కేటిఆర్ ఉచ్చులో పుష్ప, నవ్వుతూ ముంచేసాడా…? కోర్ట్ తో రేవంత్ ను కెలికారా…?

తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి గా సంధ్య థియేటర్ ఘటన మారిపోయిందా...? సినిమా ఇండస్ట్రీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లో మరింత సీరియస్ గా ఉండే ఛాన్స్ ఉందా? పెద్దలు రంగంలోకి దిగకపోతే ఈ సమస్య పరిష్కారం అయ్యే సమస్యే లేదా...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 20, 2024 | 02:05 PMLast Updated on: Dec 20, 2024 | 2:05 PM

Did Allu Arjun Fall Into The Trap Of Former Minister Ktr

తెలుగు సినిమా ఇండస్ట్రీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి గా సంధ్య థియేటర్ ఘటన మారిపోయిందా…? సినిమా ఇండస్ట్రీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లో మరింత సీరియస్ గా ఉండే ఛాన్స్ ఉందా? పెద్దలు రంగంలోకి దిగకపోతే ఈ సమస్య పరిష్కారం అయ్యే సమస్యే లేదా…? అంటే అవుననే సమాధాన వినపడుతోంది. సంధ్యా ధియేటర్ ఘటన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారనే విషయం సామాన్యుల కంటే సినిమా వాళ్లకు ఎక్కువ క్లారిటీ ఉంది. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ పోలీసులు కూడా ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా తమ పని తాము చేస్తున్నారు.

సినిమా పరిశ్రమ పెద్దలు ఎంత పెద్ద వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ తెలంగాణ పోలీసులు కూడా అదే రేంజ్ లో పనిచేస్తూ ముందుకు వెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ ఉండటంతో ఎక్కడ వెనక్కు తగ్గటం లేదు. ఇప్పుడు పుష్ప 2 సినిమా వివాదం లో మాజీ మంత్రి కేటీఆర్ ఇరువర్గాలను రెచ్చగొట్టి సమస్యను మరింత జటిలం చేసే ప్రయత్నం చేశారు. కేటీఆర్ చేసిన కామెంట్లు అగ్గికి మరింత ఆజ్యం పోసాయి. రేవంత్ పేరు మర్చిపోయాడు కాబట్టే అరెస్ట్ చేసాడు అంటూ పదే పదే మాట్లాడారు.

సినిమా వాళ్ళను… రేవంత్ తో రాజీకి వెళ్ళకుండా కేటిఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తనతో సినిమా వాళ్ళు చాలా సన్నిహితంగా ఉంటారు. అందుకే వాళ్ళ కోరికలకు, డిమాండ్ లకు అప్పట్లో వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేది. ఇప్పుడు వాళ్ళు చేజారితే కేటిఆర్ కు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే సినిమా వాళ్ళను రేవంత్ కు దగ్గర కానీయకుండా కేటిఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అప్పట్లో… తెలంగాణా ప్రభుత్వానికి సినిమా వాళ్ళు స్వచ్చందంగా ప్రమోషన్లు కూడా చేసేవారు.

హరిత హారం, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం వాటికి ఫ్రీ ప్రమోషన్స్ చేసారు. ఆ రేంజ్ లో సినిమా వాళ్లకు కేటిఆర్ కు బాండింగ్ ఉండేది. కేటిఆర్ కూడా జూబ్లిహిల్స్ లోని సినిమా వాళ్ళతో క్లోజ్ గా తిరిగేవారు. అసలు కేటిఆర్ జోక్యంతోనే సంధ్య థియేటర్ ఘటన విషయంలో సినిమా పరిశ్రమ అలాగే తెలంగాణ ప్రభుత్వం పరస్పర ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి దిగజారిపోయింది. ఒకరకంగా కేటిఆర్ ఉచ్చులో రెండు వర్గాలు పడ్డాయి. దీనితో తెలంగాణ పోలీసులు కూడా అల్లు అర్జున్ ది తప్పు అంటూ కేటిఆర్ కామెంట్స్ తర్వాతనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

కేటిఆర్ కామెంట్స్ తర్వాతనే సంధ్య థియేటర్ యాజమాన్యానికి కూడా ఇప్పటికి లైసెన్స్ రద్దు చేస్తామని నోటీసులు కూడా పంపారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ ను తిట్టారు. ఈ పరిణామాలతో సంధ్య థియేటర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నో ఏళ్లుగా సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ బడ్జెట్ సినిమాలకు మంచి జోష్ ఇచ్చేది. అలాంటి థియేటర్ ను కూల్చినా ఆశ్చర్యం లేదు. దీనితో ఇండస్ట్రీ పెద్దల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యమంత్రిని స్వయంగా టార్గెట్ చేయడం కచ్చితంగా మంచిది కాదని కొందరు కంగారు పడుతున్నారు.

ఇండస్ట్రీ పెద్దలు అలాగే నటీనటులు అందరూ కూడా పద్ధతి మార్చుకోకపోతే కచ్చితంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని, భవిష్యత్తులో ప్రభుత్వంతో చాలా అవసరాలు ఉంటాయని… పొరపాట్లు అంగీకరించి ప్రభుత్వానికి సహకరిస్తామని పెద్దలు దిగి రావాల్సిందే అని, అంతేకాకుండా కోర్టులకు వెళ్లి మరింత రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రులను ప్రజాప్రతినిధులను గౌరవించాల్సిన అవసరం ఉందని, అభిమానులు కూడా హద్దు మీరడం తప్పనే ఒపినియన్ వినపడుతోంది.

ఇక నాయకులు కూడా హద్దు మీరు మాట్లాడకూడదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ అభిమానులు చేసిన అతి ఇప్పుడు అల్లు అర్జున్ కు మరింత ఇబ్బందికరంగా మారింది. కావాలని అల్లు అర్జున్ కొంతమంది అభిమానులతో రేవంత్ రెడ్డిని తిట్టించారనే అభిప్రాయం కూడా వినపడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఈ విషయంలో అలర్ట్ అయ్యారు. కొంతమంది అల్లు అర్జున్ అభిమానులను అదుపులో కూడా తీసుకున్నారు. సినిమా పరిశ్రమ పెద్దలు గతంలో ముఖ్యమంత్రులతో చాలా సన్నిహితంగా మెలిగే వారు.

అయితే రేవంత్ రెడ్డి విషయంలో ఇది పూర్తిగా భిన్నంగా జరిగింది. రేవంత్ రెడ్డిని అసలు ఏ కార్యక్రమానికి పిలిచే ప్రయత్నం చేయడం లేదు. గతంలో ఏ చిన్న కార్యక్రమం నిర్వహించిన సరే ఆ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా లేదంటే ఇతర మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యేవారు. తలసాని శ్రీనివాస్ యాదవ్… సనత్ నగర్ కంటే ఫిలిం నగర్ లో ఎక్కువ తిరిగేవారు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని గాని ఈ తెలంగాణ మంత్రి వర్గంలో ఉన్న ఏ మంత్రి గాని పిలిచే ప్రయత్నం చేయడం లేదు.

రేవంత్ రెడ్డిని పిలిస్తే కేటీఆర్ కు కోపం వస్తుందనే చాలామంది ఆగిపోతున్నారనే అభిప్రాయాలు కూడా వినపడుతున్నాయి. ఇక అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 సినిమా విడుదల సందర్భంగా చేసిన అతి కూడా కాస్త రేవంత్ రెడ్డికి ఒళ్ళు మండేలా చేసింది. ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం ఒకటైతే సంధ్య థియేటర్ ఘటన విషయంలో తప్పును అంగీకరించకుండా ప్రభుత్వంతో రాజీకి వెళ్లకుండా కోర్టుకు వెళ్లడం మరిన్ని సమస్యలకు దారితీసింది. అసలు పోలీసులు చర్యలు తీసుకోక ముందే అల్లు అర్జున్ తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలంటూ ఏకంగా హైకోర్టుకు వెళ్లారు.

ఇది సమస్యను మరింత పెద్దది చేసిందనే అభిప్రాయం వినపడుతోంది. హైకోర్టుకు వెళ్లడంతోనే తెలంగాణ పోలీసులు మరింత స్పీడ్ పెంచి హైకోర్టులో విచారణ జరగకముందే అల్లు అర్జున్ గత శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ పరిణామాల తర్వాత ప్రభుత్వాన్ని అలాగే పోలీసులను ఇబ్బంది పెట్టే విధంగా కోర్టులో అల్లు అర్జున్ తరఫున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నుంచి మరింత కఠినంగా ముందుకు వెళుతుంది. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు.

ఇక తన పిటీషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేసేందుకు అల్లు అర్జున్ కూడా సిద్ధమవుతున్నాడు. అయితే ముందు కోర్టులు, విమర్శలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వద్దకు సినిమా పరిశ్రమ పెద్దలు వెళ్లి సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయకపోతే మాత్రం రేవంత్ రెడ్డి మరింత పట్టుదలగా వ్యవహరించే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేస్తూ తెలుగు సినిమా పరిశ్రమ ఇండియా వైడ్ గా దుమ్ము రేపుతున్న సమయంలో ఈ వివాదాలు అసలు ఏ మాత్రం కూడా మంచిది కాదని వార్నింగ్ లు వస్తున్నాయి.

హైదరాబాద్ తెలుగు సినిమా పరిశ్రమకు గుండెకాయగా ఉన్నప్పుడు సినిమా పరిశ్రమ పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అంతేకానీ ఒక సినిమా కారణంగా లేదంటే ఒక నటుడి కారణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవడం లేదంటే, ఏదో సాధించాలి అనుకోవడం ఏమాత్రం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇస్తున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయి విడుదల ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున సినిమా పరిశ్రమ పెద్దలు వెళ్లారు. చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ వెళ్లి అల్లు అర్జున్ పరామర్శించి వచ్చే ప్రయత్నం చేశారు.

ఇది చూసి చాలామంది ఏం జరిగిందని, ఒక రోజు జైల్లో ఉన్నంత మాత్రం ఎంతమంది వెళ్లాల్సిన అవసరం ఏంటి అనే ప్రశ్న కూడా వినపడింది. ఇది కూడా రేవంత్ రెడ్డికి చిరాగ్గా అనిపించిందని కొంతమంది అంటున్నారు. అందుకే ఈ విషయంలో రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గడం లేదని అల్లు అర్జున్ ను కచ్చితంగా జైల్లో పెట్టే అవకాశం ఉండవచ్చు అని అభిప్రాయం వినపడుతోంది. దిల్ రాజుకు ప్రస్తుతం ప్రభుత్వంలో పదవి ఉంది. కాబట్టి ఆయన ద్వారా పెద్దలు రేవంత్ ను కూల్ చేసే మార్గాలు అన్వేషించాలని, రాజకీయ నాయకులతో గోక్కోవడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు సామాన్య ప్రజలు సైతం.