Sajjala Ramakrishna Reddy: టార్గెట్ సజ్జల.. ఈసీ వేటు తప్పదా?
ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రతిపక్షాలను సజ్జల ఎటాక్ చేయడంపై ఎన్నికల కమిషన్ అధికారులు కూడా తప్పుబడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా ఇదే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. సజ్జలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మీనా కోరినట్టు సమాచారం.
Sajjala Ramakrishna Reddy: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై ఈసీ ఫోకస్ పెట్టింది. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ.. రాజకీయ నేతలా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంతో సజ్జలపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రతిపక్షాలను సజ్జల ఎటాక్ చేయడంపై ఎన్నికల కమిషన్ అధికారులు కూడా తప్పుబడుతున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా ఇదే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు.
CHANDRABABU NAIDU: ప్రజల కోసం నిలబడ్డ హీరో పవన్.. ఏపీని కాపాడేందుకే కూటమి: చంద్రబాబు
సజ్జలపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని మీనా కోరినట్టు సమాచారం. చర్యలకు సంబంధించిన ఎన్నికల నియామవళిలో సరైన సమాచారం లేని కారణంగా ఈ లేఖ రాస్తున్నట్టు చెప్పారు మీనా. దీంతో సజ్జలపై చర్యలు తప్పవనే టాక్ ఎపీ పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. సజ్జలపై ఇలాంటి ఫిర్యాదులు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు కూడా సజ్జలపై ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ సలహాదారు హోదాలో ఉండి వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారంటూ ఈసీకి కంప్లైంట్ చేశారు. ప్రజల పన్నుతో వస్తున్న ప్రభుత్వ ఆదాయం నుంచి జీతం తీసుకుంటూ రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారంటూ చెప్పారు. ఇలాంటి వాళ్లు ప్రభుత్వం సలహాదారు హోదాలో ఉండేందుకు అనర్హులని.. వెంటనే సజ్జలపై చర్యలు తీసుకోవాలంటూ లేఖలో ఈసీని కోరారు అచ్చెన్నాయుడు. ఏపీ ప్రభుత్వానికి మొత్తం 40 మంది సలహాదారులు ఉన్నారు.
అందులో సజ్జలతో సహా 9 మందికి కేబినెట్ హోదా కూడా ఉంది. కానీ వాళ్లందరికంటే సజ్జల ఓవరాక్షన్ ఎక్కువయ్యింది అనేది దాదాపు అందరి నుంచీ వినిపిస్తున్న మాట. ఇదే విషయంలో వందల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషనర్ కూడా లేఖ రాశారు. దీంతో ఈసారి సజ్జలపై చర్యలు అనివార్యమని తెలుస్తోంది. మరి కేంద్ర ఎన్నికల సంఘం సజ్జలపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.