సుప్రీంకు దేవినేని అవినాష్…!

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు చేసిన దాడిపై పోలీసులు విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దానిని కోర్ట్ కొట్టేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2024 | 05:45 PMLast Updated on: Sep 09, 2024 | 5:45 PM

Devineni Avinash Bail Pitetion In Supremme Court

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతలు చేసిన దాడిపై పోలీసులు విచారణను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు హైకోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేయగా దానిని కోర్ట్ కొట్టేసింది. ఈ నేపధ్యంలో టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు దేవినేని అవినాశ్. ఆయనకు ముందస్తు బెయిల్ ను హైకోర్ట్ నిరాకరించడంతో సుప్రీంలో పిటీషన్ వేసారు.

ఈ కేసు రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు పలువురు వైసీపీ నేతలను క్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయన అనుచరులను నేడు విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ అనుచరులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.