అధికారుల పేర్లు నోట్ చేసుకున్న పవన్, మూడినట్టే ఇక…!
కాకినాడ పోర్ట్ లో అక్రమ రేషన్ బియ్యం దందాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఎంతమంది అధికారులు ఇన్ని చెక్ పోస్ట్ లు ఉండగా రేషన్ బియ్యం పోర్టు లోపలికి ఎలా వచ్చాయో అధికారులను పవన్ నిలదీశారు.
కాకినాడ పోర్ట్ లో అక్రమ రేషన్ బియ్యం దందాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఎంతమంది అధికారులు ఇన్ని చెక్ పోస్ట్ లు ఉండగా రేషన్ బియ్యం పోర్టు లోపలికి ఎలా వచ్చాయో అధికారులను పవన్ నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే కొండబాబుపై కూడా సీరియస్ అయ్యారు పవన్. అధికారుల పేర్లను పవన్ కళ్యాణ్ నమోదు చేసుకోవడం గమనార్హం.
అధికారులను సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉండవచ్చు అని తెలుస్తోంది. అధికారులపై పవన్ ఈ సందర్భంగా సీరియస్ అయ్యారు. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్ర, డీఎస్పీ రఘు వీర్,సివిల్ సప్లై డీ ఎస్ ఓ ప్రసాద్ పై సీరియస్ అయ్యారు పవన్. ప్రభుత్వం సీరియస్ గా ఉన్న క్షేత్ర స్థాయి లో పరిస్థితులు అలా లేవని ఆగ్రహం వ్యక్తం చేసారు. హు ఇజ్ అగర్వాల్ అంటూ ప్రశ్నలు వేసారు. డిపార్ట్మెంట్ లు ఫెయిల్ అవుతున్నాయని పవన్ ఫైర్ అయ్యారు.
పోర్ట్ కి రేషన్ రైస్ వస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి చేస్తుందని ప్రశ్నించారు. సమాధానం చెప్పలేక అధికారులు నీళ్ళు నమిలారు. స్వయంగా మంత్రి వచ్చి చెప్పినా సీరియస్ నెస్ లేదని పవన్ ఫైర్ అయ్యారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు పై చర్యలు ఉంటాయని పవన్ హెచ్చరించారు. కాకినాడ స్థానిక ఎమ్మెల్యే కొండబాబుపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకి చురకలు అంటించారు. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ ప్రశ్నలు వేసారు. మనం పోరాటం చేసింది దీని కోసమేనా అంటూ ప్రశ్నలు వేసారు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా పవన్ వినే ప్రయత్నం చేయలేదు. మీరు సరిగా ఉంటే పోర్ట్ లోకి రైస్ ఎలా వస్తుందని పవన్ నిలదీశారు. మనం పోరాటాలు చేసిందే అక్రమ రష్యన్ బియ్యాన్ని అడ్డుకోవాలని అంటూ కొండ బాబుకి పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.