అల్లు అర్జున్ గురించి మీరు మాట్లాడొద్దు… షాక్ ఇచ్చిన జగన్
సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను సమాజం ఒక దోషగా చూడటం మొదలుపెట్టింది. గత శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగం తర్వాత ఈ ఘటనలో అల్లు అర్జున్ ది కచ్చితంగా తప్పుంది అనే అభిప్రాయానికి సామాన్య ప్రజలు కూడా వచ్చేసారు.
సంధ్య థియేటర్ ఘటన విషయంలో అల్లు అర్జున్ ను సమాజం ఒక దోషగా చూడటం మొదలుపెట్టింది. గత శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగం తర్వాత ఈ ఘటనలో అల్లు అర్జున్ ది కచ్చితంగా తప్పుంది అనే అభిప్రాయానికి సామాన్య ప్రజలు కూడా వచ్చేసారు. ఆ తర్వాత బయటకు వచ్చిన వీడియోలు అలాగే పోలీసులు చేసిన కామెంట్స్ అన్నీ కూడా కాస్త సంచలనంగానే మారుతూ వచ్చాయి. అల్లు అర్జున్ ను పోలీసులు ఊరికే ఈ కేసులో లాగలేదు అనే అభిప్రాయానికి ఆయన అభిమానులు కూడా వచ్చేశారు.
దీనితో సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ కు పెద్దగా ఆయన ఫ్యాన్స్ నుంచి స్పందన కరువైంది. ఇదే టైంలో వైసిపి సోషల్ మీడియా అల్లు అర్జున్ కు పెద్దగా సపోర్ట్ కూడా చేసే ప్రయత్నం చేయడం లేదు. వాస్తవానికి అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలీ నుంచి బయటకు తీసుకురావాలని వైసిపి చాలా కష్టపడింది. అందుకే పుష్ప సినిమా విషయంలో వైసీపీ నేతలు చాలా వరకు ప్రమోషన్స్ చేశారు. చాలామంది వైసిపి నాయకులు దీనిపై బహిరంగంగానే కామెంట్ చేయడమే కాకుండా ఏకంగా వైసిపి అనుకూల మీడియాలో డిబేట్ లు కూడా పెట్టి పుష్ప సినిమాకు ప్రమోషన్స్ చేయడం హాట్ టాపిక్ అయింది.
అలాగే రాయలసీమ ప్రాంతంలో పెద్ద ఎత్తున బ్యానర్లు కూడా పెట్టారు వైసీపీ నేతలు. అయితే అల్లు అర్జున్ టార్గెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో వైసిపి పెద్దగా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. ప్రతి అంశాన్ని అల్లు అర్జున్ విషయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సపోర్ట్ చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా ఈ విషయంలో ఎటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో చేయకపోవడం గమనార్హం. పుష్ప 2 సినిమా టైంలో అల్లు అర్జున్ వైసీపీ సపోర్ట్ చేసింది.
అదే టైంలో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో చిరంజీవి ఇంటికి అలాగే నాగబాబు ఇంటికి అల్లు అర్జున్ వెళ్లి కొన్ని ఫోటోలు దిగి వచ్చాడు. చాలా రోజుల తర్వాత చిరంజీవితో అల్లు అర్జున్ కలిసిన ఫోటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారం లో వైసీపీ స్పందించలేదని తెలుస్తోంది. తమ పార్టీ నేతలకు కూడా జగన్ ఇదే ఆదేశాలు ఇచ్చారు. ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని స్పష్టత ఇచ్చారు. అందుకే వైసీపీ సైలెంట్ అయిపూయింది. ఎప్పటికైనా మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనే అభిప్రాయానికి వైసీపీ కార్యకర్తలు అలాగే వైసిపి నాయకత్వం వచ్చినట్లుగా క్లియర్ పిక్చర్ వస్తోంది. వైసీపీ రాజ్యసభ ఎంపీ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కు సపోర్ట్ చేశాడు. హైకోర్టులో అల్లు అర్జున్ కేసు వాదించింది కూడా ఆయనే. అలాగే వైసిపి న్యాయవిభాగం కూడా అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలబడింది. కానీ ఈ పరిణామాలు వాళ్లకు నచ్చకపోవడం మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ మరింత దగ్గర అయ్యే పరిస్థితి ఉండటంతో వైసీపీ సైడ్ అయిపోయింది.