కరిగిపోతున్న అంబాని ఆస్తి.. రిలియన్స్ కు కష్టాలు తప్పవా…?
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బిలినియర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాల్లో బిలియనర్లు గణనీయంగా పెరుగుతున్నారు.

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బిలినియర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ ఆసియా దేశాల్లో బిలియనర్లు గణనీయంగా పెరుగుతున్నారు. భారత్, పాకిస్తాన్ దేశాల్లో ఈ వేగం మరింత ఎక్కువగా ఉంది. భారత్ లో.. గత పదేళ్ళలో ఈ సంఖ్య భారీగా పెరిగిపోయింది. దశాబ్దం క్రితం, భారతదేశ బిలియనీర్ క్లబ్ ఒక ఉన్నత వర్గంగా ఉండేది. అప్పట్లో బిలియనీర్ అనే పదం చాలా గొప్పది. 2014లో కేవలం 70 మంది మాత్రమే మన దేశం నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించారు.
నేడు, అది 284 మందికి చేరింది. హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం.. బిలీనియర్ల సామ్రాజ్యం భారత్ లో వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. భారత్ లో.. పదేళ్లలో దాదాపు నాలుగు రెట్లు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానానికి చేరుకుంది. అమెరికాలో 870 మంది ఉండగా.. చైనాలో 823 మంది ఉన్నారు. ఈ సంవత్సరం 27 మంది పేర్లు తొలగించినా.. మన దేశంలో కొత్తగా 13 మంది కొత్త బిలియనీర్లు యాడ్ అయ్యారట. యూకే లో 150, జర్మనీ 141 స్విట్జర్లాండ్ 116 వంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల కంటే భారతదేశంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్నారు.
ఈ జాబితాలో గౌతమ్ అదానీ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నారు. తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం భారత్ లో రెండవ రిచెస్ట్ మ్యాన్ గా నిలిచారు అదాని. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం, అతని సంపద దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పెరిగింది. ఇక అదాని దెబ్బకు తన సంపదలో గణనీయమైన తగ్గుదల ఉన్నప్పటికీ.. ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత ధనవంతుడిగా హోదాను నిలుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా, ఎలోన్ మస్క్ ఐదు సంవత్సరాలలో నాల్గవసారి ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. అతని మొత్తం సంపద 13 శాతం పెరిగి రూ.8.4 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ గణనీయమైన వృద్ధి అతన్ని భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతుడిగా నిలిపింది. అయితే ఆదానితో పోలిస్తే ముఖేష్ అంబానీ వృద్ధి కాస్త వెనుకబడినా.. ఆసియాలో సంపన్నుడిగా నిలిచారు. అంబాని సంపద రూ.1 లక్ష కోట్లు తగ్గి రూ.8.6 లక్షల కోట్లకు చేరుకుంది. HCL టెక్నాలజీస్ సామ్రాజ్యానికి వారసురాలు రోష్ని నాడార్, రూ. 3.5 లక్షల కోట్ల నికర విలువతో ప్రపంచవ్యాప్తంగా ఐదవ సంపన్న మహిళగా నిలిచి వార్తల్లో నిలిచారు.
గ్లోబల్ టాప్ టెన్‌లో ఆమె అడుగు పెట్టారు. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు చెందిన దిలీప్ షాంఘ్వీ రూ. 2.5 లక్షల కోట్ల నికర విలువతో భారతదేశంలో నాల్గవ సంపన్న వ్యక్తిగా నిలిచారు. ‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025’ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,442 మంది బిలియనీర్లకు ర్యాంక్ ఇచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 5 శాతం బిలియనీర్లు పెరిగారు. ఇక ప్రపంచంలో అంబాని అంబానీ 17వ స్థానంలో నిలిచారు. జాబితా ప్రకారం అతని నికర ఆస్తుల విలువ 100 బిలియన్ డాలర్లు.
అదానీ.. అంబానీ కంటే వెనుకబడి, ప్రపంచవ్యాప్తంగా 18వ ధనవంతుడిగా నిలిచారు. అంబాని నికర ఆస్తుల విలువ 97 బిలియన్ల నికర విలువను కలిగి ఉన్నారు. అప్పులు పెరగడం, కీలక రంగాలలో డిమాండ్ తగ్గడం, రిలయన్స్ కు మార్కెట్ లో పోటీ పెరగడం వల్ల అంబానీ సంపద క్షీణించిందని హురున్ తెలిపింది. భారతదేశంలోని ఆరుగురు ధనవంతులలో సంపద కోల్పోయిన ఏకైక వ్యక్తి కూడా అంబానీనే. ఇక తెలుగు బిలీనియర్ల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. బిలీనియర్ల జాబితాలో 21 మంది తెలుగు వారు ఉన్నారు.
ఇక మన దేశ బిలీనియర్ల సంపద.. మన దేశ జీడీపీలో మూడో వంతు సమానం. వీరి మొత్తం సంపద గత ఏడాదితో పోలిస్తే 10 శాతం వృద్ధితో రూ.98 లక్షల కోట్ల కు పెరిగింది. సౌదీ అరేబియా జీడీపీ కంటే అధికం ఈ సంపాదన. కాగా ఈ జనవరి 15 నాటికి ఆస్తుల విలువ ఆధారంగా బిలియనీర్లకు ర్యాంకింగ్ లు కేటాయించినట్లు హురున్ తెలిపింది.