పవన్ ను ఒప్పిస్తా… ధీమాగా అమరావతిలో దిల్ రాజు

ఏదేమైనా సినిమా పరిశ్రమ ఇప్పుడు కాస్త ఆందోళనలో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో సినిమా పరిశ్రమ పెద్దలు ఉన్నారు. రాజకీయ పరిణామాలు సినిమా వాళ్ళను గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టలేదు అనే చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2024 | 02:26 PMLast Updated on: Dec 30, 2024 | 2:26 PM

Dil Raju Meets Pawan Kalyan

ఏదేమైనా సినిమా పరిశ్రమ ఇప్పుడు కాస్త ఆందోళనలో ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో సినిమా పరిశ్రమ పెద్దలు ఉన్నారు. రాజకీయ పరిణామాలు సినిమా వాళ్ళను గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో ఇబ్బంది పెట్టలేదు అనే చెప్పాలి. చాలామంది రాజకీయ నాయకులను బుట్టలో వేసుకున్న సినిమా వాళ్లు రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం ఒకరకంగా పట్టపగలు చుక్కలు చూసే పరిస్థితి ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాని పరిస్థితిలో సినిమా పరిశ్రమ ఉంది.

బెనిఫిట్ షోలు అలాగే టికెట్ ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మంచి చేసుకోవాలని సినిమా పరిశ్రమ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు సినిమా పరిశ్రమ పెద్దలు సిద్ధమవుతున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఏపీ ప్రభుత్వంతో చర్చల కోసం సిద్ధమయ్యారు. గేమ్ చేంజర్ సినిమా విషయంలో దిల్ రాజు ఎలాగైనా సరే బెనిఫిట్ షోలకు అలాగే టికెట్ ధరల పెంపుకు ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించేందుకు దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇచ్చిన రోజున సినిమా ఈవెంట్ను గ్రాండ్ గా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ లోనే ఈవెంట్ జరగబోతుంది అంటూ ఆయన ప్రకటించారు. ఇప్పటికే అమెరికాలో ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించింది సినిమా యూనిట్. ఈ మేరకు సోమవారం దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ భవిష్యత్ పై వీళ్ళిద్దరూ చర్చించారు అని తెలుస్తోంది.

అటు రేవంత్ రెడ్డి నో చెప్పడంతో ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ద్వారా ఏపీ ప్రభుత్వాన్ని కూల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు దిల్ రాజు. అయితే ఈ భేటీకి ముందు రామ్ చరణ్ కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉందని న్యూస్ వైరల్ అయింది. కానీ దిల్ రాజు మాత్రమే పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. కేవలం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ను ఇన్వైట్ చేయడానికి మాత్రమే అని అందరూ భావించినా కానీ బెనిఫిట్ షోల విషయంలో… టికెట్ ధరల విషయంలో పవన్ కళ్యాణ్ ను ఏ విధంగా ఒప్పించాలి అనే దానిపైనే ఈ భేటీ జరిగింది. మెగా ఫ్యామిలీ సినిమా కాబట్టి ఏదో ఒక రకంగా పవన్ ఒప్పుకునే ఛాన్స్ ఉండవచ్చు.