నా అన్న అప్పుడే మంత్రి: పవన్
నాగబాబుకు మంత్రి పదవిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అంటూ స్పష్టం చేసారు.
నాగబాబుకు మంత్రి పదవిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. భయం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నానని ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అంటూ స్పష్టం చేసారు. అంగీకరించే వాళ్ళు అంగీకరిస్తారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారని అన్నారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నాకు కాపు సామాజిక వర్గం కూడా ఓట్లు వేయలేదన్నారు పవన్. అందుకే ఇక్కడ అన్నింటినీ పక్కన పెట్టీ ధైర్యమైన నిర్ణయాలను తీసుకోవాలని అనుకుంటున్నానని తెలిపారు.
బీసీ, ఎస్సీ ఎస్టి లు అధికార, ప్రతిపక్ష పార్టీలతోనే ఉంటారని నేను బలమైన పార్టీ గా మారేదాక నాకు ఆ వర్గాల నుంచి మద్దతు దొరకడం కష్టమన్నారు. నాగబాబు కు నా సోదరుడి గా కేబినెట్ లో అవకాశం ఇవ్వడం లేదన్నారు. నాతో సమానంగా పనిచేసారు, నా సోదరుడు కాకపోయినా, కాపు సామాజిక వర్గం కాకపోయినా ఆ స్థానంలో ఉన్న వాళ్లకు అవకాశం ఇచ్చే వాడిని అని స్పష్టం చేసారు. మార్చ్ లో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపడతారని ఆ తర్వాత మంత్రి అని క్లారిటీ ఇచ్చారు.