Minister Mallaredd : మంత్రి మల్లారెడ్డి ఆస్తుల విలువ తెలుసా..?
తెలంగాణ మంత్రుల్లో వెరీ రిచ్ మినిస్టర్ ఎవరూ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మత్రి మల్లారెడ్డి. పాలమ్మి పూలమ్మి కష్టపడి పైకొచ్చిన ఆయన ఇప్పుడు కోట్లకు అధిపతి. రీసెంట్‌గా మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంగా మల్లారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తు వివరాలు వెల్లడించారు. పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలతో ఓ వెలుగు వెలుతున్న మల్లారెడ్డి ఆస్తులు కేవలం 90 కోట్లేనట..?
తెలంగాణ మంత్రుల్లో వెరీ రిచ్ మినిస్టర్ ఎవరూ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మత్రి మల్లారెడ్డి. పాలమ్మి పూలమ్మి కష్టపడి పైకొచ్చిన ఆయన ఇప్పుడు కోట్లకు అధిపతి. రీసెంట్‌గా మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సందర్భంగా మల్లారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తు వివరాలు వెల్లడించారు. పదుల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలతో ఓ వెలుగు వెలుతున్న మల్లారెడ్డి ఆస్తులు కేవలం 90 కోట్లేనట. తన ఆస్తులు 90 కోట్ల 24 లక్షల 08 వేల 741 రూపాయలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు మల్లారెడ్డి. ఇందులో ఆయన భార్య చామకూర కల్పనా రెడ్డి స్థిర ఆస్తుల విలువ 38 కోట్ల 69 లక్షల 25 వేల 565 రూపాయలు ఉన్నట్టు పేర్కొన్నారు.
సూరారం, దూలపల్లి, అలియాబాద్, జీడిమెట్ల, యాడారం, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ ప్రాంతాల్లో తనకు భూములు ఉన్నట్టు తెలిపారు మల్లారెడ్డి. ఇక వివిధ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు 7 కోట్ల 39 లక్షల 94 వేల 301 రూపాయలు కాగా.. ఇందులో ఆయన భార్య కల్పన పేరుతో ఉన్న అప్పులు 4 కోట్ల 48 లక్షల 95 వేల 98 రూపాయలుగా తెలిపారు. డిపాజిట్ల రూపంలో 5 కోట్ల 70 లక్షల 64 వేల 666 రూపాయలు ఉన్నాయని.. ఇందులో తన భార్యకు సంబంధించినవి 72 లక్షల 39 వేల 185 రూపాయలుగా తెలిపారు. ఒకప్పుడు లక్షల్లో కొన్న తన భూములకు ఇప్పుడు వందల కోట్లు రేట్లు ఉన్నాయని మల్లారెడ్డి చాలా సార్లు చెప్పారు. అలాంటి ఆయన ఇప్పుడు తన అఫిడవిట్‌లో తన ఆస్తులు కేవలం 90 కోట్టే అని చెప్పడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
ఇవన్నీ ఒక ఎత్తు ఐతే.. మంత్రి మల్లారెడ్డికి కార్లు లేకపోవడం ఇప్పుడు మరో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అఫిడవిట్‌లో తనకున్న కార్ల వివరాలను ఎక్కడా మెన్షన్ చేయలేదు మల్లారెడ్డి. అంటే తనకు కార్లు లేనట్టుగానే అధికారులు భావించాల్సి ఉంటుంది. దీంతో మల్లారెడ్డికి కనీసం కారు కూడా లేదా అనే విమర్శ ఇప్పుడు ప్రతీ ఒక్కరి నుంచీ వస్తోంది.