బ్రేకింగ్: మరో సీఎం జైలుకు…?
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కి సంబంధించి ఇటీవలి లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కి సంబంధించి ఇటీవలి లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 27న నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి, బావ మల్లికార్జున స్వామి తదితరుల పేర్లు ఉన్నాయి.
భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదు మేరకు లోకాయుక్త పోలీసుల విచారణకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశించింది. ముడా ద్వారా ఆయన భార్య బీఎం పార్వతికి 14 స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సిద్ధరామయ్యపై విచారణ జరిపేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆదేశాలు ఇచ్చారు. దీన్ని కర్ణాటక హైకోర్ట్ కు సమర్ధించింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని సిద్దరామయ్య ఆరోపించారు. కాగా అవినీతి ఆరోపణలతో ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులు ఇటీవల జైలుకి వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ జైలు జీవితాన్ని గడిపారు.