తెలుగు ప్రజలు తమిళనాడుకు వలస వెళ్లారా కస్తూరి మాటల్లో అసలు వివాదమేంటి ?
"దాదాపు 300 ఏళ్ల క్రితం తమిళ రాజుల దగ్గర అతఃపురంలో పని చేయడానికి వచ్చిన పనివాళ్లు ఈ తెలుగువాళ్లు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పడానికి మీరెవరు" ఇవి కస్తూరి తెలుగు గురించి తెలుగు ప్రజల గురించి చేసిన కామెంట్స్.
“దాదాపు 300 ఏళ్ల క్రితం తమిళ రాజుల దగ్గర అతఃపురంలో పని చేయడానికి వచ్చిన పనివాళ్లు ఈ తెలుగువాళ్లు. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పడానికి మీరెవరు” ఇవి కస్తూరి తెలుగు గురించి తెలుగు ప్రజల గురించి చేసిన కామెంట్స్. కస్తూరి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ మారాయి. స్వయంగా బీజేపీ నేతలు కూడా ఈ కామెంట్స్‌ను తప్పుబట్టడం, విపరీతమైన వ్యతిరేకత రావడంతో కస్తూరి తెలుగు ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కానీ ఆమె చేసిన కామెంట్స్ మాత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి. నిజంగా తెలుగు వాళ్లు తమిళ రాజుల దగ్గర పని చేయడానికి వెళ్లి అక్కడ స్థిరపడ్డారా. ఇదే ఇప్పడు అందరిలో ఉన్న డౌట్.
నిజానికి 1655లో మద్రాసుకు ప్రెసిడెన్సీ హోదా ఉండటంకంటే ముందు నుంచే అక్కడ తెలుగు వాళ్లు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఏపీ, రాయలసీమ ప్రాంతాలు ఒకప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్నవే. కర్నాటిక్ యుద్ధం తరువాత ఫ్రెంచ్ ఆధీనం నుంచి మద్రాసు బ్రిటీషర్స్ ఆధీనంలోకి వచ్చింది. ఆ తరువాత ఒప్పందం ప్రకారం నిజాం ఆధీనంలో ఉన్న కొన్ని తెలుగు మాట్లాడే వాళ్ల ప్రాంతాలు కూడా మద్రాసు ప్రెసిడెన్సీలోకి వెళ్లిపోయారు. టెక్నికల్‌గా ప్రాంతాల విస్తీర్ణం పెరుగుతూ తగ్గుతూ వచ్చింది తప్ప ఎవరూ ఎక్కడికీ వెళ్లలేదు. అంతా కలిసే ఉన్నాం కాబట్టి కొందరు తెలుగు మాట్లాడారు కొందరు తమిళ్ మాట్లాడారు. 1947లో ఇండియాకు స్వతంత్రం వచ్చిన తరువాత మద్రాసు రాష్ట్రంగా ఏర్పడింది. కానీ అప్పటికే 1913 నుంచి తెలుగు మాట్లాడేవాళ్లకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని పోరాటాలు మొదలయ్యాయి. అనేక పోరాటాల తరువాత తెలుగు మాట్లాడేవాళ్లకు ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ కలిపి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేశారు.
ముందు నుంచీ అన్ని ప్రాంతాల్లో కలిసే ఉన్నాయి కాబట్టి తమిళనాడులో తెలుగు మాట్లాడేవాళ్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వాళ్లు మాట్లాడేది తెలుగే ఐనా టెక్నికల్‌గా వాళ్లు తమిళులే కదా వాళ్లను తమిళులు కాదు అని మీరేలా అంటారు. తెలుగు జనాభా తమిళనాడులో రాజుల అతఃపురాల వల్లే పెరిగిందని మీరెలా చెప్తారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి.. అదీ కేంద్రలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ స్థాయిలో ఎగిరెగిరి పడుతున్నారు.. ఓకే.. కానీ మీ పార్టీని మీరు ఇంప్రెస్ట్ చేసుకోడానికి తెలుగు వాళ్ల మీద విషం కక్కడం మీరు.. మీవాళ్లు ఇక ఆపేస్తే బెటర్. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినా.. చాలా మంది తెలుగువాళ్లు అక్కడి ఉన్నారు. 1970 వరకూ కూడా తెలుగు సినీ పరిశ్రమ చెన్నై బేస్‌గానే నడిచింది. అలా నడిచింది కాబట్టే చెన్నై స్టార్స్‌కు ఇప్పటికీ తెలుగులో ఇంత మార్కెట్ ఉంది.
తమిళనాడుకు చెందిన చాలా మంది హీరోలు తెలుగులో మార్కెట్ పెంచుకుంటున్నారు. తెలుగు వాళ్లకు బిగ్గెస్ట్ మార్కెట్ అని ఒప్పుకుంటున్నారు. కానీ తెలుగు హీరోలు చెన్నికి వెళ్లి వాళ్ల మార్కెట్‌ను మీ స్థాయిలో పెంచుకోవడంలేదు. ఆఖరికి ఈ కామెంట్స్ చేసిన మీరు కూడా తెలుగులో సీరియల్స్ చేస్తున్నారు. తెలుగు ప్రజలు వాటిని ఆదరిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరు ఎవరి దయ మీద బతుకుతున్నారు. ఎవరు ఎవర్ని ఆదరిస్తున్నారు అని కస్తూరిని ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు తెలుగు పీపుల్. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగితే.. రాజకీయాలు ఇటు సినిమాలు రెండూ లేకుండా పోతాయని పోస్ట్‌లు పెడుతున్నారు. ట్రోలింగ్‌కు భయపడి సారీ చెప్పిన కస్తూరి ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటుందా లేక ఇదే అమాయకత్వాన్ని కంటిన్యూ చేస్తుందా చూడాలి.