నీ రీల్స్ నా కొంప ముంచాయి, మాధురిపై దువ్వాడ ఫైర్

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 18, 2024 | 03:33 PMLast Updated on: Aug 18, 2024 | 3:33 PM

Duvvada Srinivas Fire On Divvala Madhuri

“దేనికైనా ఒక హద్దు ఉంటుంది మధు… ఒకవైపు వాణి… మరోవైపు నా కూతురు హై౦దవి ఇంట్లోకి వస్తాం అని గొడవ చేస్తున్నారు, నీ మీద నా మీద సానుభూతి కంటే జనాల్లో కోపం ఎక్కువగా ఉంది. మధ్యవర్తులు చేసే ప్రయత్నాలు నీకు తెలుసు. నువ్వు ఇలా వరుసగా రీల్స్ పోస్ట్ చేస్తుంటే గొడవ ఇంకా పెరుగుతుంది కదా…? ఇన్స్టాగ్రాం కొన్ని రోజులు ఆపితే ఏమైనా అవుతుందా చెప్పు… నా మాట విను నాన్న. వాళ్ళను ఎందుకు అలా రేచ్చగోడుతున్నావ్…? మనం కలిసి ఉండాలంటే గొడవ పెంచుకోవడం మంచిదా…?”

అంటూ దువ్వాడ శ్రీనివాస్… దివ్వెల మాధురిపై ప్రేమగా సీరియస్ అయ్యారట. ఇప్పుడు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతుంది. నీ రీల్స్ చూసి… నా ఆస్తిని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావనే వాళ్లకు కోపం వచ్చింది అంటూ మాధురిపై ప్రేమగా కోప్పడ్డారట శ్రీను గారు. ఈ భూమి మీద నేను ఉండాలనుకోవట్లేదు అని స్కోడా కారు వేసుకెళ్ళి ప్రాణం తీసుకోవాలనుకున్న మాధురి… ఆ తర్వాత రోజు నుంచి యావరేజ్ న రెండు రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇందులో భరత నాట్యం రీల్ బోనస్.

ఇక వరలక్ష్మీ వృతం సందర్భంగా మేడం గారు… భారీ ఎత్తున నగలు ధరించి ఒక ఫోటో పోస్ట్ చేసారు. ఆ ఫోటో బాగానే వైరల్ అయింది కూడా. కచ్చితంగా ఆ హారం, వడ్డానం, నెక్లెస్, పాపిడి బిళ్ళ అన్నీ శ్రీను గారే కొని ఉంటారు అంటూ కామెంట్స్ కూడా వచ్చాయి. అసలే మాధురి పేరు వింటే ఒంటి కాలు మీద లేస్తున్న వాణికి, ఆమె కుమార్తెకి లేనిపోని అనుమానాలు వస్తాయి కదా…? ఇప్పుడు శ్రీను గారు, మాధురి ఉండే ఇల్లు మాధురి లాక్కునే ప్రయత్నం చేస్తుందనే కదా…? శ్రీను గారి ఆస్తుల కోసమే కదా మాధురి ఆయనతో ఉండాలి అనుకుంటుంది అంటూ వాళ్ళు పోరాటం చేస్తున్నారు.

ఎవరెన్ని మాట్లాడినా అసలు గొడవ జరిగేది ఆస్తి గురించే. మరి అలాంటప్పుడు మాధురి కొన్ని రోజులు రీల్స్ ఆపితే వచ్చే నష్టం ఏంటీ అనేది శ్రీను గారి భావన. ఈమె పోస్ట్ చేసే రీల్స్ అన్నీ కూడా మొబైల్ షూటింగ్ కాదు. సేపెరేట్ గా ఒక కెమెరా టీం, ఎడిటింగ్ టీం, మంచి మంచి లోకేషన్స్, ఖరీదైన కాస్టూమ్స్ తో చేస్తుంది. అన్నీ 4కె వీడియోలే. మేము ఇలా రోడ్డున పడితే నువ్వు మా సొమ్ము ఎంజాయ్ చేస్తున్నావని వాళ్లకు మండటంలో తప్పేం ఉంది. మాధురి రీల్స్ పోస్ట్ చేసినన్ని రోజులు ఈ సమస్య ఒక కొలిక్కి రాదంటున్నారు టెక్కలి జనాలు.