డిప్యూటీ సీఎం.. కానీ డబ్బులు లేవు.. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనుకుంటున్నాడు..?
పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడా..? ఇప్పుడు ఆయన ఉన్న బిజీకి వరుస సినిమాలు చేసే టైం ఉందా..? డిప్యూటీ సీఎం అయిన తర్వాత షూటింగ్స్ కు వచ్చేంత సమయం ఆయన దగ్గర ఉందా..?

పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడా..? ఇప్పుడు ఆయన ఉన్న బిజీకి వరుస సినిమాలు చేసే టైం ఉందా..? డిప్యూటీ సీఎం అయిన తర్వాత షూటింగ్స్ కు వచ్చేంత సమయం ఆయన దగ్గర ఉందా..? పవన్ కళ్యాణ్ మీద ఉన్న బేసిక్ అనుమానాలు ఇవి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమాలు చేయడం చాలా తగ్గించాడు. తనకు డబ్బులు అవసరం ఉన్నాయని అందుకే సినిమాలు చేస్తున్నాను అంటూ చాలా సార్లు ఓపెన్ గానే కామెంట్ చేశాడు పవన్. ఎవరు ఎక్కువగా రెమ్యునరేషన్ ఇస్తే వాళ్లకు ముందుగా డేట్స్ ఇచ్చాడు పవర్ స్టార్. అందులో ఎలాంటి డిప్లొమాసీ లేదు.. కథ ఈజీగా ఉండి.. ఎక్కువగా టైం తీసుకోకుండా.. తక్కువ రోజుల్లో పూర్తి చేసే దర్శకులను ఎంచుకొని వరుస సినిమాలు చేశాడు పవన్ కళ్యాణ్. ఒక్కో రోజుకు రెండు కోట్లకు పైగానే పారితోషికం అందుకున్నాడు ఈయన. పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి.. ఆ డబ్బులు కావాలంటే తనకు సినిమాలు చేయడం తప్ప మరొక ఆప్షన్ లేదు అని ఇప్పటికే ఎన్నో సభల్లో కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్.
అయితే పార్టీ గెలిచింది.. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 100% సక్సెస్ రేట్ సాధించి సంచలన రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. ఇలాంటి సమయంలో కూడా ఆయనకు డబ్బులకు సమస్య ఉంటుందని చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా తనకు డబ్బులు సమస్య ఉంది అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు జనసేన అధినేత. తాజాగా ఒక తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పార్టీ స్ట్రగుల్స్ తో పాటు.. గత పదేళ్లుగా తాను ఎన్ని కష్టాలు పడ్డాను అనే విషయం కూడా ఓపెన్ గానే చెప్పేసాడు పవన్ కళ్యాణ్. సింగిల్ గా ఉంటూ ఒక పార్టీని నడపడం అనేది చిన్న విషయం కాదని.. ఎంతోమంది మన చుట్టు పక్కల వచ్చి తన ఆశయాన్ని నాశనం చేయడానికి చూస్తారు.. వాళ్లందర్నీ కనిపెట్టుకుంటూ మన ఆశయం దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా పెద్ద హెడేక్ అని చెప్పాడు పవన్. వాటన్నింటినీ భరించాను కాబట్టే ఈ రోజు తనకు ప్రజలు ఇంత మంచి విజయాన్ని ఇచ్చారు అని ఎప్పుడు భావిస్తానని.. వాళ్ల కోసం నిత్యం ఏదో ఒకటి చేయాలి అనే తపన తనలో ఎప్పుడూ ఉంటుంది అన్నాడు జనసేనాని.
గెలిచారు కదా ఇప్పుడు కూడా సినిమాలు చేస్తారని అడిగితే.. కచ్చితంగా చేస్తాను ఎందుకంటే తనకు డబ్బులు అవసరం ఉన్నాయని.. తన ఆదాయ మార్గం కేవలం సినిమాలో మాత్రమే అని చెప్పుకొచ్చాడు పవన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోలేము కదా.. ఇప్పుడు కూడా తనకు డబ్బులు అవసరం ఉంటే సినిమాలు చేయడం తప్ప మరొక ఆప్షన్ లేదు అంటున్నాడు. ఇది విన్న యాంకర్ బిక్క మొహం వేశాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన మాట సూటిగా సుత్తి లేకుండా చెప్పాడు. ఇప్పుడే కాదు తనకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉన్నా కూడా సినిమాలు చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. పవన్ ఏ ఉద్దేశంతో సినిమాలు చేస్తున్నాడో తెలియదు కానీ.. ఇకపై కూడా నేను నటిస్తాను అని చెప్పడంతో ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. పొలిటికల్ గా సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇకపై సినిమాలు చేయడేమో అని ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ కు.. అదిరిపోయే న్యూస్ చెప్పాడు పవర్ స్టార్. ఈయన మాటలతో నిర్మాతలు కూడా ఊపిరి పీల్చుకున్నారు.
కాస్త ఆలస్యంగా సినిమాలు చేస్తాడేమో కానీ కచ్చితంగా ఒప్పుకున్న సినిమాలన్ని పూర్తి చేస్తాడనే నమ్మకం ఆయన మాటలతో వచ్చేసిందిప్పుడు నిర్మాతలకు. ప్రస్తుతం ఓజి సెట్స్ మీద ఉంది. హరిహర వీరమల్లు మే 9న విడుదల కానుంది. వీటి తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ కమిట్ అయ్యాడు పవన్. అయితే అది కథ సిద్ధంగా లేకపోవడంతో పక్కన పెట్టేసాడు పవర్ స్టార్. ఒకవేళ మరోసారి మంచి కథ సిద్ధం చేసుకుని వస్తే ఈ సినిమా చేసే ఆలోచనలో కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎలా చూసుకున్నా కూడా ఇకపై రాజకీయాలు చేస్తూనే సినిమాలు కూడా చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చాడు. ప్రజాసేవ చెయ్యాలి అనే చిత్తశుద్ధి మనలో ఉంటే సినిమాలు చేస్తూ కూడా రాజకీయం చేయొచ్చు అంటున్నాడు పవన్. అది ఎలాగో తాను చూపిస్తానంటున్నాడు ఈయన. మొత్తానికి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ తో అభిమానులతో పాటు నిర్మాతలకు కూడా కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది.