ధైర్యంగా బయటకు వచ్చిన దువ్వాడ…!

కూటమి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో పాలన రావణ కాష్టం అవుతుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఎప్పుడు లేనoతగా రౌడీయిజం, దౌర్జన్యం జరుగుతుందని ఆరోపించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 6, 2024 | 06:47 PMLast Updated on: Nov 06, 2024 | 6:47 PM

Duvvada Srinivas Comments On Ap Govt

కూటమి పాలనపై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో పాలన రావణ కాష్టం అవుతుందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఎప్పుడు లేనoతగా రౌడీయిజం, దౌర్జన్యం జరుగుతుందని ఆరోపించారు. హత్యలు, అత్యాచారాలు వైసీపీ వాళ్లపై తప్పుడు కేసులు, సంక్షేమ పథకాలు తొలగించటం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేసారు.

ఈ ఐదు నెలల్లో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందన్నారు దువ్వాడ. వందల మంది మహిళలు మిస్ అయిపోయారు అని పట్టించుకునే నాథుడే లేరన్నారు. ప్రతిపక్ష నేతగా ఈ మాటలు నేను చెప్పటమే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఇదే చెబుతున్నారని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది… హోమ్ మినిస్టర్ తన విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదని.. పవన్ కళ్యాణ్ చెప్పాడన్నారు. చంద్రబాబు పాలనలో దుర్మార్గాన్ని, దౌర్భాగ్యాన్ని డిప్యూటీ సిఎం గా ఉన్న పవన్ కల్యాణే చెప్పాడని మేము మాట్లాడితే మా గొంతు నొక్కేస్తారు అని ఫైర్ అయ్యారు దువ్వాడ.