ELECTION TICKETS : ఓడిపోతామని తెలుసు… అయినా టికెట్ తెచ్చుకో … వసూళ్లు చేసుకో ఎన్నికల్లో ఇదో రకం బిజినెస్
ఇండియాలో ఎన్నికలు వస్తున్నాయంటే.... అభ్యర్థులు పోటీ చేయడం కొందరు గెలవడం, మరి కొందరు ఓడిపోవడం ...ఇది మాత్రమే జనానికి తెలుసు. కానీ ఎలక్షన్స్ చుట్టూ సవాలక్ష వ్యవహారాలు, రకరకాల మోసాలు, వెరైటీ బిజినెస్ లు జరుగుతూ ఉంటాయి. ఇండియాలో ఎలక్షన్స్ అంటే ఒక పెద్ద పండగ. ఎన్నికలవేళ ఎవరి ప్లాన్లు వాళ్లకి ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొందరు నేతలు ఆడుతున్న ట్రిక్కీ గేమ్ చూస్తే అందరికీ ఆశ్చర్యం కలగకపోదు. వీళ్లకు సీట్ వచ్చినా.... ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిపోతామని కూడా కచ్చితంగా తెలుసు. అయినా ఏదో కిందా మీదా పడి సీట్ సంపాదిస్తారు. అక్కడికి ఏదో తమకు ఇష్టం లేనట్లు... అధిష్టానం ఒత్తిడి తెచ్చి పోటీ చేయిస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. అక్కడినుంచి అసలు వ్యవహారం మొదలుపెడతారు.
ఇండియాలో ఎన్నికలు వస్తున్నాయంటే…. అభ్యర్థులు పోటీ చేయడం కొందరు గెలవడం, మరి కొందరు ఓడిపోవడం …ఇది మాత్రమే జనానికి తెలుసు. కానీ ఎలక్షన్స్ చుట్టూ సవాలక్ష వ్యవహారాలు, రకరకాల మోసాలు, వెరైటీ బిజినెస్ లు జరుగుతూ ఉంటాయి. ఇండియాలో ఎలక్షన్స్ అంటే ఒక పెద్ద పండగ. ఎన్నికలవేళ ఎవరి ప్లాన్లు వాళ్లకి ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొందరు నేతలు ఆడుతున్న ట్రిక్కీ గేమ్ చూస్తే అందరికీ ఆశ్చర్యం కలగకపోదు. వీళ్లకు సీట్ వచ్చినా…. ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిపోతామని కూడా కచ్చితంగా తెలుసు. అయినా ఏదో కిందా మీదా పడి సీట్ సంపాదిస్తారు. అక్కడికి ఏదో తమకు ఇష్టం లేనట్లు… అధిష్టానం ఒత్తిడి తెచ్చి పోటీ చేయిస్తున్నట్లు బిల్డప్ ఇస్తారు. అక్కడినుంచి అసలు వ్యవహారం మొదలుపెడతారు.
ఇష్టం ఉన్నా… లేకున్నా పార్టీల నుంచి టిక్కెట్లు తెచ్చుకున్న లీడర్లు… పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, పార్టీ సానుభూతిపరులు, స్కూల్ యాజమాన్యాలు ఇలా రకరకాల వర్గాల నుంచి ఎన్నికల ఖర్చుల కోసం వసూళ్ళు చేస్తారు. సీటు వచ్చినా గెలవబోమని తెలిసినా ఒక ఎమ్మెల్యే కనీసం 50 కోట్లు వసూలు చేసుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాడు. తెలంగాణలో ఒక బీజేపీ ఎంపీ కాండేట్ కి తాను గెలవనని కచ్చితంగా తెలుసు. సర్వేలన్నీ ప్రత్యర్థి పార్టీ గెలుస్తుందని చెప్పేస్తున్నాయి…. అయినా సరే…. పట్టు బట్టి మరీ టికెట్ తెచ్చుకున్నాడు. పార్లమెంట్ నియోజకవర్గంలోని పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు రియల్ ఎస్టేట్ బిల్డర్ నుంచి వసూళ్ళు మొదలుపెట్టాడు. చాలా మాటకారి అయిన ఈ లీడర్ని ఇదేం పద్ధతి అని అడిగితే… నా దగ్గర రూపాయి లేదు ఎలక్షన్స్ కి అందుకనే ధర్మంగా ఫండింగ్ తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు. కానీ ప్రచారానికి గాని ఇక ఇతర దేనికైనా గానీ ఒక్క రూపాయి తీసి ఖర్చు పెట్టట్లేదు. మొత్తం మీద ఈ పెద్దమనిషి ఎన్నికలు పూర్తయ్యే నాటికి కనీసం 100 కోట్లు వెనకేసుకుంటాడని నియోజకవర్గంలో టాక్. తెలంగాణలో మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొంతమంది లీడర్లు ఇదే పద్ధతిలో వెళ్తున్నారు.
పార్టీకి వేవ్ ఉందనుకోండి… డబ్బులు ఖర్చు పెట్టినా…. ఖర్చు పెట్టకపోయినా మనం గెలుస్తాం. అలాంటప్పుడు నాలుగు రాళ్లు పోగేసుకోవాలి గానీ …పోగొట్టుకోవడం ఎందుకు? అని వసూలు చేస్తున్నారట అభ్యర్థులు. ఆ నియోజకవర్గాల్లోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, స్కూల్స్ కాలేజీ యాజమాన్యాలు, ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా ఎన్నికల విరాళాలు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఈ అభ్యర్థి రేపు గెలిచి ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే లేనిపోని తలనొప్పి. గెలిచినా… ఓడినా… మనం ఇవ్వాల్సింది ఇచ్చేయడమే అని విరాళాలు ఇచ్చేస్తున్నారు చాలామంది. ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీల అభ్యర్థులకీ ఇదే పని.
అధిష్టానం ఇచ్చే డబ్బులు ఎలక్షన్స్ కి ఖర్చు పెడతారు. అవి కాకుండా సపరేట్ గా స్థానిక వ్యాపారుల నుంచి వసూలు చేస్తున్నారు. మరికొందరు సొంత కులంలో బాగా డబ్బున్న వాళ్ళ నుంచి గుంజుతున్నారు. ఇంకొందరు ఎన్నారై స్నేహితులు, బంధువుల నుంచి కూడా లాగేస్తున్నారు. చలో మన వాడికి అధికారం వస్తే ఏదో ఒక ఉపయోగం కూడా ఉంటుంది కదా అని ఆర్థికంగా ఆదుకునే వాళ్ళు లేకపోలేదు. అధికార పార్టీ 15 నుంచి 20 కోట్లు ఒక్కో అభ్యర్థికి కచ్చితంగా ఇస్తుంది. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా వెనకేసుకునే అభ్యర్థులు కూడా ఇంకొందరు ఉన్నారు. పార్టీ వేవ్ ఉంటే గెలుస్తాం. వేవ్ లేకపోతే ఓడిపోతాం. దానికి అనవసరంగా ఎందుకు డబ్బులు వేస్ట్ చేసుకోవడం అని ఎన్నికల సందర్భంగా కూడా రాళ్లు పోగేసుకుంటున్న వాళ్లు చాలామంది ఉన్నారు. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఏపీలో ఒక పార్టీలో కీలక నేత… నెంబర్ 2 తన సన్నిహితులతో చెప్పిన మాట ఒకటే. మన పార్టీ గెలిచినా…. ఓడినా …నాకు వెయ్యి కోట్లు మిగలాలి. గెలిస్తే సంతోషం… అధికారంలో ఉంటాం. ఓడిపోతే వచ్చే ఐదేళ్లు పార్టీ నడుపుకోవడానికి వెయ్యి కోట్లు సమకూరుతాయి. ఎలాగైనా నష్టం లేదు. ఇది ఆ యువ నేత ఎన్నికల్లో అనుసరిస్తున్న వ్యూహం. తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరి వ్యూహం వాళ్లది. ఎవరి సంపాదన వాళ్ళది.