DUPLICATE VOTERS : డూప్లికేట్, డబుల్ ఓటుంటే జైలుకే ..! ఎన్నికల కమిషన్ స్ట్రాంగ్ వార్నింగ్..

ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు.. దాంతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైమ్ లో డూప్లికేట్, డబుల్ ఓట్ల వ్యవహారం వివాదస్పదంగా మారింది. వైసీపీ, టీడీపీ పరస్పరం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో.. ఈసీ సీరియస్ గా స్పందించింది. డూప్లికేట్, డబుల్ ఓట్లు ఉంటే కేసులు పెడతామనీ.. అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 9, 2023 | 04:21 PMLast Updated on: Dec 09, 2023 | 4:21 PM

Duplicate Double Vote To Jail Election Commission Strong Warning

ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు.. దాంతో పాటు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైమ్ లో డూప్లికేట్, డబుల్ ఓట్ల వ్యవహారం వివాదస్పదంగా మారింది. వైసీపీ, టీడీపీ పరస్పరం ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో.. ఈసీ సీరియస్ గా స్పందించింది. డూప్లికేట్, డబుల్ ఓట్లు ఉంటే కేసులు పెడతామనీ.. అవసరమైతే జైలుకు పంపుతామని హెచ్చరించింది.

CM Revanth : సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం.. కేసీఆర్‌ టీం మొత్తం అవుట్‌..

ఆంధ్రప్రదేశ్ కు చెందిన సీమాంధ్రులు కొందరు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో స్థిరపడ్డారు. వాళ్ళు నివసిస్తున్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. ఇది కాకుండా.. ఆంధ్రప్రదేశ్ లో సొంత గ్రామాల్లోనూ ఓటర్లుగా నమోదై ఉన్నారు. కానీ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం దేశంలో ఒక వ్యక్తికి ఒకే రాష్ట్రం, ఒకే నియోజకవర్గంలో ఓటు ఉండాలి. ఓ వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓట్లు ఉండటం నిబంధనలకు విరుద్ధం. ఫామ్ 6 ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకునేటప్పుడు ఆ ఫామ్ లో.. తమకు వేరే చోట్ల ఉంది.. దాన్ని తొలగించమని అప్లికేషన్ లో మెన్షన్ చేయాలి. ఇల్లు మారేవాళ్ళయితే ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ తప్పుగా ఇచ్చిన వ్యక్తులపై.. వివరాలు అందించిన వారిపై కేసులు పెట్టి.. జైలుకు పంపే అధికారం ఎన్నికల కమిషన్ కు ఉంటుంది.

ఏపీలో ఈ డబుల్ ఓట్లు, డూప్లికేట్ వ్యవహారాన్ని మొదట వైసీపీ నాయకులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఏపీలో ఓట్లున్న వారికి ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నాయంటూ ఈసీకి కంప్లయింట్ చేయడంతో బయటపడింది. 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారు అధికారులు. అందుకే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఓటు మార్పు, డబుల్, డూప్లికేట్ ఓటు ఉంటే రద్దు చేసుకోడానికి ఓటర్లకు గడువు కూడా ఇచ్చింది ఈసీ. ఆ టైమ్ ముగిసింది. జనవరి 5 నాడు ఫైనల్ ఓటర్ లిస్టును ఈసీ ప్రకటించబోతోంది.

ఏపీలో ఈ డబుల్ ఓట్ల వ్యవహారం ఇప్పుడు మరో టర్న్ తీసుకుంటోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కొత్త పంచాయతీ నడుస్తోంది. ఫామ్ 7 వినియోగిస్తూ.. ఓటర్ అనుమతి లేకుండానే ఓట్లను తొలగిస్తున్నాయంటూ.. రెండు పార్టీలు పరస్పరం ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాయి. తెలంగాణలో ఓట్లేసిన వారు ఇక్కడ వేయనీయవద్దని వైసీపీ అంటుంటే… తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ రెండు పార్టీల ఫిర్యాదులతో కేంద్ర ఎన్నికల సంఘం.. ఈ వ్యవహారాన్ని పరిష్కరించడానికి సీనియర్ ఐపీఎస్ అధికారులను జిల్లాల వారీగా పరిశీలకులుగా నియమించింది. డూప్లికేట్, డబుల్ ఓట్లు ఉన్నవారు మాత్రం స్వచ్ఛంధంగా తమ పేరు తొలగింపు కోసం అప్లయ్ చేయాలని ఈసీ కోరుతోంది. రెండు ఓట్లు ఉంటే మాత్రం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. ఎన్నికలకు నాలుగు నెలల ముందే వైసీపీ, టీడీపీ మధ్య యుద్ధం తీవ్రస్థాయిలో ఉంది. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటోందో అని ఏపీ చర్చ జరుగుతోంది.