అప్పుడు తెలీదా బెయిల్ రద్దు అని…? షర్మిల సంచలనం

జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు.. 32 కోట్లు విలువ జేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమే అని తెలిపారు. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 30, 2024 | 01:50 PMLast Updated on: Oct 30, 2024 | 1:50 PM

Did You Know Then That The Bail Was Cancelled Sharmila Sensation

జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేసేందుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేసారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లను కాదు.. 32 కోట్లు విలువ జేసే కంపెనీ స్థిరాస్తి మాత్రమే అని తెలిపారు. షేర్ల బదలాయింపుపై ఎటువంటి ఆంక్షలు, అభ్యంతరాలు లేవన్నారు. స్టేటస్ కో ఉన్నది షేర్స్ మీద కాదు. గతంలో కూడా ఎన్నో కంపెనీల ఆస్తులను ED అటాచ్ చేసినప్పటికీ వాటి షేర్లు.. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్, బదిలీలను మాత్రం ఆపలేదని అన్నారు.

2016 లో ఈడీ, భూములను అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదని వింతగా మీరు చెప్పడం హాస్యాస్పదం అని ఆమె ఎద్దేవా చేసారు. 2019 లో షర్మిలా రెడ్డి గారికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని స్పష్టంగా పేర్కొంటూ MOU మీద సంతకం చేశారని… అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని ? అని ప్రశ్నించారు. 2021 లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్ కి చెందిన , సరస్వతి షేర్లను 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారు ? అని నిలదీశారు. అప్పుడు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని ? అపుడు స్టేటస్ కో ను ఉల్లంఘించినట్లు కాదా ? అంటూ ప్రశ్నించారు.
2021 లో జగన్ గారు, భారతి రెడ్డి గారు తమ షేర్స్ పై సంతకం చేసి, విజయమ్మ గారికి ఫోలియో నెంబర్లతో సహా రాసి గిఫ్ట్ డీడ్ ఇచ్చారని ఇచ్చే ముందు తెలియదా బెయిల్ రద్దు అవుతుందని..? అని నిలదీశారు. షేర్స్ ట్రాన్స్ఫర్ కి , బెయిల్ రద్దుకు సంబధం లేదని మీకు కూడా తెలుసు కాబట్టే అప్పుడు అవి చేశారన్నారు. ఇప్పుడు మాత్రం రాజకీయాలు చేస్తున్నారని NCLT లో కేసు ఉంది కాబట్టి.. షేర్స్ గురించి మాట్లాడితే అది సబ్ జుడీస్ అవుతుందని, కొడుకు బెయిల్ కి వచ్చిన ఇబ్బంది ఏమి లేదని విజయమ్మ గారికి తెలుసన్నారు. విజయమ్మ గారు లేఖ తాను రాయకపోతే… ఆ లేఖతో సంబంధం లేదని, అది నేను రాయలేదని, స్వయంగా లేఖను ఖండించే వారు కదా అని ప్రశ్నించారు.