ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం నెతన్యాహుకు ట్రంప్ ఇచ్చిన ఆఫరేంటి?

50 వేల మరణాలు.. లక్షా 13వేల మందికి గాయాలు.. లక్షల భవనాలు ధ్వంసం.. ఒక్కముక్కలో 90శాతం గాజా నామరూపాల్లేకుండాపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 24, 2025 | 03:50 PMLast Updated on: Mar 24, 2025 | 3:50 PM

Direct War Between Israel And Iran What Is Trumps Offer To Netanyahu

50 వేల మరణాలు.. లక్షా 13వేల మందికి గాయాలు.. లక్షల భవనాలు ధ్వంసం.. ఒక్కముక్కలో 90శాతం గాజా నామరూపాల్లేకుండాపోయింది. మిగిలిన 10శాతం గాజానూ నాశనం చేస్తోంది ఇజ్రాయెల్. ఇది మాత్రమే కాదు లెబనాన్‌పై మళ్లీ దాడులు మొదలుపెట్టింది. యెమెన్‌, సిరియాలో కూడా విధ్వంసం సృష్టిస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. పశ్చిమాసియాలో కథ మళ్లీ మొదటికొచ్చింది. సరిగ్గా ఇలాంటి టైం లోనే ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ సంచలన నిర్ణయం తాలూకు సెగలు మిడిల్‌తో పాటు ఇరాన్‌కూ తాకుతున్నాయి. ట్రంప్ నిర్ణయం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీసి నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంతకూ, గాజా, లెబనాన్, యెమెన్, సిరియాలో ఏక కాలంలో ఇజ్రాయెల్ ఎందుకు దాడులు చేస్తోంది? మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్‌ రెచ్చిపోయేలా ట్రంప్ ఇచ్చిన ఆ ఆదేశాలేంటి? వాటి ప్రభావం మధ్యప్రాచ్యంపై ఎలా ఉండబోతోంది? టాప్ స్టోరీలో చూద్దాం..

సీజ్‌ఫైర్ బ్రేక్ అయిన తర్వాత మిడిల్‌ఈస్ట్‌ కథ మళ్లీ మొదటికొచ్చింది. గాజాలో మరోసారి గ్రౌండ్ ఆపరేషన్ మొదలు పెట్టింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు కంటే పదిరెట్లు భీకరంగా ఆ ప్రాంతంపై విరుచుకుపడుతోంది. ఐడీఎఫ్ దాడులతో వందల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ క్రమంలోనే హమాస్‌ కమాండర్లలో మిగిలి ఉన్నవాళ్లూ ఎలిమినేట్ అవుతున్నారు. ఇటీవలే హమాస్ మిలి టరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌ ఒసామా తబష్‌ను ఎలిమినేట్ చేసింది. అతడు హమాస్ నిఘా, టార్గెటింగ్ యూని ట్లకు అధిపతిగా ఉన్నాడు. హమాస్ పోరాట వ్యూహాలు రూపొందించే బాధ్యత ఒసామా తబష్ చూసుకునే వాడట. దక్షిణ గాజాలో హమాస్ మిలిటరీ విభాగ ఇంటెలిజెన్స్‌ను సమన్వయం చేయడంతో పాటు అక్కడి హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు నాయకత్వం వహించేవాడని ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేకాదు, అక్టోబర్ 7 దాడికి సంబంధించిన ప్రణాళికలో తబష్ కీలక పాత్ర పోషించినట్టు తెలిపింది. 15 నెలల యుద్ధంలో ఎలాగో తప్పించుకున్న తబష్.. తాజా దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం చేతిలో హతమయ్యాడు.ఆ తర్వాత హ మాస్ రాజకీయ నాయకుడు సలాహ్ అల్-బర్దావీల్‌ను కూడా ఇజ్రాయెల్ ఆర్మీ ఎలిమినేట్ చేసింది. కట్‌చేస్తే.. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్స్ మరో మూడు దేశాలపై దాడులు షురూ చేశాయి.

లెబనాన్, సిరియా, యెమెన్.. గాజా తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది ఈ దేశాలనే. హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య 2024 నవంబర్‌లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. నాటి నుంచీ ఇజ్రాయెల్ లెబనాన్‌పై ఎటువంటి దాడులూ చేయలేదు. కానీ, గాజాలో ఎప్పుడైతే యాక్షన్ మార్చిందో ఆ వెంటనే లెబనాన్‌లో దాడులు మొదలుపెట్టింది. లెబనాన్‌ నుంచి ఆరు రాకెట్లు తమ భూభాగంలోకి దూసుకొచ్చా యని ఆరోపిస్తూ.. లెబనాన్‌లో భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో పదుల సంఖ్య లో ప్రాణాలు కోల్పోయారని లెబనాన్‌ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో హిజ్బుల్లా తాము రాకెట్లను ప్రయోగించలేదని వివరణ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.అయినా ఇజ్రాయెల్ దాడులు ఆపలేదు. మరోవైపు ఇజ్రాయెల్‌లోని బెన్‌గురియన్‌ ఎయిర్‌పోర్ట్ లక్ష్యంగా యెమెన్‌ నుంచి హౌతీలు క్షిపణిని ప్రయోగించారు. దీన్ని మధ్యలోనే అడ్డుకొని కూల్చివేశామని ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. యెమెన్‌లో ఆల్రెడీ అమెరికా దాడులు చేస్తోంది. ఈ పరిణామాల మధ్యే డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా తగలబడిపోయే ప్రకటన చేశారు.

గాజాలో మళ్లీ దాడులు చేయాలనే నిర్ణయం ఇజ్రాయెల్ సోలోగా తీసుకున్నది కాదు. దీనివెనుక చాలా పెద్ద కథే నడిచింది. నెతన్యాహు సర్కార్ గాజాలో మరోసారి విరుచుకుపడాలని నిర్ణయించుకున్న తర్వాత.. ట్రంప్ యంత్రాంగాన్ని సంప్రదించింది. ఎందుకంటే, అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ ఏ నిర్ణయం తీసుకోలేదు. అమెరికా ఓకే అంటే దాడిచేయాలి, వద్దంటే ఆగిపోవాలి. ఇప్పటివరకూ టెల్‌అవీవ్ సిట్యువేషన్ అదే. అప్పుడు ట్రంప్ పాలకవర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబట్టే.. ఇప్పుడు గాజాలో దాడులు చేస్తోం ది. ఇకపై ఇజ్రాయెల్‌కు ఆ అవసరం లేదు. ఎందుకంటే, గాజాలో దాడుల అంశంలో నిర్ణయం తీసుకునే పవర్స్ నెతన్యాహుకు ట్రంప్ ఇచ్చారు. అదిమాత్రమే కాదు.. ఇరాన్ దాని ప్రాక్సీ సంస్థలపైనా ఎప్పుడు ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలన్నా అమెరికాకు చెప్పాల్సిన అవసరం లేదు. 2020లో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సులేమానీని చంపమని ఆదేశించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు ఇజ్రాయెల్‌కు అలాంటి ఆదేశాన్ని ఇచ్చారు, ఇప్పటివరకు ఏ అమెరికన్ అధ్యక్షుడు కూడా అలా చేయడానికి ధైర్యం చేయలేదు. సో.. ఇక ఇజ్రాయెల్ ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నా తనకు తాను డిసైడ్ అయితే చాలు. ఈ పరిణామం మిడిల్ ఈస్ట్‌లో మరింత విధ్వంసానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక నుండి హౌతీలు కాల్చే ప్రతి బుల్లెట్ ఇరాన్ కాల్చినట్టుగా పరిగణించబడుతుంది’. ఇదీ నెతన్యాహుకి ఫుల్‌పవర్స్ ఇచ్చిన తర్వాత ట్రంప్ చేసిన కామెంట్. ఈ ఒక్క మాటే ట్రంప్ నిర్ణయానికి రీజన్ ఏంటో చెబుతుంది. ట్రంప్ ఆ మాట ఊరికే చెప్పలేదు. పశ్చిమాసియా దశాబ్దాలుగా యుద్ధభూమిగా మారడానికి కారణం ఇరానే. వివరంగా చెప్పాలంటే హమాస్, హిజ్బుల్లా, హౌతీ వంటి ఉగ్రవాద గ్రూపులకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తోంది ఇరానే. ఆ గ్రూపులకు నిధులు, ఆయుధాలు అందిస్తూ ఇజ్రాయెల్‌పై విరుచుకుపడేలా చేస్తోంది. అందుకే హౌతీలు కాల్చే ప్రతి బుల్లెట్‌కు ఇరాన్ బాధ్యత వహించాలని ట్రంప్ తేల్చి చెప్పారు. సో.. అల్టిమేట్‌గా ఇజ్రాయెల్‌ను ఇరాన్‌పైకే ట్రంప్ గురి పెడుతున్నారు అనుకోవచ్చు. అదే జరిగితే ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైనట్టే. పైగా ఈ వారంలోనే వాషింగ్టన్‌ వేదికగా ట్రంప్, నెతన్యాహు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ఇరాన్ అణు స్థావరాలపై దాడులు చేయడానికి కూడా ఇజ్రాయెల్‌కు అనుమతి ఇవ్వొచ్చన్న చర్చ జరుగుతోంది. సో.. మిడిల్ ఈస్ట్ యుద్ధం సరిహద్దులు దాటడానికి ఎంతో సమయం లేనట్టే..!