వైసీపీ లీడర్లు అంతా కళాకారులే.. దువ్వాడ ఎపిసోడ్‌తో కొత్త రచ్చ..
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం.. ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపుతోంది. అతడు ఆమె.. ఇంతలో ఈమె అన్నట్లు.. దువ్వాడ, ఆయన భార్య.. మధ్యలో మాధురి.. ఈ కుటుంబ కథా చిత్రమ్ రాజకీయాలను వేడెక్కిస్తోంది. దువ్వాడ ఎపిసోడ్‌తో.. వైసీపీ మరింతలా ఇరుకునపడినట్లు అవుతోంది. వైసీపీ నేతలు అంతా కళాకారులే అనే సెటైర్లు పేలుతున్నాయ్ సోషల్ మీడియాలో. ఇవాళ దువ్వాడ.. నిన్న విజయసాయి.. అంతకుముందు అవంతి, గోరంట్ల.. ఇలా ప్రతీ ఒక్కరి వివాదాలను ఫ్రెష్‌గా తెరమీదకు తీసుకువస్తున్నారు. ఇలా వైసీపీ నేతల సంబంధాలు ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతున్నాయ్. జగన్ అత్యంత ఎక్కువగా అభిమానించిన నేతల్లో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. అచ్చెన్నాయుడును… దువ్వాడ తిట్టిపోసే తీరుకు జగన్ ఫిదా అయ్యారనే చర్చ ఉంది. అలాంటిది ఇప్పుడు అదే దువ్వాడ..
వివాహేతర సంబంధంలో ఇరుక్కున్నారు. పార్టీని, జగన్‌ను ఇరుకున పెట్టారు. దువ్వాడ ఫ్యామిలీ స్టోరీలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు కనిపిస్తున్నాయ్.
తనను చంపేందుకు ప్రయత్నించారంటూ దువ్వాడ ఆరోపించారు. ఆయన చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వాణి. ఇద్దరి మధ్య జరిగిన హాట్ అండ్ హీట్ డైలాగ్ వార్ కంటివ్యూ అవుతోంది. దువ్వాడ ఇంట్లో దుమారానికి కారణం.. దివ్వెల మాధురి. తన భర్తను మాధురి ట్రాప్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేశారు వాణి. ఐతే తన భార్య అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని దువ్వాడ ఫైర్ అవుతున్నారు. కూతుళ్లకు తనపై ద్వేషం నూరిపోస్తుందని అంటున్నారు. ఇక అటు వాణి కూడా.. సమస్యకు పరిష్కారం లభించేంత వరకు వెనక్కి తగ్గేదిలే అంటున్నారు. దువ్వాడ ఇంటి ముందు ఆరు బయటే పడుకొని.. నిరసన తెలిపారు. ఈ సమయంలో దువ్వాడ వ్యవహరించిన తీరు మరింత చర్చకు దారి తీసింది. ఇలా అటు వాణి, ఇటు మాధురి.. మధ్యలో దువ్వాడ.. ఈ వ్యవహారం ఇప్పుడు టీడీపీకి ఆయుధంగా మారింది. ఇలాంటి సంబంధాలు, వివాదాలు.. వైసీపీలో కొత్తేం కాదు. విజయనగరం అగ్రనేత శ్రీను అలియాస్ డాన్ శ్రీను కూడా ఆ మధ్య ఇలాంటి వివాదాల్లోనే ఇరుక్కున్నాడు. రెండో పెళ్లి చేసుకొని ఏకంగా రెండో భార్య కుమార్తె పేరు మీద వ్యాపారాలు చేస్తున్నాడు. ఇక ఈ మధ్య విజయసాయి వ్యవహారం రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. దేవాదాయ కమిషనర్ శాంతి ఎపిసోడ్‌లో.. ఆమె భర్త విజయసాయి మీద చేసిన ఆరోపణలు.. ఇప్పటికీ రీసౌండ్ ఇస్తున్నాయ్. శాంతికి బిడ్డకు తండ్రి విజయసాయే అని సవాల్ విసిరారు కూడా ! దమ్ముంటే డీఎన్ఏ టెస్ట్‌కు రావాలి అంటూ శాంతి భర్త విసిరిన చాలెంజ్.. వైసీపీలో, ఏపీ రాజకీయాల్లో రచ్చ రేపింది. మూడేళ్ల కింద అప్పటి వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరుతో ఆడియో రేపిన రగడ.. ఇప్పటికీ మర్చిపోలేరు. పిచ్చివేషాలు వేయకుండా ఇంటికి రా… నా మాట విను, అన్ని రకాలుగా బాగానే ఉంటది. అరగంటలో పంపించేస్తా.. చెప్పిన మాట విను. నా కోసం అరగంట సమయం కూడా కేటాయించలేవా ఏం చేస్తున్నావ్ రాకపోతే నీ ఇష్టం.. వస్తే మంచి భవిష్యత్తు బాగుంటుందని ఓ మహిళతో అవంతి మాట్లాడుతున్నట్లుగా ఆడియో కొత్త వివాదం రేపింది. ఐతే ఆ తర్వాత ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదం అప్పట్లో రచ్చ రేపింది. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్‌లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోతో టీడీపీ, వైసీపీ మధ్య భారీ యుద్ధమే నడిచింది.
గౌరవప్రదమైన ఎంపీ స్థానంలో ఉండి ఇలా చేస్తారా అని టీడీపీ నేతలు నిలదీశారు. ఐతే అది ఫేక్ వీడియో అని మాధవ్ ఎంత కవర్ చేసినా లాభం లేకుండా పోయింది. ఇలా వైసీపీ నేతల చిలిపి పనులు.. ఒకదాని తర్వాత ఒకటి బయటకు వచ్చాయ్. అధికారం కోల్పోయాక మరిన్ని వస్తున్నాయ్. దువ్వాడ ఎపిసోడ్‌తో ఇది ఆగదని.. వైసీపీలో ఇలాంటి బాగోతాలు చాలా ఉన్నాయని టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. నేతల వ్యక్తిగత ప్రవర్తనను అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం వల్లే.. వైసీపీకి ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. గంట సేపు అంటూ అంబటి రాంబాబు.. అరగంట అంటూ అవంతి ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా.. వాళ్లకు పార్టీలో, ప్రభుత్వంలో పెద్దపీట వేశారు అంటే.. జగన్ తీరు అర్థం చేసుకోవచ్చు అని.. అందుకే కింది స్థాయి నేతలు కూడా రెచ్చిపోయారంటున్నారు.