భారత్‌తో కాళ్లబేరానికి యూనస్ ,బంగ్లాదేశ్ దారికి వచ్చినట్టేనా? బ్యాంకాక్ భేటీలో ఏం జరిగింది?

ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగకూడదు.. దేశాన్ని నడిపే స్థానంలో ఉన్న వాళ్లు ఆ పని అస్సలు చేయకూడదు. కానీ, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత అదే చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 5, 2025 | 05:00 PMLast Updated on: Apr 05, 2025 | 5:00 PM

Did Yunus And Bangladesh Come To The Rescue Of India What Happened In The Bangkok Meeting

ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది వాగకూడదు.. దేశాన్ని నడిపే స్థానంలో ఉన్న వాళ్లు ఆ పని అస్సలు చేయకూడదు. కానీ, బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత అదే చేశాడు. డ్రాగన్ అండ చూసుకొని భారత్‌పైనే బెదిరింపులకు దిగాడు. ‘సెవెన్ సిస్టర్స్ ప్రస్తావన తెచ్చి నీకూ నాకూ ఒక్కరే శత్రువు.కలిసి భారత్‌లో విధ్వంసం సృష్టిద్దాం అంటూ విధ్వంసకర వ్యాఖ్యలు చేశాడు. ఇదంతా జిన్‌పింగ్ మెప్పు పొందడం కోసమే. కానీ, ఎక్కడో యూనస్ లెక్క తప్పింది. దీంతో కథ మళ్లీ భారత్ దగ్గరకే వచ్చి ఆగింది. మోడీతో ఒక్క సమావేశం కోసం ఢాకా చేయని ప్రయత్నమంటూ లేదు. చివరికి బ్యాంకాక్‌లో ఆ సమావేశం జరిగింది. ఆ భేటీలోనే యూనస్‌కు క్లియర్ పిక్చర్ చూపించారు మోడీ. సాయం కావాలంటే తిక్క వాగుడు ఆపి, హిందువులపై దాడులు అడ్డుకోవాల్సిందే అని తేల్చి చెప్పారు. మరి ఈ భేటీతో అయినా బంగ్లాలో హిందువుల బతుకులు మారతాయా? యూనస్‌ నిజంగా దారికొచ్చినట్టేనా? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం..

100 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ అప్పు.. దారుణంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం.. వరల్డ్ బ్యాంక్, IMF ఆదుకుంటే తప్ప కోలుకోలేని పరిస్థితి. సింపుల్‌గా చెప్పాలంటే తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలాకు దగ్గరగా ఉంది బంగ్లాదేశ్. ఇలాంటి కష్టకాలంలో ఎవరైనా దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తారు. కానీ, యూనస్ మాత్రం పనికట్టుకుని భారత్‌తో కయ్యానికి కాలు దువ్వారు. తద్వారా చైనాకు దగ్గరవ్వొచ్చని భావించారు. కానీ, యూనస్ ఆశించిన రియాక్షన్ బీజింగ్ నుంచి రాలేదు. నిజానికి.. బంగ్లాదేశ్‌ ప్రధాని నుంచి ఇలాంటి ఒక ప్రకటన గురించి బీజింగ్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తోంది. చికెన్స్‌ నెక్ కారిడార్‌పై పట్టు కోసం డ్రాగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ, యూనస్ ఆఫర్‌ను యాక్సెప్ట్ చేసే సిట్యువేషన్‌లో చైనా లేదు. ఎందుకంటే, దానికి అసలు సమస్య అగ్ర రాజ్యంతో. అమెరికాలో ట్రంప్ ఎంట్రీ తర్వాత చైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. వచ్చే నాలుగు సంవత్సరాలు సీన్ ఇలాగే ఉంటుంది. ఇలాంటి సమయంలో భారత్‌తో వైరం కంటే స్నేహమే చైనాకి అవసరం. ఇది తెలుసు కాబట్టే ఇటీవల భారత్‌ను కలిసినడుద్దాం రమ్మని పిలుస్తోంది. ఇక్కడే యూనస్‌కు కూడా చైనా నుంచి మద్దతు దొరకదనే క్లారిటీ వచ్చింది. ఫలితంగా ఎలా అయినా మోడీతో సమావేశం అవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇదంత ఈజీగా జరగలేదు.

ప్రధాని మోడీతో భేటీ కోసం బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ నెల రోజులుగా ప్రయత్నాలు చేసింది. కానీ భారత్ మాత్రం చివరి నిమిషం వరకూ స్పష్టత ఇవ్వలేదు. చివరకు ఒక అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయింది. ఫలితంగా బ్యాంకాక్‌లో ఫస్ట్ టైం మోడీ, యూనస్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రజలే కేంద్రంగా ఉంటే సంబంధాలకు భారత్ ప్రాధాన్యం ఇస్తుందని మోడీ పునరుద్ఘాటించారు. బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలను భారత్ కోరుకుంటోందని యూనస్‌కు చెన్నారు. సరిహద్దుల్లో అక్రమ వలసలను నియంత్రించాలన్నారు. సరిహద్దు భద్రత, సుస్థిరత కాపాండేందుకు చొరబాట్లను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులపై ఆందోళనను కూడా యూనస్‌ దృష్టి తీసుకువెళ్లారు. అదే సమయంలో పర్యావరణాన్ని దెబ్బ తీసే విధంగా మాట్లాడటాన్ని నివారించాలని యూనస్‌కు హితవు పలికారు. ఇది యూనస్ సెవెన్‌ సిస్టర్స్‌ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ ఎపిసోడ్‌లో నెక్స్ట్ ఏం జరగబోతోంది?

బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం సహాయం అత్యవసరం. చైనా నుంచి ఆశించిన రియాక్షన్ రాలేదు కాబట్టి.. భారత్‌ను సాయం కోరాలనేది యూనస్ ప్లాన్ కావచ్చు. లేకపోతే మోడీతో భేటీ కోసం ఇంతగా ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మోడీ సైతం హిందువులపై దాడులు, సరిహద్దు భద్రత, అక్రమ చొరబాట్లను ప్రస్తావించడం ద్వారా యూనస్‌కు ఒక విషయాన్ని స్ప ష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. సరిహద్దుల్లో కుట్రలు మానుకొని, అక్రమ చొరబాట్లను నియంత్రించి, హిందువులపై దాడుల్ని అరికట్టాలని తేల్చి చెప్పారు. ఇవన్నీ జరిగితేనే భారత్, బంగ్లాదేశ్‌ మధ్య మళ్లీ సత్సంబంధాలు ఉంటాయనీ, ఢాకాకు అండగా నిలిచే ఛాన్స్ ఉంటుందనీ చెప్పారు. నిజానికి బంగ్లాదేశ్‌ లో హిందువులపై దాడుల విషయంలో భారత్ చాలా సందర్భాల్లో యూనస్ ముందు నిరసన తెలిపింది.
దాడులను ఆపాలని రిక్వెస్ట్ చేసింది. కానీ, యూనస్ మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఇదంతా భారత మీడియా సృష్టి అని కొట్టిపారేశారు. ఇప్పుడు యూనస్‌కు అటువంటి అవకాశం లేదు. ఎందుకంటే, ఢాకా పీకల్లోతు కష్టాల్లోఉంది. పైగా చైనా నుంచి స్పష్టమైన హామీ కూడా లేదు. భారత్‌ను కాదని అగ్రరాజ్యం అమెరికా కూడా సాయం చేయదు. కాబట్టి యూనస్‌ ముందున్న ఒకేఒక ఆప్షన్ భారత్‌తో స్నేహం ఒక్కటే. సో.. మోడీ చెప్పినట్టు హిందువులపై దాడుల్ని అడ్డుకోవాల్సిందే. ఇప్పటికైనా ఈ నిజం యూనస్‌కు అర్ధమైతే బంగ్లాదేశ్‌ పరిస్థితులు మారతాయి. లేదంటే ఏం చేయాలో భారత్‌కు బాగా తెలుసు.