గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ట్రంప్

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ముఖ్యంగా తెలుగు స్టూడెంట్స్ ట్రంప్ పేరు చెప్తే వనికి పోతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో... తమను ఎప్పుడు అమెరికన్ నుంచి పంపించేస్తారో నన్నే ఆందోళనలో ఉన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 25, 2025 | 01:55 PMLast Updated on: Jan 25, 2025 | 1:55 PM

Donald Trump Taking Sensational Decisions

అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు ముఖ్యంగా తెలుగు స్టూడెంట్స్ ట్రంప్ పేరు చెప్తే వనికి పోతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో… తమను ఎప్పుడు అమెరికన్ నుంచి పంపించేస్తారో నన్నే ఆందోళనలో ఉన్నారు. ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి
ఓ పి టి పై ఉన్న వాళ్లు, ఓ పి టి పూర్తయిపోయినా రకరకాల చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు….. ఇప్పుడు అమెరికా వదిలి రాక తప్పనిసరి పరిస్థితి. అంతేకాదు ఒకపక్క చదువుతూ మరోపక్క నానా రకాలు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ వందలు డాలర్లు సంపాదిస్తున్న వాళ్లను కూడా వేటాడే పనిలో ఉంది ట్రంప్ సర్కార్.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు భారతీయ విద్యార్థులకు దడ పుట్టిస్తున్నారు. ఇప్పుడు భారతీయ స్టూడెంట్స్ కు డీపొర్టేషన్ ఫియర్ పట్టుకుంది. ఇప్పటి వరకు కాలేజీ అయిపోయిన తర్వాత కాస్తో కూస్తో సంపాదన కోసం వారంతా పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. తద్వారా వచ్చిన డబ్బుతో అక్కడ నెలవారీ ఖర్చులు చెల్లించుకుంటున్నారు. కొంత మంది అయితే ఇండియాలో భారీగా అప్పులు చేసి అమెరికా యూనివర్శిటీల్లో సీటు సంపాదించుకున్న పరిస్థితి ఉంది. దీంతో ఆ అప్పులను తీర్చేందుకు పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ అమెరికాలోని వలస విద్యార్థులకు ఇచ్చే F-1 వీసాపై కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు.
F-1 వీసా నిబంధనల ప్రకారం ఏ విద్యార్థి అయినా వారానికి కేవలం 20 గంటలు మాత్రమే పని చేయాలి. అంత కంటే ఎక్కువ పని గంటలు పని చేస్తే వారిని తిరిగి స్వదేశానికి పంపిస్తారు.

ఐతే భారతీయ విద్యార్థులు కాలేజీ అయిపోయిన తర్వాత వివిధ రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, రిటైల్ స్టోర్లలో పని చేస్తున్నారు. కొంత మంది తమ ఖర్చులను తీర్చుకునేందుకు కాలేజీలకు సెలవులు ఉన్న రోజులను కూడా వాడుకుంటున్నారు. రెస్టారెంట్లలో పని చేయడం ద్వారా గంటకు 7 డాలర్లు సంపాదిస్తున్నట్లు ఇండియన్ స్టూడెంట్స్ చెబుతున్నారు. ఇలా తాము రోజుకు 6 గంటల చొప్పున పని చేస్తూ.. దాదాపు 42 డాలర్లు సంపాదిస్తామంటున్నారు. వారానికి 20 గంటల నిబంధన వల్ల తమకు ఇబ్బంది కలుగుతుందని వారు చెబుతున్నారు. ఐతే రూల్స్ కఠినతరంగా అమలు చేయడం వల్ల తాము తిరిగి స్వదేశానికి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే తమ జీవితం తలకిందులయ్యే ప్రమాదం ఉందని చేస్తున్నారు ఇండియన్ స్టూడెంట్స్.