రేయ్ 420 పని చూడు: ఎర్రబెల్లి ఫైర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. సంవత్సరం పాలనలో రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. సంవత్సరం పాలనలో రేవంత్ రెడ్డి లక్ష కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదనన్నారు. తెలంగాణ అభివృద్ధి అయింది అంటే కేసీఆర్ వల్లనేనన్న ఎర్రబెల్లి రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
మాయమాటలతో అధికారంలోకి వచ్చారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. హామీలు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని వదలం అని వార్నింగ్ ఇచ్చారు. 420 హామీలు నిలబెట్టుకో రేవంత్ రెడ్డి అని డిమాండ్ చేసారు. పాడి కౌశిక్ రెడ్డి, హరీష్ రావును విడుదల చేయాలి అని డిమాండ్ చేసారు ఎర్రబెల్లి.