DK Shivakumar: తెలంగాణకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్.. గెలుపే లక్ష్యంగా తెలంగాణలో మకాం.. !
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో డీకే వ్యూహాలు కీలకంగా పని చేశాయి. అనేక సంస్కరణలు, పథకాల ద్వారా ఆయన అక్కడ కాంగ్రెస్‌ను అధికారంలోకి తేగలిగారు. అధికార బీఆర్ఎస్‌ను ఓడించగలిగారు. అందుకే డీకేకు అధిష్టానం తెలంగాణలో పార్టీని గెలిపించే బాధ్యతలు ఇచ్చింది.
DK Shivakumar: తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాస్త కష్టపడితే, అధికారం కాంగ్రెస్‌కు అధికారం దక్కే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. అందుకే, ఎలాగైనా ఇక్కడ గెలిచి అధికారం దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకే తెలంగాణకు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఎన్నికల బాధ్యతలు అప్పగించబోతుంది. ఇకపై డీకే ఎక్కువగా తెలంగాణపైనే ఫోకస్ చేస్తారు. ఎన్నికల వరకు ఎక్కువ రోజులు డీకే తెలంగాణలోనే ఉండబోతున్నారు. పార్టీని నడిపించబోతున్నారు. ఎన్నికల్లో అధికార కేసీఆర్‌ను గద్దె దించి, బీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష‌్యంగా డీకే పని చేస్తారు.
వ్యూహ రచనలో దిట్ట
కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో డీకే వ్యూహాలు కీలకంగా పని చేశాయి. అనేక సంస్కరణలు, పథకాల ద్వారా ఆయన అక్కడ కాంగ్రెస్‌ను అధికారంలోకి తేగలిగారు. అధికార బీఆర్ఎస్‌ను ఓడించగలిగారు. అందుకే డీకేకు అధిష్టానం తెలంగాణలో పార్టీని గెలిపించే బాధ్యతలు ఇచ్చింది. ఇప్పటికే ఆయన తన వ్యూహాల్ని సిద్ధం చేస్తున్నారు. వాటిని అమలు చేసేందుకు ఆయన కొద్ది రోజులపాటు హైదరాబాద్‌లోనే ఉంటారు. దాదాపు నెల రోజులు హైదరాబాద్‌లోనే ఉంటారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టడమే లక్ష్యంగా ఆయన పని చేయబోతున్నారు. ఇప్పటికే పలుసార్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నికల విషయంలో సహకారం అందించాల్సిందిగా రేవంత్.. డీకేను కోరారు. పార్టీ ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేయాలన్నారు. దీనికి అంగీకరించిన డీకే.. హైదరాబాద్‌లోనే ఉండి, తెలంగాణ ఏర్పాట్లు చూస్తానని, ఇక్కడ ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రేవంత్‌కు సూచించారు. ఇక్కడి ఏర్పాట్లు పూర్తయ్యాక డీకే తెలంగాణకు వస్తారు. హైదరాబాద్‌లో ఉంటూనే పార్టీని నడిపిస్తారు. అవసరమైతే పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు. సీట్ల ఎంపిక, పథకాల ప్రకటన, ప్రచార తీరు, ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా వ్యూహాలు రచించడం వంటివి చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తారు.
ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో మేనిఫెస్టో ప్రకటించబోతుంది కాంగ్రెస్. అలాగే అభ్యర్థుల ప్రకటనకు కూడా కసరత్తు చేస్తోంది. ఈ నెలలోనే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకపవనాలు వీస్తున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోగలిగితే.. తమకు విజయం తథ్యమని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.