Etela Jamuna: హుజురాబాద్‌లో ఈటెలకు షాక్‌.. జమున నామినేషన్‌ తిరస్కరణ..

ఈటెల రాజేందర్‌ సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో ఆయనకు పెద్ద షాక్‌ తగిలింది. ఆయన భార్య ఈటెల జమున (Etela Jamuna) వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ నెల 10 నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియగా.. 13న నామినేషన్లను పరిశీలించారు అధికారులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2023 | 03:41 PMLast Updated on: Nov 14, 2023 | 3:41 PM

Etela Rajender Wife Jamunas Nomination Got Cancelled In Huzurabadetela Rajender Wife Jamunas Nomination Got Cancelled In Huzurabad

Etela Jamuna: తెలంగాణలో ఎన్నికల ప్రచార పోరు జోరుగా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. కీలక నేతలు రేవంత్‌ రెడ్డి, ఈటెల రాజేందర్‌ ఏకంగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా నామినేషన్‌ వేసి.. ఆయనను ఓడించేందుకు పావులు కదుపుతున్నారు. కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి, గజ్వేల్‌లో ఈటెల రాజేందర్‌.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నామినేషన్‌ వేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా ప్రతీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రచారం చేస్తున్నారు.

REVANTH REDDY: పదేళ్లలో కేసీఆర్ ఒక్క హామీని నెరవేర్చలేదు: రేవంత్ రెడ్డి

ఇలాంటి టైంలో ఈటెల రాజేందర్‌ సొంత నియోజకవర్గం హుజురాబాద్‌లో ఆయనకు పెద్ద షాక్‌ తగిలింది. ఆయన భార్య ఈటెల జమున (Etela Jamuna) వేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ నెల 10 నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియగా.. 13న నామినేషన్లను పరిశీలించారు అధికారులు. ఈ క్రమంలో హుజురాబాద్‌ నుంచి జమున దాఖలు చేసిన నామినేషన్‌ను తిరస్కరించినట్టు ప్రకటించారు. అయితే ఈ తిరస్కరణకు కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకూ అధికారులు చెప్పలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో 608 నామినేషన్లను ఇప్పటివరకూ తిరస్కరించారు. అందులో జమున నామినేషన్‌ కూడా ఉంది.

కేసీఆర్‌పై పోరు చేస్తున్న ఈటెలకు సొంత నియోజకవర్గంలో ఇలాంటి షాక్‌ తగలడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. వారం క్రితం నామినేషన్‌ వేసిన జమున నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టారు. ఈటెలకు మద్దతుగా అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. కానీ చివరి నిమిషంలో జమునకు అధికారులు షాకిచ్చారు.