నందిని ఆవు నెయ్యి గురించి ఎవరికీ తెలియని నిజాలు!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందులు పరమ పవిత్రంగా భావించే దేవాలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం కూడా ఒకటి. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని శ్రీవారి సేవలో పాల్గొనాలని చాలా మంది హిందువులు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందులు పరమ పవిత్రంగా భావించే దేవాలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం కూడా ఒకటి. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని శ్రీవారి సేవలో పాల్గొనాలని చాలా మంది హిందువులు సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. అలాంటి స్థానం ఉన్న తిరుమల ఆలయ ప్రసాదం తయారీలో వాడుతున్న నందిని నెయ్యిలో జంతువుల అవశేశాలు కలుస్తున్నాయని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అవ్వడంతో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నందిని నెయ్యి వాడకం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో 2023కు ముందు వరకు శ్రీవారి లడ్డూ కోసం దాదాపు 50ఏళ్ల పాటు ఉపయోగించిన నందిని ఆవు నెయ్యి వార్తలకెక్కింది. అసలు ఈ నందిని నెయ్యి ఎందుకు అంత ఫేమస్? దీని ప్రత్యేకత ఏంటి అని అంతా మాట్లాడుకుంటున్నారు. దేశవ్యాప్తంగా డైరీ ఇండస్ట్రీలో నందిని మిల్క్ సంస్థకు ఓ మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. అమూల్ తరువాత ఇండియాలో ఎక్కువగా సేల్ అయ్యే బ్రాంబ్ ఇదే. 1974 క్వాలిటీ పాల ఉత్పత్తులు తయారు చేసేందుకు కర్నాటక ప్రభుత్వం కర్నాటక మిల్క్ ఫెడరేషన్ ఏర్పాటు చేసింది. ఇది కర్ణాటక డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద పనిచేస్తోంది. ఇదే KMF నందిని పేరుతో పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ నందిని మిల్క్.. ఆ రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒక భాగం. పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పన్నీర్, చీజ్, బటర్, ఫ్లేవర్డ్ మిల్క్ లాంటి డైరీ ఉత్పత్తులతో పాటు చాక్లెట్లు, బిస్కెట్లను కూడా నందిని మిల్క్ బ్రాండ్ కింద KMF తయారు చేస్తుంది. వీటికి మంచి డిమాండ్ ఉంటుంది.
అయితే పాలతో పాటు నందిని ఆవు నెయ్యికి ప్రత్యేక గుర్తింపు ఉంది. KMF ప్రకారం.. స్వచ్ఛమైన నందిని నెయ్యిని ఆవు పాలతో, సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తారు. దీని నాణ్యతను పరీక్షించేందుకు పక్కాగా చర్యలు తీసుకుంటారు. అనేకసార్లు క్వాలిటీ చెక్ జరిగిన తర్వాతే.. ఇది మార్కెట్‌లోకి వస్తుంది. అందుకే నందిని నెయ్యికి మంచి గుర్తింపు ఉంది. పైగా కొంత కాలం క్రితం వరకు తిరుపతి లడ్డూలో ఉపయోగించిన ఈ నందిని నెయ్యికి ఆగ్‌మార్క్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఆగ్‌మార్క్ అంటే.. అగ్రికల్చర్ మార్క్. క్వాలిటీతో పాటు ఇతర స్టాండర్డ్స్‌ని పాటించే ఉత్పత్తులకు మాత్రమే ఈ ఆగ్‌మార్క్ సర్టిఫికెట్ఇస్తారు. కస్టమర్లు కూడా ఆగ్‌మార్క్ సర్టిఫికేట్ ఉన్న ప్రోడక్ట్స్ కొనేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. నందిని నెయ్యి మార్కెట్‌లోకి వచ్చే ముందు ఇంత ప్రాసెస్, ఇంత క్వాలిటీ చెక్ ఉంటుంది కాబట్టే.. దీని ధర కూడా కాస్త ఎక్కువగా ఉంటుంది.
కర్ణాటకలో లీటర్ నందిని నెయ్యి ధర 670. 100ఎంఎల్ నందిని నెయ్యి నుంచి 897 కేలరీల ఎనర్జీ లభిస్తుంది. 99.7 గ్రాముల కార్బోహైడ్రేట్స్ వస్తాయి. అందుకే తిరుపతి లడ్డూ తయారీలో ఈ నెయ్యినే ఎక్కువగా వాడుతుంటారు. నెయ్యి నాణ్యత ఎంత ఎక్కువగా ఉంటే, లడ్డూ రుచి ఎంత గొప్పగా ఉంటుంది. 2023 వరకు శ్రీవారి లడ్డూల్లో నందిని నెయ్యినే వాడేవారు. కానీ నందిని పాల ధరలను పెంచుతున్నట్టు 2023లో కర్ణాటక కేబినెట్ ప్రకటించింది. ఫలితంగా నందిని నెయ్యి ధరలు కూడా పెరిగాయి. ధరల పెరుగుదలను గమనించిన అప్పటి జగన్ ప్రభుత్వం.. తక్కువ బిడ్డింగ్ వేసిన కంపెనీకి శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి కాంట్రాక్ట్‌ని ఇచ్చింది. కానీ ఆ కాంట్రాక్టర్ పంపిన నెయ్యి క్వాలిటీగా లేదు, అందులో జంతువుల అవశేషాలు కూడా ఉన్నాయనేది ఇప్పుడు వివాదం.