ఆ రెడ్‌ కారే ప్రాణం తీసిందా ? ప్రవీణ్ కేసులో మలుపు

ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. ప్రవీణ్‌ ప్రయాణించిన దారిలో మొత్తం 15 గంటల సీసీ ఫుటేజ్‌ సేకరించారు పోలీసులు. ప్రవీణ్‌ బైక్‌ను ఓవర్‌టేక్‌ చేసిన ప్రతీ వాహనాన్ని గుర్తించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2025 | 04:55 PMLast Updated on: Mar 29, 2025 | 4:55 PM

Did That Red Car Take His Life A Turning Point In Praveens Case

ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో సస్పెన్స్‌ కంటిన్యూ అవుతోంది. ప్రవీణ్‌ ప్రయాణించిన దారిలో మొత్తం 15 గంటల సీసీ ఫుటేజ్‌ సేకరించారు పోలీసులు. ప్రవీణ్‌ బైక్‌ను ఓవర్‌టేక్‌ చేసిన ప్రతీ వాహనాన్ని గుర్తించారు. వాళ్లందరినీ పోలీసులు సీక్రెట్‌గా విచారిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ప్రవీణ్‌కు యాక్సిడెంట్‌ అయిన ప్రాంతంలో ఓ రెడ్‌ కారు ప్రవీణ్‌ బైక్‌ను క్రాస్‌ చేసి వెళ్లింది. ఆ కారు వెళ్లిన తరువాతే ప్రవీణ్‌ బైక్‌ పడిపోయింది. ఆ కారు ఎవరిది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ కారు వివరాలు దొరికితే కేసులో ఓ అడుగు ముందుకు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రవీణ్‌ డెడ్‌ బాడీకి పోస్ట్‌ మార్టం కూడా పూర్తయ్యింది. ఇవాళ సాయంత్రానికి పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రిపోస్ట్‌ వస్తే ఈ కేసులో ఓ క్లారిటీ వస్తుంది. మరోపక్క గతంలో ప్రవీణ్‌ను చంపేస్తామంటూ వీడియోలు పోస్ట్‌లు పెట్టిన షమీ అనే వ్యక్తి కూడా తనకేం సంబంధం లేదంటూ వీడియోలు పెడుతున్నాడు. ప్రవీణ్‌తో మతపర విభేదాలు ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ ప్రాణాలు తీసేంత కోపం తనకు లేదంటూ వీడియో కూడా రిలీజ్‌ చేశాడు. ఏది ఎలా ఉన్నా.. సమాధానం లేని 100 ప్రశ్నలకు కేంద్రంగా ఉన్న ఈ కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌తో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.