అణు దాడిని మోడీ అడ్డుకున్నాడా? ఏంటా వ్యూహాత్మక అణ్వాయుధాలు?

ఉక్రెయిన్‌పై అణు దాడి చేయాలని పుతిన్ డిసైడ్ అయ్యారా? చివరి నిమిషంలో పుతిన్‌ను ప్రధాని మోడీ అడ్డుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే అంటున్నారు పోలాండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి వ్లాడిస్లా టియోఫిల్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 19, 2025 | 01:50 PMLast Updated on: Mar 19, 2025 | 1:50 PM

Did Modi Prevent A Nuclear Attack What About Strategic Nuclear Weapons

ఉక్రెయిన్‌పై అణు దాడి చేయాలని పుతిన్ డిసైడ్ అయ్యారా? చివరి నిమిషంలో పుతిన్‌ను ప్రధాని మోడీ అడ్డుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే అంటున్నారు పోలాండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి వ్లాడిస్లా టియోఫిల్. మోడీ కనుక మాట సాయం చేయకపోయి ఉంటే ఉక్రెయిన్ ఎప్పుడో ధ్వంసం అయ్యేదనీ, ఆరోజే మూడో ప్రపంచ యుద్ధం మొదలయ్యేదని అణు విస్ఫోటనం లాంటి ప్రకటన చేశారు. దీంతో గతేడాది మోడీ పోలాండ్ పర్యటనలో అసలేం జరిగింది? అణు దాడి విషయంలో పుతిన్ మనసును మోడీ ఎలా మార్చారు? అణు ముప్పు నుంచి ఉక్రెయిన్‌ను ఎలా సేవ్ చేశారు వంటి ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇంతకూ, 2024 ఆగస్ట్ నాటి పోలాండ్ టూర్‌లో అసలేం జరిగింది? పోలాండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి బయటపెట్టిన ఆ టాప్ సీక్రెట్స్ ఏంటి? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కానీ, ట్రంప్ కంటే ముందే భారత ప్రధాని మోడీ సుదీర్ఘ యుద్ధానికి చెక్ పెట్టేలా వార్‌జోన్‌లో మంతనాలు జరిపారు. గతేడాది రష్యా, ఉక్రెయిన్ రెండో దేశాల్లో పర్యటించి యుద్ధం ముగింపుకు చర్చలు ఒక్కటే ఆప్షన్ అని పుతిన్, జెలెన్‌స్కీలకు తేల్చి చెప్పారు. ఆ రెండు దేశాల యుద్ధంలో భారత్ తటస్థంగా లేదని శాంతివైపే నిలబడిందని ప్రకటించారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత యుద్ధభూమిలో కాలుమోపి మోడీ ఏం సాధించారనే ప్రశ్నలూ ఉదయించాయి. ఆ ప్రశ్నలకే పోలాండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి సమాధానం ఇచ్చారు. మోడీ మాట సాయంతోనే ఉక్రెయిన్ అణు విధ్వంసం నుంచి తప్పించుకుందని సంచలన ప్రకటన చేశారు. భారత్‌ గొప్ప మాట సాయం చేసిందని కొనియాడారు. ఉక్రెయిన్‌పై వ్యూహాత్మక అణ్వాయుధాలు ప్రయోగించకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మోడీ ఒప్పించారని వెల్లడించారు. కానీ, ఉక్రెయిన్‌పై అణుదాడి చేస్తే ఆ ప్రభావం రష్యాపైనా పడుతుంది కదా అంటారా అక్కడే ఉంది అసలు మెలిక. ఎందుకంటే ఉక్రెయిన్‌పై రష్యా సంధించాలనుకుంటి సెకండ్ వరల్డ్ వార్‌లో హిరోషిమాపై వేసిన అణు బాంబు తరహావి కావు.

టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్.. ఉక్రెయిన్‌పై పుతిన్ సంధించాలనుకున్నది వీటినే. యుద్ధ భూమిలో పరిమిత దాడులు చేసేందుకు ఉపయోగించే చిన్న అణ్వాయుధ క్షిపణులు, ఆయుధ రవాణా వ్యవస్థను వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధాలుగా పిలుస్తారు. వీటిని ప్రధానంగా రేడియో యాక్టివ్ ప్రభావం ఎక్కువగా లేకుండా ఒక ప్రత్యేక ప్రాంతంలో శత్రు లక్ష్యాలను వినాశనం చేసేందుకు రూపొందించారు. రష్యా దగ్గర ఉన్న వాటిలో కేవలం 10 కిలోమీటర్ల పరిధిలో అణు ధార్మికతని సృష్టించగలవి, అలాగే 2 కిలోమీటర్ల పరిధిలో కూడా అణు ధార్మికతని సృష్టించగల చిన్నవి ఉన్నాయి. అతి చిన్న వ్యూహాత్మక న్యూక్లియర్ ఆయుధం ఒక కిలో టన్ను లేదా అంతకంటే తక్కువ బరువు ఉంటుంది. అతిపెద్దది 100కిలో టన్నుల వరకు బరువు ఉండొచ్చు. అణ్వస్త్ర ఆయుధాలు భారీగా వెయ్యికిలో టన్నుల వరకు బరువుతో ఉంటాయి. వీటిని సుదూర లక్ష్యాలను చేధించేందుకు ప్రయోగిస్తారు. అమెరికా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమా‌పై 15 కిలో టన్నుల బరువుండే అణు బాంబును వేసింది. ఆనాటి అణుగాయం నేటికీ జపాన్‌ను వేధిస్తూనే ఉంది.

మాస్కో దగ్గర దాదాపు 2000 వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నట్టు అమెరికా నిఘా వర్గాలు గతంలో తెలిపాయి. ఈ అణ్వాయుధాలను క్రూయిజ్ క్షిపణులు, తుపాకీ గుళ్ళు లాంటి సాధారణ పేలుడు పదార్ధా లను ప్రయోగించగలిగే క్షిపణుల ద్వారా కూడా ప్రయోగించవచ్చు. వ్యూహాత్మక అణ్వాయుధాలను విమానాలు, నౌకల నుంచి కూడా సంధించే వీలుంది. రష్యా ఇటీవలి కాలంలో తమ పరిధిని, దాడుల కచ్చితత్వాన్ని మెరుగుపరుచుకునేందుకు వ్యూహాత్మక అణ్వస్త్రాయుధాలపై అధికంగా ఖర్చు చేస్తోందని అమెరికా ఎప్పుడో ఆరోపించింది. అయితే, రష్యా దగ్గరున్న వ్యూహాత్మక అణ్వాయుధాల్ని గతంలో ఎన్నడూ ప్రయోగించిన దాఖలాలు లేవు. కానీ, ఉక్రెయిన్‌పై దండయాత్ర మొదలైన తర్వాత పుతిన్ యాక్షన్ చూసి న చాలా మందికి చరిత్రలో తొలిసారి వ్యూహాత్మక అణ్వాయుధ దాడులకు సమయం ఆసన్నమైందా అన్న అనుమానాలు కలిగాయి. గతేడాది మోడీ రష్యా పర్యటనకు వెళ్లే కొద్ది రోజుల ముందు సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు అణ్వాయుధాలను ప్రయోగించడానికీ తాము వెనకాడబోమని పుతిన్ అమెరికాను హెచ్చరించారు.

మరోవైపు.. రష్యాలో అణ్వాయుధాలను ఉపయోగించే విధానంలో మార్పులను గతేడాదే పుతిన్ ఆమోదించారు. రష్యా కొత్త అణ్వాయుధ విధానం ప్రకారం, అణ్వాయుధాలు లేని దేశం, అణ్వాయు ధాలున్న దేశంతో జట్టు కడితే, ఆ రెండు దేశాలు తమపై దాడి చేస్తున్నట్లు రష్యా భావిస్తుంది. ఉక్రెయిన్ వద్ద అణ్వాయుధాలు లేవు. కానీ అమెరికా వద్ద ఉన్నాయి. అమెరికా, బ్రిటన్ ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా ఉన్నాయి. ఆయుధాలు, నిధులు అందిస్తున్నాయి. దీంతో పాటు 32 దేశాల సైనిక కూటమి నేటో కుడా ఉక్రెయిన్‌కు మద్దతిస్తోంది. రష్యా మీద మరో దేశం క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినా, వైమానిక దాడులు చేస్తే, ఆ దేశం మీద అణ్వాయుధాలతో ప్రతిస్పందించేలా రష్యన్ అణు విధానంలో మార్పులు చేశారు. ఈ పరిణామాలన్నీ రష్యా అణు దాడికి సిద్ధమవుతోందన్న అనుమానాలకు తావిచ్చాయి. పుతిన్ ఆ దిశగా ఎలాంటి అడుగులూ వేయలేదు. దీని వెనుక మోడీ ఉన్నట్టు ఇప్పుడు పోలాండ్ విదేశాంగ శాఖ సహా యమంత్రి చెప్పారు. అంటే మోడీ లేకపోతే మూడేళ్ల యుద్ధం ఎప్పుడో అణు యుద్ధంగా మారి ఉండేదన్న మాటే. అదే జరిగితే ఈపాటికే మూడో ప్రపంచ యుద్ధమూ మొదలయ్యి ఉండేది.