మహాకుంభ్‌ పొడగింపు ? క్లారిటీ ఇచ్చిన అధికారులు

ప్రపంచంలోని అతిపెద్ద హిందూ సమ్మేళనం మహాకుంభమేళా.. సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అంచనాలకు మించి భక్త జనం కుంభమేళాకు తరలి వస్తోంది. ఈ ఉత్సవం ముగిసేలోపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 19, 2025 | 12:35 PMLast Updated on: Feb 19, 2025 | 12:35 PM

Extension Of Mahakumbh Officials Who Gave Clarity

ప్రపంచంలోని అతిపెద్ద హిందూ సమ్మేళనం మహాకుంభమేళా.. సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అంచనాలకు మించి భక్త జనం కుంభమేళాకు తరలి వస్తోంది. ఈ ఉత్సవం ముగిసేలోపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేసారు. కానీ ఇప్పటికే 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ విషయాన్ని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాలో పుణ్యస్నానాలకు ఇక ఒక ముహూర్తమే మిగిలి ఉంది. దీంతో, తెలుగు రాష్ట్రాల నుంచి ప్రయాగ్ రాజ్‌కు భక్తుల తాకిడి పెరిగింది. కుంభమేళాకు భక్త జన వరద కొనసాగుతోంది.

పెద్ద సంఖ్యలో గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకూ 53 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కార్ ప్రకటించింది. ప్రపంచం లోనే ఇంత మంది భక్తులు పాల్గొన్న మొదటి కార్యక్రమంగా కుంభమేళా రికార్డు సృష్టించింది. జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతి పెద్ద సంగమంగా నిలిచింది.

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ మేళా ఈ నెల 26తో ముగియాల్సి ఉండగా.. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మరో రెండు రోజులు పొడిగించే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. అయితే, ప్రభుత్వం మాత్రం పొడిగింపు ఆలోచన లేదని తేల్చిచెబుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి రోజునే కుంభమేళా ముగుస్తుందని అధికారులు స్పష్టం చేసారు. ఇక.. ఈ రోజు తెలుగు రాష్ట్రాలకు పలువురు ప్రముఖులు ప్రయాగ్ రాజ్ చేరుకు న్నారు. పుణ్య స్నానాలు ఆచరించారు. కుంభమేలా ముగింపు సమయం సమీపిస్తుండటంతో భక్తుల రద్దీకి అనుగుణంగా తెలుగు రాష్ట్రాల నుంచి రైల్వే, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.