బ్రేకింగ్: డీఎస్సీ ఫలితాలు రిలీజ్, త్వరలోనే మరో గుడ్ న్యూస్
డీఎస్సీ-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసారు. 11062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు ఫలితాలు విడుదల చేసారన్నారు.
డీఎస్సీ-2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేసారు. 11062 టీచర్ ఉద్యోగాల భర్తీకి విశేష కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. 1:3 ప్రాతిపదికన ఫలితాలు ఫలితాలు విడుదల చేసారన్నారు. దసరా లోపు ఫైనల్ నియామకాలు పూర్తి చేస్తాం అని తెలిపారు సిఎం. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది అని గుర్తు చేసిన ఆయన… పదేళ్లలో వాళ్లు చేపట్టిన ఉపాధ్యాయ నియామకాలు కేవలం 7,857 మాత్రమేనన్నారు.
విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. మేం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ మొదలు పెట్టామన్నారు. విద్యకు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేసారు. నిర్వహణ నుంచి నియామకాల వరకు 65 రోజుల్లో 11062 ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తున్నామని వివరించారు. ఇది విద్యపై మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది అని స్పష్టం చేసారు. తెలంగాణలో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష అన్నారు సిఎం.
అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30వేల ఉద్యోగాల నియామక పత్రాలు అందించామని నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని టెట్ నిర్వహణ తర్వాతే డీఎస్సీ నిర్వహించాని పేర్కొన్నారు. టీజీపీస్సీని ప్రక్షాళన చేసామన్నారు. త్వరలోనే గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించి తెలంగాణ పునర్నిర్మాణంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. మొదటి ఏడాదిలోనే 60వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు.