KAVITHA BOOK : వాట్సాట్ డేటా డిలీట్.. అడ్డంగా దొరికిన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో ఎమ్మెల్సీ కవిత (MLC's poem) అడ్డంగా బుక్కయ్యారు. ఇన్నాళ్ళూ తనకు ఏ పాపం తెలియదని బుకాయిస్తున్నా... కస్టడీ రిపోర్టులో ఆమె వ్యవహారం మొత్తాన్ని ఈడీ బయటపెట్టింది.

Delete WhatsApp data.. A poem found across
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో ఎమ్మెల్సీ కవిత (MLC’s poem) అడ్డంగా బుక్కయ్యారు. ఇన్నాళ్ళూ తనకు ఏ పాపం తెలియదని బుకాయిస్తున్నా… కస్టడీ రిపోర్టులో ఆమె వ్యవహారం మొత్తాన్ని ఈడీ బయటపెట్టింది. ఈడీ వాదనతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు కవితను ఏడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈనెల 23 దాకా ఈడీ కస్టడీలో ఉంటారు కవిత. ఆ తర్వాత 23 నాడు మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో కవితను తిరిగి హాజరు పరుస్తారు ఈడీ అధికారులు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు ప్రమేయం లేదనీ… తనపై అన్యాయంగా కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత మొదటి నుంచీ బుకాయిస్తున్నారు. కానీ అసలు సౌత్ లాబీ గ్రూప్ ని ఆమె అన్నీ తానై వ్యవహరించినట్టు ఈడీ తేల్చేసింది. ఆప్ కి 100 కోట్లు అందజేయడంలోనూ కవితే కీలకంగా వ్యవహరించారు. తన బినామీ ఇండో స్పిరిట్ అధినేత రామచంద్ర పిళ్ళై ద్వారా డీల్ నడిపినట్టు ఈడీ కస్టడీ రిపోర్టులో క్లియర్ గా తెలిపింది. మాగుంట ద్వారా 30 కోట్లు ఢిల్లీకి ఇచ్చారు. ఈ 30 కోట్లను అభిషేక్ బోయినల్లి ఢిల్లీకి తీసుకెళ్ళారని ఈడీ కుండబద్దలు కొట్టింది.
కవిత తన స్టేట్‌మెంట్ రికార్డింగ్ సందర్భంగా గత ఏడాది మార్చి 21నాడు ఈడీకి తన 9 ఫోన్లను సమర్పించారు. మొబైల్స్ ధ్వంసం చేశారన్న ఆరోపణలు రావడంతో… తనకే పాపం తెలియదనీ…. అందుకే వాటిని కవర్ లో పెట్టి ఈడీకి ఇచ్చినట్టు కవిత బయటకు బిల్డప్ ఇచ్చారు. కానీ అసలు ఆ మొబైల్స్ లో ఏ డేటా లేదు… కవిత తన మొబైట్స్ ఆధారాలన్నీ డిస్ట్రాయ్ చేసినట్టు ఈడీ రిపోర్టులో తెలిపింది. ఫేస్ టైమ్ యాప్ ను వాడుతున్నట్టు కూడా ఆమె ఒప్పుకుంది. ఈడీకి ఇచ్చిన ఫోన్లలో వాట్సాప్ డేటా లేదు. ఫేస్ టైం డేటా కూడా లేదు. ఈ ఫోన్లన్నీ ఫార్మాట్ చేసినట్టు గుర్తించామంది ఈడీ. సెల్ ఫోన్లలో డేటా రికవరీ కోసం NFSUకి పంపారు అధికారులు. ఫోరెన్సిక్ పరీక్షలు… నివేదిక ప్రకారం… కవితకు ఈడీ (ED) నోటీసులు ఇచ్చాకే… ఫార్మాట్ చేసినట్టు కూడా బయటపడింది. లిక్కర్ కేసులో తన వ్యవహారం బయటకి రాకుండా ఉండేందుకు ఫోన్లలో డేటా ను ఫార్మాట్ చేశారు. ఇదే అంశాన్ని గత విచారణ సందర్బంగా కవితని ప్రశ్నించామనీ… కానీ ఆమె సమాధానం చెప్పకుండా దాటవేశారని కస్టడీ రిపోర్టులో ఈడీ అధికారులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తాను అమాయకురాలిని అని చెబుతున్న కవిత, BRS నాయకులు… ఇప్పుడు డేటా డిస్ట్రాయ్ కి సంబంధించి ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారు… జనాన్ని ఎలా నమ్మిస్తారన్నది చూడాలి.