తప్పుకున్నాడా…? తప్పించుకున్నాడా? ఒక ప్లాన్ ప్రకారమే పాలిటిక్స్ నుంచి సాయిరెడ్డి నిష్క్రమణ

విజయసాయిరెడ్డి వైసీపీని విడిచిపెట్టడం చాలామందికి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆర్థిక నేరాలు దగ్గర్నుంచి అడుగడుగునా వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడిన సాయిన్న అంత తేలిగ్గా వైసీపీని వదిలేసాడా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2025 | 09:59 AMLast Updated on: Jan 27, 2025 | 9:59 AM

Did He Escape Sai Reddys Exit From Politics Is According To A Plan

విజయసాయిరెడ్డి వైసీపీని విడిచిపెట్టడం చాలామందికి ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఆర్థిక నేరాలు దగ్గర్నుంచి అడుగడుగునా
వైయస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడిన సాయిన్న అంత తేలిగ్గా వైసీపీని వదిలేసాడా? అసలు ఎలా సాధ్యం? ఎక్కడో ఏదో జరిగింది?
ఒత్తిడితో నిష్క్రమించాడా? అలిగి వెళ్లి పోతున్నాడా? లేక తెలివిగా ఒక అండర్స్టాండింగ్ తో రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ద్వారా
కుంభకోణాల నుంచి…. నేరాలు నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నాడా?

రాజకీయాలనుంచి నిష్క్రమిస్తున్నాను…. ఇకపై వ్యవసాయం చేసుకుంటాను…. హార్టికల్చర్ చేస్తాను…. అసలు ఏ పార్టీలోనే చేరను అంటూ విజయసాయి రెడ్డి చెప్తుంటే ఏ కొసానా నమ్మబుద్ధి కావడం లేదు. వైసీపీలోనే కాదు…. తెలుగు రాష్ట్రాల్లో టాప్ టెన్ క్రిమినల్ బ్రెయిన్స్ లో విజయసాయి రెడ్డి ఒకరు. వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్అయిన సాయి రెడ్డి వైయస్ హయాంలో జగన్ చేసిన అన్ని ఆర్థిక నేరాలకు వ్యూహకర్తగా ,వెన్నుదన్నుగా నిలిచాడు. అందువలన సాయి రెడ్డి నిర్ణయం వ్యూహాత్మంగా తీసుకున్నదే. ప్రధానమైన కారణం
2019 నుంచి 24 వరకు సాయి రెడ్డి చేసిన అక్రమాలును ఇప్పటి ప్రభుత్వం వెలికి తీయడమే . బిజెపికి రాజ్యసభ ఎంపీ సీట్లు కావాలి. అవి వైసీపీ దగ్గర 11 ఉన్నాయి. ఇప్పటికే వాటిలో ముగ్గురు బయటపడిపోయారు. మిగిలినవి తమ ఎకౌంట్లో వేసుకోవాలనుకుంటున్నాయి కూటమి పార్టీలు. ప్రధానంగా బిజెపి. అందుకే మెడ మీద కత్తి పెట్టి రాజీనామాలు చేయించి రాజ్యసభ స్థానాలు చేజెక్కించుకోవడమే లక్ష్యం.

గడచిన ఐదేళ్లలో సాయి రెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కావు. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా ఆయన చాలా భూ అక్రమంగా పాల్పడ్డాడు. స్థానిక ఓటమి ప్రభుత్వం సహకారంతో ఆ లెక్కలు అన్ని తీసింది. కాకినాడ సి పోటెజమాని కెవి రమణ బెదిరించి బలవంతంగా షేర్లు తీసుకున్నారని ఇటీవల సిఐడి కేసు నమోదు చేసింది. దీని ఆధారంగా ఇది కూడా కేసు నమోదు చేసి ఏ 2 గా విజయసాయిరెడ్డిని పిలిచి ప్రశ్నించింది కూడా. ఈ కేసులో ప్రభుత్వం తలుచుకుంటే సాయి రెడ్డి అరెస్ట్ అవడం ఖాయం. అంతేకాదు కాకినాడ ఎస్ ఈ జెడ్ కేసులో సాయి రెడ్డి అల్లుడు అరబిందో డైరెక్టర్ కూడా ఖాయం. జగన్ కేసుల్లో ఎటుగా 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన సాయి రెడ్డి కి మరోసారి జైలుకెళ్ళి ఓపిక లేదు. అంతేకాదు అల్లుడుని కూడా బలి చేసుకోలేడు. అందుకే ఆ కేసులు నుంచి విముక్తి పొందడానికి రాజ్యసభ ఎంపీ పదవిని వదులుకున్నాడు.

తద్వారా బిజెపికి రాజ్యసభలో ఒక సీటుని పెంచాడు.ఇది ప్రధాన కారణం. దాంతోపాటు మరి కొన్ని కారణాలు ఉన్నాయి. విశాఖ ల్యాండ్ గ్రాఫింగ్ కేసులన్నీ సాయి రెడ్డిని చుట్టుముట్టి అయిపోతున్నాయి. అందువలన కేంద్రంలో బిజెపితో ఒక అవగాహన చేసుకుంటే…. ఇక్కడ కూటమి సర్కార్ వేధింపులు తగ్గుతాయి.ఏపీ సర్కార్ పెట్టబోయే కేసుల నుంచి రక్షణ కల్పిస్తామని ఢిల్లీ నుంచి హామీ రావడంతో మరో ఆలోచించకుండా పార్టీకి రాజ్యసభ సీట్ కి రాజీనామా చేసేసాడు సాయి రెడ్డి.ఇదంతా ఒక ఎత్తు పార్టీలో అందరితోనూ సాయి రెడ్డి కొన్న విభేదాలు. సాయి రెడ్డికి ప్రజల రామకృష్ణారెడ్డి తో, వై వి సుబ్బారెడ్డి తో, మిథున్ రెడ్డితో., బొత్సతో అందరితోనూ విభేదాలు ఉన్నాయి. టేక్ ఇట్ గ్రాండ్ గా తీసుకునే విజయ్ సాయి రెడ్డి మిగిలినవన్నీ డామినేట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దీనికి మిగిలిన వాళ్ళు ఎప్పటికప్పుడు అడ్డం తిరుగుతూ ఉంటారు.

ఈ వాతావరణ సాయి రెడ్డికి చాన్నాళ్లుగా ఒక పోతగా ఉంది. దాదాపు రెండేళ్ల నుంచి జగన్తో కూడా అంటి ముట్టనట్టుగానే ఉన్నాడు. విశాఖలో సాయి రెడ్డి కుటుంబం కవలించిందని దీనివల్ల అక్కడ పార్టీ పూర్తిగా దెబ్బతిందని ఆలస్యంగా గుర్తించిన జగన్ సాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్చార్జి పదవి నుంచి వెనక్కి పిలిపిచ్చాడు. అప్పటినుంచి సాయి రెడ్డి జగన్ సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. లేకుండా నేను నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు విజయ్ సాయి రెడ్డి. ఎన్నికల తర్వాత జగన్ ని కలిసింది మూడే మూడు సార్లు. నాలుగైదు సార్లు జగన్ ఫోన్ చేసినా కూడా అటెండ్ చేయలేదట సాయి రెడ్డి. కేంద్రంలోని బిజెపి పెద్దలనుంచి జగన్కు సాయి రెడ్డికి వార్నింగ్ లు వచ్చాయి.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటా బయట యుద్ధం చేయడం కష్టం అనే విషయం సాయి రెడ్డికి అర్థమైంది. ఈసారి లోపలికి వెళ్తే మళ్లీ బయటికి రావడం చాలా కష్టం. దీనికన్నా ఢిల్లీలోని పెద్దలతో రాజీపడ్డమే మంచిది అనుకున్నాడు. మరో పక్క జగన్ తో ఎలాగో దూరం పెరిగింది. అందుకే అన్ని విధాల ఆలోచించి పార్టీకి పదవికి రాజీనామా చేసి ఒక నమస్కారం పెట్టేసాడు.

నేను నీకు వ్యవసాయం చేసుకుంటాను అని సాయి రెడ్డి చెప్పిన మాట నమ్మితే మనందరం బొక్క బోర్ల పడినట్లే. విజయసాయి రెడ్డి గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఆయన తక్కువ అంచనా వేయలేరు. తన భవిష్యత్తు పట్ల బలమైన విశ్వాసం గల వ్యక్తి సాయి రెడ్డి. అందువల్ల తన వ్యవసాయానికి పరిమితం చేసుకోడానికి. నాలుగేళ్ల తర్వాత తిరిగి జగన్ అధికారంలోకి వస్తే కచ్చితంగా చెప్పిన మాటను పక్కనపెట్టి వెళ్లి జగన్ పక్క నిలబడతాడు. లేదా ఈలోపే కేంద్రంతో మంచి సంబంధాలు కనుక బల పడితే ఏ చిన్న రాష్ట్రానికి గవర్నర్గా వెళ్లిన ఆశ్చర్యపోకలేదు. గవర్నర్ పోస్ట్ కు ఎలాగో రాజకీయాలతో సంబంధం ఉండదు కనుక చెప్పిన మాట మీద నిలబడ్డాను అనుకుంటాడు సాయి రెడ్డి.సాయి రెడ్డి నిష్క్రమణ జగన్కు తెలియకుండా జరిగిందనుకోలేము. కచ్చితంగా జగన్ అనుమతితోనే సాయి రెడ్డి బయటపడతాడు. దీనివల్ల వైసీపీలో కొందరికి బిగ్ రిలీఫ్. అయితే నలుగురు ఐదుగురు ఎంపీల ను సాయి రెడ్డి ఆకుపై బిజెపికి అప్పజెప్పే ప్రమాదం లేకపోలేదు. ఏదేమైనా రాజకీయాలను తప్పు కోలేదు… తెలివిగా ముప్పు నుంచి తప్పించుకున్నాడు.