టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటే ఆ క్రేజ్ పిచ్చపిచ్చగా ఉంటుంది. అందుకే నందమూరి అభిమానులకు సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. దాదాపు 30 ఏళ్ల నుంచి సంక్రాంతిని టార్గెట్గా చేసుకుని బాలయ్య సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి కూడా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయినా సరే బాలయ్య సినిమాలకే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది ఈసారి కూడా సంక్రాంతి బరిలో నందమూరి మెగా కుటుంబాలు నిలిస్తే మెగా కుటుంబం ఇప్పటికే డల్ అయిపోయింది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవటంతో ఫ్యాన్స్ కాస్త డీల పడిపోయారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన డాకు మహారాజ్ ట్రైలర్ తో నందమూరి ఫ్యాన్స్ కు కొత్త జోష్ వచ్చింది. సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ఫాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ట్రైలర్ లో ఉన్న డైలాగులు చూస్తే బాలయ్య నట విశ్వరూపం ఖాయం అనే ధీమా ఫాన్స్ లో ఉంది. సినిమా ఎలా ఉన్నా సరే బాలయ్య డైలాగులు అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. ఈ సినిమాలో కూడా అదే రేంజిలో డైలాగులు ఉండే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో పొలిటికల్ యాంగిల్ కూడా ఉంటుంది. సర్కార్ సీతారామయ్య అనే రోల్ లో బాలయ్య నటిస్తున్నాడు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ ఉంటే ఒక రోల్ లో పొలిటికల్ యాంగిల్ ఉంటుంది ఇక పొలిటికల్ యాంగిల్ విషయంలో ఏపీలో జరుగుతున్న పరిణామాలను చూపించడానికి రెడీ అయ్యారట. జగన్ టార్గెట్ గా భారీ డైలాగులను ప్లాన్ చేశారు. గత ఐదేళ్ల నుంచి జరిగిన పరిణామాలను ఈ సినిమాలో చూపిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు సీన్ కూడా ఈ సినిమాలో ప్లాన్ చేశాడు డైరెక్టర్ బాబీ కొల్లి. బాలయ్య కోరిక మేరకు కొన్ని పవర్ఫుల్ సీన్స్ ను యాడ్ చేసారు మూవీ మేకర్స్. వాటిపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బాలయ్య గత సినిమాల్లో కూడా వైసిపి టార్గెట్ గా కొన్ని డైలాగులు పలికారు. ఇక ఈ సినిమాల్లో కూడా అదే రేంజిలో డైలాగులను ప్లాన్ చేశారు. ముఖ్యంగా జగన్ ను, సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ డైలాగులు పెట్టినట్టు టాక్. వైసిపి హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలతో పాటుగా రోడ్లు సహా అనేక సమస్యలను ఈ సినిమాలో చూపించడానికి ప్లాన్ చేసుకున్నారు. బాపట్లలో జరిగిన ఒక బాలుడి హత్యను కూడా ఈ సినిమాలో హైలెట్ చేస్తారట. మరి వైసీపీ టార్గెట్ గా బాలయ్య డైలాగులు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి. ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా యూనిట్ కూడా పండగ చేసుకుంటుంది. ఫస్ట్ ట్రైలర్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేకపోయినా రిలీజ్ ట్రైలర్ మాత్రం ఊపేస్తోంది.[embed]https://www.youtube.com/watch?v=e4HszjH5gDQ[/embed]