వెంటాడి వేటాడి పంపిస్తున్నాడు… ట్రంప్ అంటేనే వణుకుపోతున్న తెలుగు విద్యార్థులు..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు...భారతీయ విద్యార్థులు వణికిపోతున్నారు. అందులోనూ తెలుగు విద్యార్థులకు...అమెరికాలో కొత్త కష్టాలు షురూ అయ్యాయి. చదువుకునేందుకు వెళ్లి...పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్న వారికి కంటి మీద కునుకు పట్టడం లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2025 | 03:54 PMLast Updated on: Jan 30, 2025 | 3:54 PM

Donald Trump Has Given A Warning To Students Who Have Come To Study In Universities

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు…భారతీయ విద్యార్థులు వణికిపోతున్నారు. అందులోనూ తెలుగు విద్యార్థులకు…అమెరికాలో కొత్త కష్టాలు షురూ అయ్యాయి. చదువుకునేందుకు వెళ్లి…పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్న వారికి కంటి మీద కునుకు పట్టడం లేదు. తెలుగు విద్యార్థులంతా పార్ట్ టైమ్ ఉద్యోగాలకు మంగళం పాడేస్తున్నారు. మేం రాం బాబోయ్ అంటూ సంస్థలకు చెప్పేస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్…బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. తగ్గేదే లేదు అన్నట్లు దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అక్రమ వలసదారులకు బేడీలు వేసి..వారి సొంత దేశాలకు విమానాల్లో పంపించేస్తున్నారు. ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా…తాను చేయాల్సింది చేసి చూపిస్తున్నారు. దారిలోకి రాని దేశాలను…సుంకాల పేరుతో కంట్రోల్ చేస్తున్నారు. ఇండియా నుంచి 3 లక్షల మంది విద్యార్థులకుపైగా అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వేల మంది స్టూడెంట్స్ అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా ఒక వైపు చదువుకుంటూనే…ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. గ్యాస్‌ స్టేషన్లు, సూపర్‌ మార్కెట్లు, రెస్టారెంట్లలో పార్ట్‌ టైం ఉద్యోగాల్లో ఉన్నారు.

అమెరికా వెళ్లిన తెలుగు స్టూడెంట్స్ పై ట్రంప్ ఎఫెక్ట్ పడింది. ఇన్నాళ్లు పార్ట్ టైమ్ జాబ్ చేసి…అమెరికా నుంచి ఎంతో కొంత ఇండియాకు కొంత డబ్బు పంపేవారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఇంటి నుంచే ఎంతో కొంత పంపించండి అంటూ పేరెంట్స్ కు ఫోన్ చేస్తున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే.. రూల్స్ కఠినంగా అమలు చేస్తున్నారు. దేవంలో ఇల్లీగల్ గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అమెరికా గడ్డ నుంచి తరిమేస్తామనివార్నింగ్ ఇవ్వటంతో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ పరిస్థితి గందరగోళంలో పడింది. తెలుగు రాష్ట్రాల నుంచి చదువుల కోసం F1 వీసాపై వెళ్లే వారిలో 90 శాతం మంది ఇటు చదువుకుంటూ.. అటు అనధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కఠినమైన ఆదేశాలతో తెలుగు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్నారు. ఒక వేళ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోతే.. డిగ్రీ క్యాన్సిల్ చేయటమే కాకుండా ఇండియాకు తిరిగి పంపించే అవకాశం ఉంది.

యూనివర్సిటీల్లో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు డోనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. స్టడీస్ కోసం వచ్చిన వాళ్లు…పార్ట్‌ టైం జాబ్స్‌ చేస్తూ…పట్టుబడితే వీసా రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో భారతీయ విద్యార్థులు, అందులోనూ తెలుగు స్టూడెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పులు చేసి…బ్యాంక్ లోన్ తీసుకొని…చాలా మంది అమెరికాకు వెళ్లారు. బ్యాంక్ లోన్ వచ్చిన డబ్బును ఫీజులకు చెల్లించి…ఖర్చుల కోసం పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఉలిక్కిపడుతున్నారు. ట్రంప్ వార్నింగ్ తో చాలా మంది తెలుగు విద్యార్థులు ఉద్యోగాలు మానేస్తున్నారు. పార్ట్‌ టైం జాబ్‌ చేయకుండా చదువుకు అయ్యే ఖర్చులెలా సమకూర్చుకోవాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. చదువు మధ్యలో ఆపేసి స్వదేశానికి తిరిగి రాలేక తలలు పట్టుకుంటున్నారు.

అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికంగా ఉన్నట్లు ఓపెన్ డోర్స్​ నివేదిక ద్వారా వెల్లడైంది. అమెరికాలో 2023-24 విద్యా సంవత్సరంలో ఏకంగా 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. గత 15 ఏళ్లలో ఇదే అత్యధికమని ఓపెన్ డోర్స్ సంస్థ నివేదిక తెలిపింది. 2022-23 అమెరికాకు వెళ్లి చదువుకున్న విదేశీ విద్యార్థుల్లో చైనా స్టూడెంట్స్ ఎక్కువగా​ ఉండేవారు. తరువాతి స్థానంలో భారతీయ విద్యార్థులు ఉన్నారు. కానీ 2023-24 విద్యా సంవత్సరంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2023-24 విద్యా సంవత్సరంలో యూఎస్​లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 3,31,602కు పెరిగింది. 2022-23 విద్యా సంవత్సరంతో పోలిస్తే ఇది 23 శాతం ఎక్కువ. అమెరికాకు అత్యధిక సంఖ్యలో మాస్టర్స్​, పీహెచ్​డీ స్థాయి విద్యార్థులను పంపిన దేశంగానూ భారత్ నిలిచింది. గతేడాదితో పోల్చితే ఇండియన్ గ్రాడ్యుయేట్స్​ సంఖ్య 19 శాతం పెరిగి… 1,96,567కు చేరింది.

ఓపెన్‌ డోర్స్‌ నివేదిక ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్ధులు ఉన్నారు. వీరి సంఖ్య ఏటా 35 శాతం పెరుగుతోంది. అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్‌ స్టేషన్లు, సూపర్‌ మార్కెట్లు, రెస్టారెంట్లలో పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చేస్తున్నారు. వీరికి సగటున గంటకు 10 డాలర్ల వరకూ చెల్లిస్తారు. మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ చేస్తున్న విద్యార్ధి…వారానికి 20 గంటలు పాటు పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.70 వేల వరకూ సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. ప్రస్తుతం ఒక సింగిల్‌ బెడ్‌రూమ్‌ అద్దెకు తీసుకోవాలంటే 1,7వందల డాలర్లుపైనే చెల్లించాలి. అది మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే…దాదాపు రెండు లక్షలు. దీనికి మెయింటెనెన్స్‌ ఖర్చులు అదనం. ఒక విద్యార్ధి నెలంతా పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. ఇలాంటి పరిస్థుతుల్లో పార్ట్ టైమ్ జాబ్ చేయడం కుదరదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అనధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోయినా.. ఎవరైనా కంప్లయింట్ చేసినా.. అసలుకే మోసం వస్తుంది. దీంతో చాలా మంది పార్ట్ టైం ఉద్యోగాలను వదిలేసుకుంటున్నారు తెలుగు స్టూడెంట్స్.