ఈవీఎంల్లో ఏ బ్యాటరీ వాడతారో తెలుసా…? చార్జ్ చేయకుండా ఎన్ని రోజులు పని చేస్తుందంటే
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలు ఏ విధంగా పని చేస్తాయి అనేది కేంద్ర ఎన్నికల కమీషనర్ స్వయంగా మీడియాకు వివరణ ఇచ్చారు.
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంల విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈవీఎంలు ఏ విధంగా పని చేస్తాయి అనేది కేంద్ర ఎన్నికల కమీషనర్ స్వయంగా మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎగ్జిట్ పోల్స్ పై సీఈసీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎగ్జిట్ పోల్స్ కు శాస్త్రీయత లేదన్నారు. ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనాలు మాత్రమే అని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ ప్రజలను గందరగోళ పరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగ్జిట్ పోల్స్ లో ఎన్నికల సంఘం ప్రమేయం ఉండదని తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ ప్రకటనలో స్వీయనియంత్రణ అవసరమన్న ఆయన ఎగ్జిట్‌పోల్స్ ఆధారంగా మాపై నిందలు అర్థరహితం అని మాట్లాడుతూ ఈవీఎంలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యం అని తేల్చేసారు. 6 నెలల ముందే ఈవీఎంలను పరిశీలిస్తామన్నారు. పార్టీల ఏజెంట్ల సమక్షంలోనే ఈవీఏంలు ఉపయోగిస్తామని తెలిపారు. పోలింగ్‌కు 5 రోజుల ముందే బ్యాటరీలు అమరుస్తాం అన్నారు.
5 నుంచి 7 రోజులు పని చేసే సింగిల్ యూజ్ బ్యాటరీని వాడతామని అన్నారు. ఇది కాలిక్యులేటర్ బ్యాటరీ లాంటిదని తెలిపారు. ముందు 99 శాతం ఛార్జ్ అయిన తర్వాత… వోల్టేజ్ వ్యత్యాసం ఆధారంగా కొన్ని సార్లు మారుతుందని… 5.8% చార్జింగ్ పడిపోయినప్పుడు ఒక సిగ్నల్ ఇస్తుందని వివరించారు. ఒకసారి వాడిన బ్యాటరీ మళ్ళీ వాడే ఛాన్స్ లేదని అన్నారు.