KCR: బీఆర్ఎస్‌లో మొదటిసారిగా ఓటమి భయం.. జనాన్ని ఆకట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు

రకరకాల కారణాలతో జనంలో ఆగ్రహం ఉన్న మాట వాస్తవం. ఐతే దీని తీవ్రత ఇంత ఉంటుందని కేసీఆర్‌ ఊహించలేదు. డ్యామేజ్‌ కంట్రోల్‌కి రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. సాధారణ రోజుల్లో కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకని కొందరు నాయకులను ఆయనే స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 7, 2023 | 03:41 PMLast Updated on: Nov 07, 2023 | 3:41 PM

Elections Defeat Tension In Kcr And Ktr

KCR: తెలంగాణలో కాంగ్రెస్ (CONGRESS) వేవ్ కనిపిస్తుండడం.. చాలా సర్వేల్లో హస్తం పార్టీ ముందంజలో ఉండడంతో బీఆర్ఎస్‌ (BRS) అధినాయకత్వంలో తెలియని భయం కనిపిస్తోంది. 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌లో ఇంత భయం కానీ.. అపనమ్మకం కానీ లేవు. 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌, టీడీపీ కలిసి పోటీ చేసినప్పుడు కేసీఆర్‌ వ్యూహం అద్భుతంగా ఫలించింది. ఆంధ్రావాళ్ళు తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలిపేసుకుంటారని.. టీడీపీ, కాంగ్రెస్‌ అందుకే కలిశాయని కేసీఆర్‌ చేసిన ప్రచారాన్ని తెలంగాణ జనాలు నమ్మారు. బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. పదేళ్ల కేసీఆర్‌ (KCR) పాలనపై జనాల్లో కాస్త అసంతృప్తి వచ్చింది. దీనికితోడు అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన, కేసీఆర్‌ కుటుంబ అహంకార ధోరణి, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కాంలో కవిత, ఉద్యోగ నోటిఫికేషన్‌లు రాకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో జనంలో ఆగ్రహం ఉన్న మాట వాస్తవం.

Varun Tej: ఓటీటీలో వరుణ్‌-లావణ్య పెళ్లి.. అమ్మో.. డీల్ అన్ని కోట్లా..

ఐతే దీని తీవ్రత ఇంత ఉంటుందని కేసీఆర్‌ ఊహించలేదు. డ్యామేజ్‌ కంట్రోల్‌కి రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. సాధారణ రోజుల్లో కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ కూడా దొరకని కొందరు నాయకులను ఆయనే స్వయంగా పార్టీలోకి ఆహ్వానించి చేర్చుకున్నారు. పీజేఆర్ కుమారుడు విష్ణు, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్, ఏపూరి సోమన్నలాంటి వాళ్లను స్వయంగా ఆహ్వానించి మరీ.. పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్‌లో టికెట్‌ రాని వాళ్లందరినీ పిలిచి మరీ కండువాలు కప్పారు. తెలంగాణ బీసీల్లో ముఖ్యమైన ముదిరాజ్‌లకు ఒక్కరికి టికెట్ ఇవ్వకపోవడంతో ఆ వర్గాన్ని సంతృప్తి పరచడానికి కాసాని జ్ఞానేశ్వర్‌ను చేర్చుకొని.. ఇప్పుడు తన వెంట తిప్పుకుంటున్నారు కేసీఆర్‌. ఇలా రకరకాల కసరత్తులు కేసీఆర్‌ చేస్తుంటే.. మరోవైపు కేటీఆర్ (KTR) తన సహజమైన అహంకార ధోరణి విడిచిపెట్టి జనంలో తిరుగుతున్నారు. టీవీ చానల్స్‌కి ఫోన్‌లు చేసి మరీ.. స్టూడియో లైవ్ ప్రసారాల్లో కూర్చుంటున్నారు.

Telangana politics : అక్కడ పొత్తు.. ఇక్కడ కత్తి ! తెలుగు రాష్ట్రాల్లో కంగాళీ రాజకీయం

మేధావులుగా ముద్రపడిన లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌లాంటి వాళ్లతో ఇంటర్వ్యూలు రికార్డ్ చేసి చానెల్స్‌లోనూ, అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోనూ వదులుతున్నారు. చివరికి రేడియోలను కూడా వదలడం లేదు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతానికి చేరడానికి గంగవ్వలాంటి వాళ్లతో కలిసి చికెన్ కర్రీ వండి మరీ తన బ్రాండ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు కేటీఆర్. తాను సామాన్యులకు చాలా దగ్గరగా ఉంటానని.. మధ్యతరగతి, ఆపై మధ్యతరగతి వాళ్లకు అనుకూలంగా ఉంటానని.. రూరల్, అర్బన్ ఓటర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్‌ ప్రసంగాల్లో పస తగ్గిపోవడంతో.. ఆ బాధ్యత ఇప్పుడు కేటీఆర్ తీసుకున్నారు. ఓ ఏడాది క్రితం వరకు పక్కన పెట్టిన హరీష్ రావును మళ్లీ రంగంలోకి దించారు కేసీఆర్‌. కేటీఆర్‌తో సమానంగా హరీష్ రావు ప్రతీ నియోజకవర్గంలో మీటింగ్‌లు పెట్టి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పనిలో పనిగా తన సొంత బ్రాండ్ పెంచుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే తెలంగాణలో అందరికీ ఎక్కడో డౌట్ వస్తోంది.

ఎందుకు కేసీఆర్‌ కుటుంబం ఇంతగా నీరు గారిపోతుంది. ఈసారి గెలవలేమనే డౌట్ వచ్చిందా.. ఆర్థికంగా ఇండియాలోనే ఏ పొలిటిషన్‌కి అందనంత స్థాయిలో కేసీఆర్‌ ఉన్నారు. ఎన్నికల్లో తన డబ్బులతో ఆయన ఏదైనా చేయగలుగుతారు. పటిష్టమైన కార్యవర్గం ఉంది. వ్యవస్థలు ఉన్నాయ్. ఇన్ని ఉండి కూడా ఎందుకు సందేహం వస్తుంది..? ఎందుకు తత్తరపడుతున్నారు..? ఇప్పుడు ఎవరికీ అర్థం కాని బిలియన్ డాలర్ల ప్రశ్న ఇది.