కేదార్ వెనుక.. బడా బాబులు…! చనిపోయాడా.. ? చంపేసారా..?
కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. ఆ కేసును వాదించిన సంజీవరెడ్డి అనుమానస్పదంగా మృతి చెందాడు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కేదార్ అనుమానస్పదంగా మరణించాడు.

కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యాడు. ఆ కేసును వాదించిన సంజీవరెడ్డి అనుమానస్పదంగా మృతి చెందాడు. డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న కేదార్ అనుమానస్పదంగా మరణించాడు. వీరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉన్న లింకులేంటి ? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్న అనుమానాలేంటి ? దుబాయ్ లో కేదార్ ను చంపేశారా ? లేదంటే సహజ మరణమేనా ? ఇప్పుడిదే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సినీ నిర్మాత కేదార్ ను ఎవరైనా చంపేశారా ? లేదంటే సాధారణ మరణమా ? అనుమానాస్పద మరణాల్లో సాధారణంగా దుబాయ్ పోలీసులు సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. కేసు తేలేదాకా వివరాలను బహిర్గతం చేయరు. కేదార్ కేసులోనూ.. ఆయన మరణానికి కారణాలను వెల్లడించలేదు. భారతీయ అధికారులకు, రాయబార కార్యాలయానికి కూడా.. ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అంటే కేదార్ ది హత్యేనన్న అనుమానాలకు బలం చేకూరుతోంది. కేదార్ చనిపోయారనే సమాచారమైతే వచ్చింది. అసలేం జరిగిందన్నది మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కేసుపై క్లారిటీ వస్తేనే దుబాయ్ పోలీసులు క్లియరెన్స్ ఇస్తారు. గుండెపోటుతో చనిపోయారని చెబుతున్నారు సరే…కానీ అక్కడి పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరణంపై ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు. కేదార్ చనిపోయింది దుబాయ్ లో కాబట్టి అక్కడి పోలీసులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఎలాంటి కారణాలతో చనిపోయారో బయట పెట్టే అవకాశం ఉంది.
కేదార్ విషయంలో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయినా.. బంధువులకు అప్పగించలేదు. మరణానికి గల కారణాలు వెలుగులోకి రాలేదు. పోస్టుమార్టం నివేదికను బయట పెట్టలేదు. ప్రాథమిక నివేదిక వచ్చేవరకు మృతదేహాన్ని అప్పగించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దుబాయ్ సహా.. గల్ఫ్ దేశాల్లో అనుమానాస్పద మరణాలు సంభవిస్తే.. బాధితుల దేశానికి చెందిన రాయబారులకు కూడా వివరాలు చెప్పరు. కేదార్ విషయంలోనూ అధికారవర్గాలకు సమాచారం లేదు. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే…కేదార్ ది హత్యేనన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ కారణంగానే డెడ్ బాడీని బంధువులకు అప్పగించలేని తెలుస్తోంది. ఒకవేళ తమ దర్యాప్తు పూర్తయితే.. కాన్సులర్ ఎక్సాస్ అనుమతితో తొలుత భారత దౌత్య కార్యాలయానికి సమాచారం అందిస్తారు. ఆ తర్వాతే.. కేదార్ మృతికి కారణాలపై స్పష్టత ఇస్తారు. ప్రస్తుతం ఇవేమీ జరగలేదు గనుకే…కేదార్ ది అనుమానాస్పద మరణమేననడానికి బలం చేకూరుతోంది.
కేదార్ వరుస షెడ్యూళ్లతో కొన్ని రోజులుగా సరిగా నిద్రపోవడం లేదని తెలుస్తోంది. ఆదివారం భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. ఆ తర్వాత సినీరంగ ప్రముఖులతో జరిగిన విందులో పాల్గొన్నారు. పని మనిషికి ఫోన్ అప్పగించి నిద్రపోయాడు. ఉదయాన్నే విగతజీవిగా కనిపించాడు. కేదార్ ఇంటికి వచ్చిన దుబాయ్ పోలీసులు వంటమనిషి సహా.. నలుగురిని విచారించారు. వారిలో ఓ మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. సదరు మాజీ ఎమ్మెల్యే పోలీసులకు స్టేట్‌మెంట్ ఇవ్వగానే భారత్‌కు తిరుగు ప్రయాణమైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరన్న దానిపై మిస్టరీగా మారింది. నిజామాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేనా ? లేదంటే ఇంకెవరన్నది మిస్టరీగా మారింది.
కేటీఆర్ వ్యాపార భాగస్వామి టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్, కాళేశ్వరంపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి, కేసు వాదించిన సంజీవ రెడ్డి అనుమానస్పద మరణాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనేక అనుమానాలను లేవనెత్తారు. ఈ మూడు మరణాల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దుబాయ్లో అనుమానాస్పదంగా చనిపోయిన కేదార్…మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు వ్యాపార భాగస్వామి. అంతేకాదు. హైదరాబాద్ ర్యాడిసన్బ్లూ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడని తెలిపారు. కాళేశ్వరం కుంగుబాటుపై పిటిషన్ వేసిన రాజలింగమూర్తి హత్యకు గురయ్యారని, ఆ కేసు వాదించిన సంజీవ రెడ్డి అనుమానస్పదంగా మృతి చెందారని అన్నారు. అనుమానాస్పద మరణాలపై కేటీఆర్…జ్యుడిషియల్ విచారణ ఎందుకు కోరట్లేదని ప్రశ్నించారు.
నిజానికి కేదార్ పెద్ద నిర్మాత ఏం కాదు. ఆ మాటకు వస్తే ఆయన తీసినవి రెండు..మూడు సినిమాలు మాత్రమే. అవి కూడా ఒక మోస్తరు బడ్జెట్ తోనూ.. చిన్నపాటి కథానాయకులతోనే తీశారు. క్రేజీ ప్రాజెక్టుల్ని తెరకెక్కించింది లేదు. పెద్ద నిర్మాతలతోనూ పని చేయలేదు. అలాంటప్పుడు కేదార్ మరణం టాలీవుడ్ అగ్రహీరోలకు ఉలికిపాటుకు గురి చేయటమే కాదు.. ఇప్పుడేం చేయాలి? అన్న సందిగ్థంలో పడిపోయారు.