కవితకు ఆ గ్రహ దోషం ఉందా…? అందుకే కరుంగలి మాల…?
కరుంగలి మాల” సినీ రాజకీయ ప్రముఖుల మెడల్లో దర్శనమిస్తున్న మాల. ఈ మాల ధరిస్తే మంచి జరుగుతుందని భావించిన ప్రముఖులు, తమ కష్టాల నుంచి బయట పడేందుకు ఈ మాల ధరించడమే పరిష్కారం అని భావిస్తున్నారు.
కరుంగలి మాల” సినీ రాజకీయ ప్రముఖుల మెడల్లో దర్శనమిస్తున్న మాల. ఈ మాల ధరిస్తే మంచి జరుగుతుందని భావించిన ప్రముఖులు, తమ కష్టాల నుంచి బయట పడేందుకు ఈ మాల ధరించడమే పరిష్కారం అని భావిస్తున్నారు. ఇటీవల లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… హైదరాబాద్ విమానాశ్రయంలో ఈ మాల ధరించి కనిపించారు. ఈ మాలతోనే ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. అసలు ఏంటీ ఈ మాల ప్రత్యేకత అనేది ఇప్పుడు మళ్ళీ జనాల్లో చర్చ మొదలయింది.
జ్యోతిష్యుల వాదన ప్రకారం ఆధ్యాత్మిక, జ్యోతిష్య, వైద్యపరమైన ప్రాముఖ్యత ఉన్న వారే దీనిని ధరిస్తారట. ఈ మాలను కారుకలి అనే చెట్టు నుంచి తయారు చేస్తారు. ఆ చెట్టుకు కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. విద్యుదయస్కాంత వికిరణాలు, కంపనాలను ఆకర్షించే శక్తి ఆ చెట్టుకు ఉంటుంది. అందుకనే ఈ చెట్టుని ఆలయ గోపురాలు, ఆలయ విగ్రహాలు, స్టాల్స్, పాత ఇళ్ళల్లో తలుపులు వంటి చోట ఎక్కువగా వినియోగించేవారు. ఈ చెట్టు నలుపు రంగులో ఉంటుంది. ఇక జ్యోతిషశాస్త్రపరంగా చెప్పాలంటే నల్లరంగు అనేది అంగారక గ్రహానికి చెందిన రంగుగా చెప్తారు.
ఈ మాల ధరిస్తే ఎబోనీ మార్స్ ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుందని, నల్ల మచ్చతో తయారు చేసిన వాటిని ఉపయోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తక్కువగా ఉంటాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఈ కరుంగలి చెట్టుకి ఆయుర్వేద గుణాలు కూడా ఉండటం విశేషం. రేడియేషన్ ను స్వీకరించి నిల్వ చేస్తుందట. వేరు, బెరడును మధుమేహం, పెద్దప్రేగు రుగ్మతలు, రక్తహీనత సహా పలు వ్యాధులకు ఉపయోగిస్తారు. షుగర్ ఉన్న వాళ్ళు చెట్టు వేరుని నానబెట్టి ఆ నీళ్ళు తాగితే మంచిది అని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు.
కరుంగలి మాల విషయానికి వస్తే కరుంగలి మాలను ఏదైనా మంచి రోజున ధరించవచ్చు. మంగళవారం నాడు మురుగన్ ఆలయంలో కానీ, వారాహి మాత ఆలయంలో కానీ పూజ చేయించి ఆ తర్వాత ధరించాల్సి ఉంటుంది. దీనికి కులాలు, మతాలతో సంబంధం లేదు. పడుకునే ముందు దేవుడు దగ్గర పెట్టి లేచిన తర్వాత స్నానం చేసి మళ్ళీ ధరించాలి. అంగారక దోషం ఉన్న వాళ్ళు ఈ మాలను ధరిస్తే మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. విద్యార్థులు జ్ఞాపకశక్తి అలాగే మేధో శక్తిని మెరుగుపరుచుకోవడానికి ఈ మాల ధరిస్తారట. ఇప్పుడు ఈ మాల ఫేక్ దొరుకుతుంది. క్రేజ్ ఉండటంతో ప్రజలు ఎక్కువగా కొంటున్నారు. కాని తమిళనాడులోని పాతాశ శంభు మురుగన్ ఆలయం దగ్గర ఒరిజినల్ దొరుకుతుందని జ్యోతిష్యులు అంటున్నారు.