RGV డైరెక్షన్లో దువ్వాడ బయోపిక్!
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పెయిర్ చాలా హాట్ టాపిక్‌గా మారిపోయారు. సింపుల్‌గా సెలబ్రెటీ హోదా సంపాదించుకున్నారు. వీళ్లిద్దరి లవ్‌స్టోరీలో కనిపించిన ట్విస్ట్‌లు అన్నీ ఇన్నీ కావు. అందుకే వీళ్ల రియల్ లవ్‌స్టోరీ బేస్ చేసుకుని రీల్ స్టోరీ చేయాలని నిర్ణయించుకున్నారు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పెయిర్ చాలా హాట్ టాపిక్‌గా మారిపోయారు. సింపుల్‌గా సెలబ్రెటీ హోదా సంపాదించుకున్నారు. వీళ్లిద్దరి లవ్‌స్టోరీలో కనిపించిన ట్విస్ట్‌లు అన్నీ ఇన్నీ కావు. అందుకే వీళ్ల రియల్ లవ్‌స్టోరీ బేస్ చేసుకుని రీల్ స్టోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ జీవితం ఆధారంగా ఓ సినిమా తీయాలని ఆయన ప్రేయసి దివ్వెల మాధురి డిసైడ్ అయ్యారట. దీనికోసం మంచి డైరెక్టర్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం. రీసెంట్గా శ్రీనివాస్ మాధురి ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ ట్రిప్‌లో కొందరు డైరెక్టర్లతో మాధురి చర్చలు కూడా జరిపారట. ఫుల్ లెంథ్ మూవీ తీసేందుకు కాన్సెప్ట్ రెడీ చేసుకుంటే.. తాను ప్రొడ్యూస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చేశారని టాక్. ఇప్పటికే దువ్వాడ లీడ్ రోల్లో ఓ షార్ట్ ఫిలిం చేసింది మాధురి.
కానీ వీళ్ల స్టోరీలో ఉన్న షాక్‌లు ట్విస్ట్‌లతో షార్ట్ ఫిలిం ఏంటి మెయిన్ ఫిలిం ఏకంగా రెండ పార్ట్లు కూడా చేయొచ్చు. దీంతో పోయేదేముంది బావ కోసం ఆమాత్రం చేయలేనా అనుకుని మెయిన్ ఫిలిం తీసేందుకు రెడీ అయ్యిందట మాధురు. వీల్లు తీయబోయే సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం శ్రీనివాస్ బాల్యం, లీడర్‌గా ఆయన ఎదిగిన తీరు పెళ్లి ఇవన్నీ ఉండబోతున్నాయట. సెకండ్ హాఫ్ మత్తం పెళ్లి తరువాత ఆయన జీవితం ఎలా మారిపోయింది. ఆయన జీవితంలోకి మాధురి ఎలా ఎంటర్ అయ్యింది అనే విషయాలు చూపించబోతున్నట్టు టాక్. ఇవన్నీ ఇలా ఉండే కాంట్రవర్షనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కూడా దువ్వాడ బయోపిక్ తీయడానికి రెడీ అవుతున్నాడు. నార్మల్‌గా వర్మకు కావాల్సిందే కాంట్రవర్సీ. దువ్వాడ స్టోరీలో అణువనువునా ఉన్నవే అవే. దీంతో త్వరలోనే దువ్వాడను కలిసి బయోపిక్ తీసేందుకు రైట్స్ తీసుకోబోతున్నారట వర్మ. మరి వీళ్లిద్దరి కెమిస్ట్రీని వర్మ తన స్టైల్లో ఎలా చూపించబోతున్నాడు.. ఆరు పదులు దాటిన వయసులో దువ్వాడ ఎలా పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది.