Amit Shah: బీజేపీ అధికారంలోకి వస్తే.. ఉచిత అయోధ్య తీర్థయాత్ర.. అమిత్ షా హామీ..
మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య తీర్థయాత్ర ఏర్పాటు చేస్తాం. కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో ప్రార్థనాలు చేయడానికి, అయోధ్యను ఉచితంగా దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ప్రజల తరఫున ఈ ఖర్చును బీజేపీ ప్రభుత్వం భరిస్తుంది.

Union Home Minister Amit Shah will come to Hyderabad tomorrow night to participate in Suryapet public meeting on 27th of this month.
Amit Shah: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ (bjp) ప్రజల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త హామీల్ని గుప్పిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఉచిత అయోధ్య తీర్థయాత్ర అంటూ హామీ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత అయోధ్య తీర్థ యాత్ర అవకాశం కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లో అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు.
PAWAN KALYAN: ఈసారి పవన్ సీటు ఎక్కడ..? ఇప్పుడు వెతుక్కోకపోతే అప్పుడు కష్టం !
“మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య తీర్థయాత్ర ఏర్పాటు చేస్తాం. కొత్తగా నిర్మిస్తున్న రామాలయంలో ప్రార్థనాలు చేయడానికి, అయోధ్యను ఉచితంగా దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తాం. ప్రజల తరఫున ఈ ఖర్చును బీజేపీ ప్రభుత్వం భరిస్తుంది. ప్రజలందరికీ క్రమంగా ఈ సౌకర్యం కల్పిస్తాం. కాంగ్రెస్ నేతలు తమ కొడుకులు, కూతుళ్ల సంక్షేమం గురించే రాజకీయాలు చేస్తారు. రాహుల్ గాంధీ ఏ ఒక్క రోజు కూడా రామ మందిర నిర్మాణం గురించి పట్టించుకోలేదు. దేశ ప్రజలు అయోధ్యలో రామ మందిరం గురించి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దాదాపు 500 ఏళ్ల నుంచి పోరాటం జరుగుతుంది. ఎట్టకేలకు ప్రధాని మోదీ రామాలయానికి భూమిపూజ చేశారనన్నారు. చుక్క రక్తం చిందించకుండా, రామాలయ భూమి పూజ చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది. వచ్చే ఏడాది జనవరి నాటికి రామ మందిర నిర్మాణం పూర్తవుతుంది. జనవరి 22, 2024న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది.
మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పదేళ్ల హయాంలో మధ్యప్రదేశ్‌కు రూ.2 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో ఎంపీలకు రూ.6.35 లక్షల కోట్లు ఇచ్చింది. వివిధ పథకాల కింద రూ.5 లక్షల కోట్లు అదనంగా అందించాం. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితే రైతులకు రూ.6,000 నుంచి రూ.12,000 వరకు పెంచుతాం. రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతాం” అని అమిత్ షా అన్నారు.