బల ప్రదర్శనతో బన్నీ రేవంత్ కి సవాల్ విసిరాడా?
ఒక మహిళ చావుకు కారకుడై జైలుకెళ్ళి వస్తే ఇంత ఆదరణ లభిస్తుందా? అల్లు అర్జున్ ఇంట్లో టాలీవుడ్ బలప్రదర్శన చూస్తుంటే... ఇంత అరాచకమా అనిపించక మానదు. అల్లు అర్జున్ ఒలింపిక్స్ లో మెడల్ కొట్టి హైదరాబాద్ రాలేదు, పోనీ ఇంకేదైనా సాధించి.... విజయంతో ఇంటికి రాలేదు
ఒక మహిళ చావుకు కారకుడై జైలుకెళ్ళి వస్తే ఇంత ఆదరణ లభిస్తుందా? అల్లు అర్జున్ ఇంట్లో టాలీవుడ్ బలప్రదర్శన చూస్తుంటే…
ఇంత అరాచకమా అనిపించక మానదు. అల్లు అర్జున్ ఒలింపిక్స్ లో మెడల్ కొట్టి హైదరాబాద్ రాలేదు, పోనీ ఇంకేదైనా సాధించి…. విజయంతో ఇంటికి రాలేదు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసేలాటలో ఒక మహిళ చనిపోతే, ఒక బాలుడు తీవ్రంగా గాయపడితే…. ఆ కేసులో ఒకరోజు జైలు కెళ్ళి బెయిల్ పై వచ్చాడు. దాన్ని కవర్ చేసుకోవడానికి అల్లు అర్జున్ ఇంట్లో టాలీవుడ్ బల ప్రదర్శన చేసింది… మరో రకంగా చెప్పాలంటే స్టైలిష్ స్టార్ తన బలం ఏంటో ముఖ్యమంత్రి రేవంత్ కి, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ చూపించాడు. అంతేకాదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డైరెక్ట్ గా సవాల్ విసిరాడు. అందుకు ఒక వ్యూహం ప్రకారం పథక రచన చేసి డ్రామా రక్తి కట్టించాడు. జైలు కెళ్ళి బెయిల్ పై రావడాన్ని అవమానకరమైన పనిగా కలర్ రాకుండా….. బెయిల్ తెచ్చుకోవడం ద్వారా ఒక పెద్ద అచీవ్మెంట్ చేశానని, అంతేకాక ప్రభుత్వం ,పోలీసులు తన విషయంలో తప్పు చేశారని, అందుకే తనను ఓదార్చడానికి ఏకంగా బాలీవుడ్ ప్రముఖులంతా ఇంటికి లైన్ కట్టారని ఒక బిల్డప్ ఇవ్వడానికి అల్లు అర్జున్ భారీ బల ప్రదర్శన చేశాడు.
చంచల్గూడా జైలు నుంచి నేరుగా అల్లు అర్జున్ తన ఇంటికి వెళ్లకుండా ,గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్ళాడు. ఇంటికి వెళ్లడానికి ముహూర్తం బాలేదని…. రాహుకాలం ఉందని అందువల్ల కాసేపు ఆగి వెళ్తామని చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పారు. కానీ నిజానికి ఆ రెండు గంటల వ్యవధిలో అల్లు అర్జున్ పిఆర్ టీం మొత్తం బాలీవుడ్ లో ఉన్న ప్రముఖులందరికీ కాల్ చేసి బన్నీ ఇంటికి రప్పించారు. ఫలానా హీరో వస్తున్నారని, ఫలానా నటుడు బన్నీని చూడడానికి వస్తున్నాడని… మీరు కూడా వస్తే బాగుంటుందని ఇలా హీరోలు, దర్శకులు మిగిలిన వాళ్ళందరికీ కాల్స్ చేసి రప్పించారు. అనుకున్నట్టుగా ఈ ప్లాన్ ప్రారంభం కావడానికి కొన్ని నిమిషాల ముందు బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్ళాడు. ప్రతి మూమెంట్ ని షూట్ చేసి మీడియాకి వీడియోలు వదిలారు అతని పిఆర్ టీం. ఈ డ్రామా ప్రధాన ఉద్దేశం అంతా ఒక్కటే. జరిగిన ఘోరంలో అల్లు అర్జున్ పాత్ర ఏమీ లేదని, అతను అమాయకుడని, పోలీసులు అన్యాయంగా అరెస్టు చేశారని… దాన్ని తప్పించుకొని విజయవంతంగా బయటకు వచ్చాడని.. సింపతి క్రియేట్ చేసి… దాన్నొక అచీవ్మెంట్ గా చూపిస్తూ ప్రముఖులంతా అభినందించడం బన్నీ పిఆర్ టీం లక్ష్యం. దాన్ని…. ఒక ప్లాన్ ప్రకారం అమలు చేశారు. గంటలు జైలు లో ఉన్న పాపానికి… ఇంటికి రాగానే దిష్టి తీయడం, ఇంట్లో వాళ్లంతా స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ రావడం, అదేదో హిమాలయాలకి ఎవరెస్టు శిఖరం పై భారత ఖ్యాతిని ఎగరేసి వచ్చినట్లుగా అందరూ ఉబ్బి తబ్బిపోవడం జరిగిపోయింది. అల్లు అర్జున్ తప్పుచేసి జైలుకెళ్ళి వచ్చారన్న భావన ఎక్కడ కనిపించలేదు. ఇదంతా ఎప్పటికప్పుడు వీడియో షూట్ చేస్తూ వీడియోలు చానల్స్ కి, డిజిటల్ మీడియాకి వదులుతూనే ఉన్నారు అల్లు అర్జున్ పిఆర్ టీం.
వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఫిలిం స్టార్స్ రావడం మొదలుపెట్టారు. పుష్ప నిర్మాత డైరెక్టర్ సుకుమార్ , నిర్మాత అందరూ బన్నీ ఇంటిని చుట్టేశారు. టీవీల్లో చూసిన మిగిలిన హీరోలు, డైరెక్టర్లు తాము రాకపోతే బన్నీ ఏమనుకుంటాడో అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా బన్నీ ఇంటికి పరుగులు పెట్టారు. అసలు ఎందుకు వెళ్తున్నారో ఎవరికి తెలియదు. మహిళ మృతి, తొక్కిసలాట కేసులో జైలుకు వెళ్లి వచ్చిన వాడికి పరామర్శ ఏంటో అర్థం కాదు. గుడ్డెద్దు చేలో పడినట్లుగా ఒకరి తర్వాత ఒకరు పరామర్శలు గర్వాన్ని హోరెత్తించారు. ప్రతి ఒక్కరూ వచ్చి బన్నీని అభినందించడం ,ఓదార్చడం ….ఈ ప్రక్రియను అంతా షూట్ చేసి అల్లు అర్జున్ పి ఆర్ టీం ఎప్పటికప్పుడు వీడియోలు బయటికి రిలీజ్ చేయడం …. ఈ తతంగం అర్ధరాత్రి వరకు జరుగుతూనే ఉంది. ఓవరాల్ ఎపిసోడ్ ద్వారా బన్నీ ఒక కుట్రను చేదించాడని, విజయవంతంగా పోలీస్ వలయం నుంచి జైలు నుంచి బయట పలకడిగారని జనానికి తెలియజేసే డ్రామా రక్తి కట్టించారు. జనం మాత్రం అలా అనుకోవడం లేదు. అసలు జైలు కెళ్ళి వచ్చిన వాడికి ఈ పరామర్శలు ఏంటి. అల్లు అర్జున్ అనే వాడు ఏమైనా దేశానికి అవార్డులు రివార్డులు తీసుకొని ఇంటికి వచ్చాడా ? మీ తతంగం చూస్తున్న వాళ్ళందరికీ బన్నీ ప్రవర్తన చాలా ఆశ్చర్యం కలిగించింది. ప్రతి ఒక్కరిని కాకేంతవరకు ఆప్యాయంగా వీడ్కోలు పలుకుతూ పంపడం, వచ్చిన వాళ్ళని ప్రేమగా కౌగిలించుకోవడం… తనకి ఎటువంటి ఇగో లేదని… తన అందరి వాడిని అనిపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు బన్నీ. ఇంత జరుగుతున్నా ఈ పరామర్శలు వేడుకకి మెగా హీరోలంతా దూరంగా ఉన్నారు.
దానిని కవర్ చేయడానికి…. వెంటనే మరుసటి రోజు చిరంజీవి ఇంటికి లంచ్ ప్రోగ్రాం పెట్టుకున్నాడు బన్నీ. ఓవరాక్షన్ పై, ఎక్స్ట్రాలపై టాలీవుడ్ లోనూ, జనంలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోను బాగా యావగింపు వచ్చిందని గుర్తించిన అల్లు అర్జున్ ఇప్పుడు చిరంజీవి ఇంటికెళ్లి దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. అల్లు అర్జున్కి ఏదో అన్యాయం జరిగిపోయిందని ఇంటికెళ్లి కౌగిలింతలతో , ఆలింగనాలతో ధైర్యం చెప్పిన టాలీవుడ్ జనం లో ఒక్కరైనా తొక్కిసలాటలో చనిపోయిన మహిళ ఇంటికి వెళ్లి పరామర్శించారా?
హాస్పటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న 9 ఏళ్ల శ్రీ తేజ అనే పిల్లాడి పరిస్థితి ఎలా ఉందో ఒక్కరైనా అడిగారా? సినిమా వాళ్ల కల్చర్ ఎలా ఉంటుందో బన్నీ తో పాటు మిగిలిన టాలీవుడ్ బ్యాచ్ అంతా చూపించారు. అభిమాన దేవుళ్ళ వల్లే మేము ఇలా ఉన్నాం, నా ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు వాళ్లు నా ఆర్మీ అంటూ సొల్లు కబుర్లు చెప్పే టాలీవుడ్ హీరోలు ఆ బాధిత కుటుంబానికి ఒక్క రూపాయి ఆర్థిక సాయం చేయలేదు. కనీసం వెళ్లి పరామర్శించలేదు. ఈ కేసులో నిందితుడైన అల్లు అర్జున్ ని ఓదార్చడానికి టాలీవుడ్ అంతా కదిలి వచ్చింది. ఒక పెద్ద డ్రామా చేసింది. జనం ఇదంతా గమనిస్తూనే ఉన్నారు.