ఇంటర్ విద్యార్థుల కొంప ముంచిన పవన్ కళ్యాణ్
విశాఖ జిల్లాలో డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ జేఈఈ రాసే విద్యార్థుల కొంప ముంచింది. పవన్ కళ్యాణ్ వస్తున్నారంటూ విశాఖ జిల్లా పెందుర్తిలో చినముషిడివాడలో ట్రాఫిక్ నిలిపివేశారు పోలీసులు.

విశాఖ జిల్లాలో డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ జేఈఈ రాసే విద్యార్థుల కొంప ముంచింది. పవన్ కళ్యాణ్ వస్తున్నారంటూ విశాఖ జిల్లా పెందుర్తిలో చినముషిడివాడలో ట్రాఫిక్ నిలిపివేశారు పోలీసులు.
కానీ అదే రోడ్డులో ఉన్న అయాన్ డిజిటల్ జోన్‌లో ఇవాళ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరగాల్సి ఉంది. పోలీసులు ట్రాఫిక్ ఆపడంతో విద్యార్థులు పరీక్షకు లేట్‌గా వెళ్లారు. 2 నిమిషాలు ఆలస్యమయ్యిందంటూ విద్యార్థులను పరీక్షకు అనుమతించలేదు నిర్వాహకులు. దీంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారు విద్యార్థులు.