గారు పాయే, శ్రీను మిగిలే, ఇంటి రిజిస్ట్రేషన్ తో మాధురీలో మార్పు

టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం కొనసాగుతోంది. శనివారం రాత్రి టెక్కలి, అక్కవరంలోని కొత్త ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిచ్చెన వేసి ఫస్ట్ ఫ్లోర్ లోని నివాసంలోకి వెళ్లేందుకు యత్నించిన వాణి, ఆమె కుమార్తెలను మాధురీ అడ్డుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 8, 2024 | 07:00 PMLast Updated on: Sep 08, 2024 | 7:00 PM

Duvvada Srinivas Family Issue In Tekkali

టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం కొనసాగుతోంది. శనివారం రాత్రి టెక్కలి, అక్కవరంలోని కొత్త ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిచ్చెన వేసి ఫస్ట్ ఫ్లోర్ లోని నివాసంలోకి వెళ్లేందుకు యత్నించిన వాణి, ఆమె కుమార్తెలను మాధురీ అడ్డుకున్నారు. పై నుంచి నిచ్చేనను నెట్టేసిన మాధురి… పైకి రానివ్వను అంటూ బూతులు తిట్టారు. ఆ తర్వాత కేకలు వేసుకుంటూ బూతులు తిట్టుకున్నారు వాణి,మాధురి. ఆ తర్వాత అర్దరాత్రి కొత్త ఇంటి నుంచి వెంకటేశ్వర కాలనిలోని ఇంటికి వాణి, ఇద్దరు కుమార్తెలు వెళ్లిపోయారు.

ఇక్కడ ఎవరూ ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటోన్న కొత్త ఇంటిలోకి వెళ్లవచ్ఛంటూ వాణికి గురువారం కోర్టు ఉత్తర్వులు ఇవ్వగా శుక్రవారం కొత్త ఇంటిని మాధురి పేరిట రిజిస్ట్రేషన్ చేసి ట్విస్ట్ ఇచ్చారు ఎమ్మెల్సీ శ్రీనివాస్. శుక్రవారం నుంచి అక్కవరం లోని కొత్తఇంటిలో మాధురి ఉండటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులు నేపథ్యంలోనే శ్రీనివాస్ మాధురీ పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేసారని వాణి మండిపడుతున్నారు. తిరిగి కోర్టును ఆశ్రయించేందుకు వాణి సిద్ధమయ్యారు.

అయితే ఇక్కడ సోషల్ మీడియాలో పలువురు మాధురి వైఖరిపై ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ… దువ్వాడ శ్రీనివాస్‌ను శ్రీను ఆనడం చూసి షాక్ అవుతున్నారు. గతంలో శ్రీను గారు అంటూ మాట్లాడిన ఆమె ఇల్లు రాసిచ్చిన తర్వాత శ్రీను అంటోందని… ఆస్తి కోసమే ఆయనతో ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. అలాగే తన ఇంటికి వాణీ, శ్రీను, వాళ్ళ కూతుళ్ళు వచ్చారంటూ ఆమె కామెంట్స్ చేయడం చూసి అందరూ కంగుతిన్నారు. దువ్వాడను చూస్తే జాలేస్తుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు.