాగేందర్ అసలు మంత్రి పదవిపై ఆశతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. దాంతో పక్కాగా తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశపెట్టుకున్నారు.
DANAM NAGENDER: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంత్రి పదవిపై మనసు పారేసుకున్నారు. అసలు పార్టీలోకి వచ్చేటప్పుడే మినిస్టర్ గిరీ అడిగారట. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సికింద్రాబాద్ ఎంపీకి పోటీ చేయమని కోరింది. అందుకోసం ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలని ఆదేశించింది. రిజైన్‌కు దానం ఒప్పుకోకపోవడంతో.. సికింద్రాబాద్‌లో వేరే అభ్యర్థిని నిలబెట్టాలని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ పెద్దలు.
Pothina Mahesh: జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా..
దానం నాగేందర్ అసలు మంత్రి పదవిపై ఆశతోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా దక్కలేదు. దాంతో పక్కాగా తనకు మంత్రి పదవి ఇస్తారని ఆశపెట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. ఎంపీగా దిగమని ఆదేశించడంతో ఇరుకునపడ్డారు. MLA పదవికి రిజైన్ చేయడానికి దానం ఒప్పుకోకపోవడంతో అధిష్టానం కోపంగా ఉంది. దానంని మారుస్తారనీ.. సికింద్రాబాద్ ఎంపీ టిక్కెట్లు GHMC మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి ఇస్తారన్న టాక్ నడిచింది. కొత్తగా మేయర్ గద్వాల విజయలక్ష్మి పేరు కూడా వినిపిస్తోంది. దానం.. బొంతు.. గద్వాల.. ఈ ముగ్గురులో సికింద్రాబాద్‌లో నిలబడే అభ్యర్థి ఎవరన్నది తెలీక కాంగ్రెస్ కేడర్ అయోమయంలో ఉంది. ఓవైపు సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మరోవైపు కాంగ్రెస్ కేండిడేట్ పద్మారావు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్ళి ఓటర్లను కలుస్తున్నారు.
కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఇక్కడ ప్రచారంలో వెనకబడింది. దానం నాగేందర్ ప్రచారం చేయడానికి రాలేదు. ఆయన కాకపోతే వేరే ఎవరినైనా నిలబట్టాలని సికింద్రాబాద్‌లో కేడర్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ ఇంకా.. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది. పండగ తర్వాత వాటిని ఫైనల్ చేసేటప్పుడే సికింద్రాబాద్ సంగతి కూడా తేల్చేస్తుందని అనుకుంటున్నారు.