AP VOTES DISPUTE: డబుల్ ఓట్లు.. ఆంధ్రలో తెలంగాణ ఓట్ల పంచాయతీ
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీమాంధ్రులు ఎప్పుడో హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు. అయితే ఏపీలోనూ వాళ్ళకు ఇళ్ళు, ఆస్తులు ఉండటంతో.. సొంతూళ్ళతో పాటు హైదరాబాద్‌లోనూ ఓటర్లుగా కంటిన్యూ అవుతున్నారు. అలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు.
AP VOTES DISPUTE: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హడావిడి మొదలైంది. అయితే అక్కడ ఇప్పుడు తెలంగాణ ఓటర్ల మీద పంచాయతీ నడుస్తోంది. డూప్లికేట్ ఓట్లు తొలగించాలంటూ అధికార వైసీపీ, టీడీపీ లీడర్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. తెలంగాణలో, ఏపీలో ఓట్లు ఉన్న వాళ్ళు 4 లక్షల మందికి పైగా ఉన్నారనీ.. వాళ్ళని తొలగించాలని వైసీపీ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీమాంధ్రులు ఎప్పుడో హైదరాబాద్‌లో సెటిల్ అయ్యారు.
REVANTH REDDY: ఈ ఇద్దరితో చిక్కులేనా..? రేవంత్‌కు చిక్కులు తప్పవా..?
అయితే ఏపీలోనూ వాళ్ళకు ఇళ్ళు, ఆస్తులు ఉండటంతో.. సొంతూళ్ళతో పాటు హైదరాబాద్‌లోనూ ఓటర్లుగా కంటిన్యూ అవుతున్నారు. అలాంటి డూప్లికేట్ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ మంత్రులు. ఏపీ, హైదరాబాద్‌లో రెండు చోట్లా 4 లక్షల 30 వేల మంది దాకా ఓటర్లు ఉన్నట్టు ఏపీ సీఈవో మీనాకు మంత్రులు జోగి రమేశ్, వేణుగోపాల్ ఫిర్యాదు చేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. అందుక్కారణం సిటీ ఓటర్లకు బద్దకం.. అందుకే ఓట్లు వేయలేదు అనుకున్నారు. కానీ భాగ్యనగర ఓటర్లలో సీమాంధ్రులు కూడా ఉన్నారు. వాళ్ళకి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓట్లు ఉన్నాయి. అందుకే కొంతమంది ఇక్కడ ఓట్లు వేయలేదని తెలుస్తోంది. అయితే దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఒక చోట ఓటు ఉంటే.. మరో దగ్గర ఉండటానికి వీల్లేదు. దాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత అధికారులది. కానీ వాళ్ళ నిర్లక్ష్యంతోనే రెండు చోట్ల ఓట్లు కొనసాగుతున్నాయనేది పొలిటికల్ లీడర్ల ఆరోపణ.
నాలుగు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల డబుల్ ఎంట్రీ ఓట్లుపై ఏపీ మంత్రులు అభ్యంతరం చెబుతున్నారు. హైదరాబాద్ , ఏపీలో ఉన్న 4 లక్షల 30 వేల మంది ఓటర్లకు సంబంధించి ఆధారాలతో సహా ఈసీకి కంప్లయింట్ చేశామంటున్నారు వైసీపీ మంత్రులు. ఒక సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఏపీ జాబితాలో కూడా చేర్చేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్, కూకట్‌పల్లి ఏరియాలో టీడీపీ లీడర్లు ప్రత్యేక క్యాంపులు పెట్టి.. సీమాంధ్ర ఓటర్ల నుంచి అప్లికేషన్లు సేకరించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకి వ్యవస్థలను మెయింటైన్ చేయడం అలవాటైందనీ.. డూప్లికేట్ ఓటర్ల ఎంట్రీని ప్రోత్సహిస్తూ.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి ఈసీకి ఏమని కంప్లయింట్ ఇస్తారని వైసీపీ మంత్రులు ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి తెలంగాణ ఓటర్లపై ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ హాట్ హాట్‌గా నడుస్తోంది. ఇలాంటి డూప్లికేట్ ఓట్లు రాకుండా ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈసీకి ఆదేశాలు కూడా ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు అభ్యంతరంతో ఆధార్ లింకేజ్‌ని స్వచ్ఛంధంగా చేసుకోవచ్చని ఈసీ తెలిపింది. మరి ఇప్పుడు వైసీపీ, టీడీపీ మధ్య పంచాయతీకి కారణమైన డూప్లికేట్ ఓటర్లను గుర్తించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుందన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది.