Top story: దుబాయ్‌లో గోల్డ్ కొంటున్నారా…? అయితే వాచిపోయినట్లే…!
దుబాయ్ అంటే మనకు టక్కున గుర్తొచ్చేది బంగారం... ఛాన్స్ దొరికితే అక్కడ్నుంచి గోల్డ్ తెప్పించుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే వెయిట్... అక్కడ్నుంచి బంగారం తెచ్చుకుంటే మీకు బొక్కే... అవును నిజమే అక్కడికంటే మన దగ్గరే గోల్డ్ రేట్ తక్కువ..!
దుబాయ్ అంటే మనకు టక్కున గుర్తొచ్చేది బంగారం… ఛాన్స్ దొరికితే అక్కడ్నుంచి గోల్డ్ తెప్పించుకోవాలని ప్లాన్ చేస్తారు. అయితే వెయిట్… అక్కడ్నుంచి బంగారం తెచ్చుకుంటే మీకు బొక్కే… అవును నిజమే అక్కడికంటే మన దగ్గరే గోల్డ్ రేట్ తక్కువ..! నిన్నటి దాకా అక్కడ గోల్డ్ చీప్… కానీ ఇప్పుడు అక్కడే కాస్ట్‌లీ… ఎలాగో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చూడాల్సిందే…
మనవాళ్లు ఎవరైనా విదేశాల నుంచి ముఖ్యంగా దుబాయ్, సింగపూర్ నుంచి వస్తుంటే మనం ఫస్ట్ చేసే పని గోల్డ్ తెప్పించుకోవడం. దుబాయ్, అబుదబి, ఒమన్, ఖతార్, సింగపూర్‌లు మనకు ట్రెడిషనల్ గోల్డ్ బయింగ్ డెస్టినేషన్స్. మనతో పోల్చితే పసిడి రేటు అక్కడ చాలా తక్కువ. కాసుకు కనీసం పదివేలకు పైనే తగ్గేది. అందుకే దుబాయ్ గోల్డ్‌కు అంత డిమాండ్. అక్కడ గోల్డ్ స్ట్రీట్‌లో ఎక్కువ కొనుగోలు చేసేది మనవాళ్లే… దుబాయ్ వెళ్లిన వాళ్లెవరైనా అక్కడ బంగారం కొనకుండా రారు. ఎంతో కొంత కొనాల్సిందే. మనకంటే అక్కడ గోల్డ్ రేట్ తక్కువ అన్న కారణంతోనే ఎక్కువగా దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ అయ్యేది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అయితే గోల్డ్ డెన్‌గా మారిపోయింది. దుబాయ్ నుంచి వచ్చే పాసింజర్లలో రోజూ ఎవరో ఒకరు స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయేవారు. ఇక దొరక్కుండా బయటకు వెళ్లిపోయిన గోల్డ్ ఎంతో చెప్పలేం…
ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఇక విదేశాల నుంచి గోల్డ్ తెప్పించుకోవాల్సిన పనిలేదు. దుబాయ్, సింగపూర్ కంటే మన దగ్గరే గోల్డ్ చవక. ఇది నిజంగా నిజమే… ప్రస్తుతం మన దగ్గర 24క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర 75వేల 650 రూపాయలుగా ఉంది. అదే దుబాయ్‌లో అయితే 75వేల 9వందలుగా ఉంది. ఇక ఒమన్‌లో 75వేల 763, ఖతార్‌లో 76వేల 293 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం రేటులో కూడా తేడా కాస్త అటూ ఇటుగా అలాగే ఉంది.
ఒకప్పుడు మనకంటే పదివేలు తక్కువ రేటుండే 10గ్రాముల బంగారం ఇక్కడ ఒక్కసారిగా అంతలా ఎలా పెరిగింది…? మనకంటే రేటు ఎందుకు ఎక్కువైంది…? అంతర్జాతీయ పరిణామాల కారణంగా అక్కడ రేటు మన స్థాయిలో తగ్గడం లేదు. ఇజ్రాయెల్-గాజా యుద్ధంతో మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ అసెట్ బంగారంవైపే మొగ్గుచూపుతున్నారు. దీని కారణంగానే గల్ఫ్ దేశాల్లో బంగారం ధర తగ్గడం లేదు. ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో పసిడి ధర పెరగడం సహజమే. ఖతార్, ఒమన్‌ల్లో సహజంగానే బంగారానికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే పరిస్థితులు బాగోలేకపోవడంతో పసిడి కొనుగోళ్లు పెరిగాయి. దీంతో బంగారం ధర భారీగా తగ్గడం లేదు. ఇటు సింగపూర్‌లోనూ పసిడిపై పెట్టుబడులు పెట్టేవారు ఎక్కువగా ఉండటంతో ధర భారీగా తగ్గడం లేదు. కాబట్టి మనం దుబాయ్ నుంచో సింగపూర్ నుంచో బంగారం తీసుకురమ్మని ఫ్రెండ్స్‌నో, ఫ్యామిలీ మెంబర్స్‌నో బతిమాలాల్సిన పనిలేదు. మన దగ్గర తక్కువకు దొరుకుతుంటే ఇంకెక్కడి నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. గతేడాదితో పోల్చితే 24శాతం పెరిగి అక్టోబర్‌లో పీక్స్‌కు చేరిన పసిడి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. నెలరోజుల్లో దాదాపు 10శాతం తగ్గాయి. మూడేళ్లలో ఎప్పుడూ పడనంత స్థాయిలో గతవారం పుత్తడి దిగివచ్చింది. మరికొన్ని రోజుల పాటు బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 72-73వేల స్థాయికి దిగుతుందన్నది నిపుణుల అంచనా. అదీ దాటితే 70వేల దగ్గర స్థిరపడుతుంది. డిసెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చు. ట్రంప్ జనవరిలో బాధ్యతలు తీసుకుంటారు. దానికంటే ముందే డిసెంబర్‌లో ఫెడ్ రిజర్వ్ సమావేశం జరగనుంది. ఇటీవలి కాలంలో రెండుసార్లు ఫెడ్ వడ్డీరేట్లలో కోత పెట్టింది. రానున్న రోజుల్లో దాని వ్యూహం ఎలా ఉండబోతోందన్నది డిసెంబర్ మీటింగ్‌తోనే తేలనుంది. భవిష్యత్తులో వడ్డీరేట్లు మరింత తగ్గుతాయా లేదా అన్నది అందులోనే తేలుతుంది. ఒకవేళ ఇంకా వడ్డీరేట్లు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడం వంటి సంకేతాలు వస్తే మాత్రం పసిడికి మద్దతు దొరకొచ్చు. అంటే ఇప్పుడున్న బేరిష్ ట్రెండ్ నుంచి మళ్లీ బుల్లిష్‌లోకి మారిపోతుంది. అయితే ట్రంప్ వడ్డీరేట్ల తగ్గింపునకు వ్యతిరేకంగా ఉన్నారు.
పరిస్థితులు కుదురుకోవడం, అనిశ్చిత పరిస్థితులు తొలగిపోవడం వంటివి బంగారాన్ని దాని వాస్తవ స్థితికి దగ్గర చేస్తున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ట్రంప్‌పై బంగారం భవిష్యత్తు ఆధారపడి ఉందంటున్నారు. ఆయన ఆర్థిక విధానాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని ఫలితంగా వడ్డీరేట్లు భవిష్యత్తులో తగ్గడం కాస్త కష్టమే అని అంచనా వేస్తున్నారు. ఎక్కువ వడ్డీరేట్లుంటే పెట్టుబడిదారులు పసిడికి దూరం అవుతారు. బంగారం నుంచి ఎటువంటి ఆదాయం రాదు కాబట్టి డిపాజిట్లు ఇతర మార్గాల వైపు మళ్లుతారు. ట్రంప్ గెలవకముందు వరకు డిసెంబర్‌లో వడ్డీరేట్లు మరింత తగ్గుతాయని 83శాతం మంది అంచనా వేశారు. కానీ ఇప్పుడు అది 59శాతానికి పడిపోయింది. అంటే వడ్డీరేట్లు తగ్గవు, ఇటు డాలర్ బలపడుతోంది. ఇవన్నీ కలిపి బంగారంపై ప్రెజర్ పెంచుతున్నాయి. క్రిప్టో దూకుడు కూడా బంగారం డిమాండ్‌కు బ్రేక్ వేస్తోంది.
స్వల్పకాలంలో బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకుల్లోనే ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో మాత్రం పసిడి మళ్లీ పుంజుకోవచ్చు. ఫెడ్ రెండుసార్లు రేట్ల కోత పెట్టడంతో RBIపై కూడా వడ్డీరేట్లు తగ్గించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. అయితే ద్రవ్యోల్బణం పెరుగుదల RBIని ఆ దిశగా నిర్ణయాలు తీసుకోనివ్వడం లేదు. ఒకవేళ తగ్గిస్తే మాత్రం పసిడికి మద్దతు దొరుకుతుంది. సో గోల్డ్ లవర్స్ బంగారం కొనడానికి ఇదే సరైన సమయం. మంచి తరుణం మించిన దొరకదు అనుకుని తొందరపడండి. మళ్లీ పసిడి పరుగు పెడితే పట్టుకోవడం కాస్త కష్టమే,