తెలంగాణా మంత్రిని వదలని ఈడీ
తెలంగాణమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇల్లు కార్యాలయాలు బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఉదయం నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

Ponguleti is anti-kamma.. this is his true nature
తెలంగాణమంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇల్లు కార్యాలయాలు బంధువుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఉదయం నుంచి ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని పొంగులేటి ఇల్లు, అనుచరులు, వ్యాపార కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
మినిస్టర్ వ్యాపారాలపైనే ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. జూబ్లీహిల్స్ మినిస్టర్ ఇంటి వద్ద సీఆర్పీఎఫ్ బలగాలను ఉంచి ఈడీ సోదాలు చేస్తోంది. గత ఎన్నికల సమయంలోను మినిస్టర్ ఇంటిపై దాడులు చేసింది ఈడీ. గతంలోనూ ఈడీ రైడ్స్ పై ముందే ఊహించారు పొంగులేటి. హిమాయత్ సాగర్, ఫామ్ హౌస్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.