Arvind Kejriwal: జైలు నుంచి ఆదేశాలిస్తున్న కేజ్రీవాల్.. సీరియస్ అయిన ఈడీ..
తాను జైలులో ఉన్నప్పటికీ పాలన కొనసాగిస్తానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అంతేకాదు.. అన్నట్లుగానే.. కస్టడీ నుంచి ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ తాగునీటి సమస్య గురించి ఆదేశాలిచ్చారు. దీనిపైనే ఈడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. తమ కస్టడీలో ఉండగానే.. సీఎంగా అధికారిక ఆదేశాలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను ఈ నెల 21న అరెస్టు చేశారు. ఈ నెల 28 వరకు ఆయనను కస్టడీలో ఉంచి, విచారించనున్నారు. మరోవైపు.. తాను జైలులో ఉన్నప్పటికీ పాలన కొనసాగిస్తానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Raja Singh Lodh: అలక వీడని రాజాసింగ్.. పార్టీకి దూరం..
అంతేకాదు.. అన్నట్లుగానే.. కస్టడీ నుంచి ఇటీవల అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ తాగునీటి సమస్య గురించి ఆదేశాలిచ్చారు. దీనిపైనే ఈడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. మంగళవారం మరో ఆర్డర్ పాస్ చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న క్లినిక్‌లలో ఔషధాల కొరత లేకుండా చూసుకోవాలని ఆదేశాలిచ్చారు. తమ కస్టడీలో ఉండగానే ఇలా కేజ్రీవాల్ రెండు ఆదేశాలు జారీ చేయడంపై ఈడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కస్టడీ నుంచే ఆర్డర్స్ పాస్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా సీఎం ఆదేశాలు జారీ చేయాలంటే కంప్యూటరైజ్డ్ సిగ్నేచర్ అవసరం. అయితే, తమ కస్టడీలో ఎలాంటి కంప్యూటర్, పేపర్లు వంటివి ఇవ్వలేదని, కానీ, కేజ్రీవాల్ పేరుతో గవర్నమెంట్ ఆర్డర్స్ ఎలా వచ్చాయని ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఈ విషయంలో కేజ్రీవాల్.. రూల్స్ అతిక్రమించినట్లు తేలితే ఆయనపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఆప్ నేతలు మాత్రం కేజ్రీవాల్ గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పటికీ తమ సీఎం కేజ్రీవాల్ నిరంతరం ప్రజల గురించే ఆలోచిస్తున్నారని, అక్కడి నుంచే ఆదేశాలిస్తున్నారని గొప్పలు చెప్పుకొంటున్నారు. ఇంకోవైపు.. ఢిల్లీ బీజేపీ నేతలు మాత్రం కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కస్టడీలో ఉండి, పాలన చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.