CM kcr: పొంగులేటి, తుమ్మలను దూరం చేసుకుని కేసీఆర్ తప్పుచేశారా..?
బీఆర్ఎస్ లో సీనియర్ నాయకులను వదులుకొని సీఎం కేసీఆర్ తప్పు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్-కేటీఆర్ మధ్య దూరం పెరిగిందా.. తండ్రీ కొడుకులు మధ్య కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరలేదా..? అందుకే ఆయన అమెరికా వెళ్లారా..? ఓడిపోయేవారిని కూడా లిస్టులో పెట్టడం ఆయనకు నచ్చలేదా.? తుమ్మలను దూరం చేసుకోవడం ఇష్టం లేదా..? గతంలో ఖమ్మం జిల్లాకు వెళ్లి మరీ తుమ్మలతో మాట్లాడిన కేటీఆర్. పొంగులేటిని వదులుకోవడం కూడా కేటీఆర్‌కు ఇష్టం లేదు.. ఎంపీ సంతోష్‌కు ప్రాధాన్యం ఇవ్వడం ఇష్టం లేదు. కానీ తండ్రిని ఏమీ అనలేరు.. మల్లారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి ఓడిపోతారు.. బాల్క సుమన్ కూడా డౌటే.. ఖమ్మం జిల్లాలో మంత్రి అజయ్ కూడా ఓటమి గ్యారెంటీ.. మహబూబాబాద్‌లో శంకర్‌నాయక్, ముషీరాబాద్‌లో ముఠాగోపాల్ గెలవడు. నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. మునుగోడులో ఇటీవల గెలిచిన కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి మళ్లీ గెలిచే పరిస్థితి లేదు. జాబితాలో20-30మంది పేర్లపై కేటీఆర్ అభ్యంతరం.. వాటిని పట్టించుకోని కేటీఆర్.. ఇద్దరి మధ్య దూరం పెరిగింది.
అందుకే కేటీఆర్ సీట్ల ప్రకటన సమయంలో అందుబాటులో లేకుండా పోయారు. చాలామంది నేతలు కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో చాలామంది నేతలు కవిత చుట్టూ, హరీష్ చుట్టూ తిరిగారు. కేటీఆర్ ఫోన్‌లోనూ అందుబాటులోకి రాలేదని సమాచారం. నిజానికి కేటీఆరే అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా భావించారు. తెలిసి తెలిసీ ఓడిపోయే వారిని జాబితాలో పెట్టడం ఎంత వరకు సమంజసమన్నది కేటీఆర్ ప్రశ్న. తర్వాత వారిలో కొందరిని మారుద్దామని కూడా కేసీఆర్ చెప్పారంటున్నారు. అయితే అలా చేయడం వల్ల గందరగోళం పెరుగుతుంది కానీ తగ్గదన్నది కేటీఆర్ వాదన. ఒకటి, రెండు సీట్లు అయితే ఓకే కానీ అంత మందిని ఆ సమయంలో మార్చడం ద్వారా దెబ్బతింటామన్నది ఆయన భయం. కానీ కేసీఆర్ ఆలోచన వేరుగా ఉంది. దీంతో పార్టీ అధినేతతో విభేదించలేకే కేటీఆర్ సైలెంటైపోయారంటున్నారు. వారం రోజుల్లో తిరిగి వస్తారని భావించినా ఇంకా ఎక్కువ సమయమే ఆయన అమెరికాలో ఉండటానికి కారణం అదే అంటున్నాయి కొన్ని రాజకీయ వర్గాలు.
బండి సంజయ్ చెప్పిందే జరుగుతోందా..? ఆ 30మందినీ కేసీఆర్ మార్చేస్తారా..? కేసీఆర్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నారా..? ఎన్నికల సమయానికి ఈ జాబితాలో మార్పులు చేర్పులు తప్పవా..? సర్వే నివేదికల ఆధారంగా కేసీఆర్ సీట్లు ప్రకటించలేదా.? ఓడిపోతారని తెలిసినా దాదాపు 30మందికి సీట్లు ఎందుకిచ్చారు.? చివరి నిమిషంలో వారి పేర్లు జాబితాలో గల్లంతవుతాయా..? అసంతృప్త నేతలను ఇప్పుడే బయటకు పంపేస్తే పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన భయపడ్డారా..? అందుకే తెలివిగా వారి పేర్లు జాబితాలో చేర్చి చివరి వరకు ఊరించి ఉసూరనిపిస్తారా.? అటు కాంగ్రెస్- ఇటు బీజేపీలో డోర్లు క్లోజ్ అయ్యాక కేసీఆర్ తెలివిగా జాబితాలో చాలామందిని తప్పిస్తారా..? కేసీఆర్‌కు శత్రువులు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నారా..? ఆ నేతలే రెబల్స్‌గా మారి దెబ్బతీయబోతున్నారా..? పల్లాను ముత్తిరెడ్డిని గెలవనిస్తాడా..? కడియం శ్రీహరిని రాజయ్య నెగ్గనిస్తారా.? ఇలా చాలామంది నేతలు ఉన్నారు.
మైనంపల్లిని బయటకు పంపే ధైర్యం ఎందుకు లేదు..? మైనంపల్లి ఇండిపెండెంట్‌గా కచ్చితంగా గెలుస్తారు. ఆయన కుమారుడు మెదక్ నుంచి గెలిచి తీరుతారు. పైగా కేసీఆర్‌కు బంధువు.. అయితే మెదక్‌లో మైనంపల్లి కుమారుడికి సీటు ఇవ్వడానికి కేసీఆర్ ఒప్పుకోలేదు. మెదక్‌లో పద్మా దేవెందర్‌రెడ్డికే సీటు ఇచ్చారు. ఆమె ఓడిపోతారన్నది గ్రౌండ్ రియాలిటీ. కానీ అటువైపే మొగ్గు చూపారు. దీంతో మైనంపల్లి పార్టీ గీతను ధిక్కరించారు. హరీష్‌రావును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. తన కుమారుడికి సీటు ఇవ్వకుండా హరీష్ రావు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. అయినా సరే మైనంపల్లిపై క్రమశిక్షణా చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఓ రకంగా భయపడుతున్నారు. మైనంపల్లి వస్తే కాంగ్రెస్ వెల్‌కమ్ చెబుతామంటోంది. నిజానికి కేసీఆర్ తెలివిగా వ్యవహరించొచ్చు. మైనంపల్లి కుమారుడిని ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి మైనంపల్లి హన్మంతరావుకు ఎంపీగా చాన్స్ ఇవ్వొచ్చు. అది పార్టీకి ప్లస్ అయ్యేది. కానీ కేసీఆర్ అలా ఆలోచించలేదు.